Jabardasth Avinash: జబర్దస్త్ కమెడియన్ జీవితంలో విషాదం.. బిడ్డను కోల్పొయిన అవినాష్.. ఎమోషనల్ పోస్ట్

త్వరలోనే తల్లిదండ్రులము కాబోతున్నామంటూ తన భార్య అనూజతో కలిసి శుభవార్తను ఇన్ స్టాలో షేర్ చేసుకున్నాడు. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ వీడియోలను, సీమంతం, ప్రెగ్నెన్సీ ఫోటోషూట్స్ అన్నింటిని అభిమానులతో పంచుకున్నాడు. అయితే ఇప్పుడు తన జరిగిన విషాదాన్ని తెలియజేస్తూ ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు. తన భార్య అనూజకు అబార్షన్ అయిందని.. తమ బిడ్డను కోల్పొయినట్లు తెలిపాడు.

Jabardasth Avinash: జబర్దస్త్ కమెడియన్ జీవితంలో విషాదం.. బిడ్డను కోల్పొయిన అవినాష్.. ఎమోషనల్ పోస్ట్
Jabardasth Avinash
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 07, 2024 | 9:11 AM

జబర్దస్త్ అవినాష్ త్వరలోనే తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితమే తండ్రి కాబోతున్న విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. త్వరలోనే తల్లిదండ్రులము కాబోతున్నామంటూ తన భార్య అనూజతో కలిసి శుభవార్తను ఇన్ స్టాలో షేర్ చేసుకున్నాడు. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ వీడియోలను, సీమంతం, ప్రెగ్నెన్సీ ఫోటోషూట్స్ అన్నింటిని అభిమానులతో పంచుకున్నాడు. అయితే ఇప్పుడు తన జరిగిన విషాదాన్ని తెలియజేస్తూ ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు అవినాష్. తన భార్య అనూజకు అబార్షన్ అయిందని.. తమ బిడ్డను కోల్పొయినట్లు తెలిపాడు. ఈ విషయాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేమని.. ఇక ఈ విషయం మీద ఎవరూ ఏ ప్రశ్నలు వేసి తమను బాధ పెట్టకండి అన్నాడు.

“నా లైఫ్ లో సంతోషమైన, బాధ అయినా… నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను. ఇప్పటి వరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను. కానీ మొదటి సారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందాం అని అనుకుంటున్నాను. మేము అమ్మ నాన్న అవ్వాలనే ఆ రోజు కోసం ఎదురు చూసాం. కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డనీ కొల్పోయాం. ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది. అంత తొందరగ మర్చిపోలేనిది. మీకు ఎప్పటికైనా చెప్పాలీ అన్న బాధ్యతతో ఈ విషయాన్నీ మీతో పంచుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు మాపై చూపించిన ప్రేమకీ థంక్యూ. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టవద్దు. మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనూజ అవినాష్..” అంటూ ఇన్ స్టాలో రాసుకొచ్చాడు అవినాష్.

దీంతో అవినాష్, అనూజలకు సోషల్ మీడియా వేదికగా సెలబ్రెటీలు, సన్నిహితులు, అభిమానులు ధైర్యం చెబుతున్నారు. స్ట్రాంగ్ గా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అవినాష్. ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొని మరింత పాపులర్ అయ్యాడు. ఈ షో దర్వాత 2021లో అనూజను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం బుల్లితెరపై ఈవెంట్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పచ్చి ఉల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా.? ఆ సమస్యలకు కూడా చెక్..
పచ్చి ఉల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా.? ఆ సమస్యలకు కూడా చెక్..
తాను హమాలీగా పనిచేసే సంస్థకి కూతురు ఆఫీసరుగా వస్తే.! వీడియో వైరల్
తాను హమాలీగా పనిచేసే సంస్థకి కూతురు ఆఫీసరుగా వస్తే.! వీడియో వైరల్
నీతా అంబానీ ధరించిన ఈ ప్యాంట్‌సూట్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు.!
నీతా అంబానీ ధరించిన ఈ ప్యాంట్‌సూట్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు.!
చిన్నారి ఉసురు తీసిన బిస్కెట్‌.! ఒక్కసారిగా ఊపిరాడక ఇబ్బంది..
చిన్నారి ఉసురు తీసిన బిస్కెట్‌.! ఒక్కసారిగా ఊపిరాడక ఇబ్బంది..
పొరుగింట్లో ప్రమాదం జరిగిందని చూడ్డానికి వెళ్తే ప్రాణాలే పోయాయి..
పొరుగింట్లో ప్రమాదం జరిగిందని చూడ్డానికి వెళ్తే ప్రాణాలే పోయాయి..
పాపం ఎంత వేధించారో.. ఏకంగా బైకే తగలబెట్టేశాడు.!
పాపం ఎంత వేధించారో.. ఏకంగా బైకే తగలబెట్టేశాడు.!
పెళ్లి కాని ప్రసాద్‌లకు స్వీట్ న్యూస్.! యువ రైతులకు పిల్లనిచ్చే..
పెళ్లి కాని ప్రసాద్‌లకు స్వీట్ న్యూస్.! యువ రైతులకు పిల్లనిచ్చే..
వెయిట్‌ లాస్‌ కోసం చపాతీ తింటున్నారా? అయితే డేంజర్‌లో పడ్డట్టే..!
వెయిట్‌ లాస్‌ కోసం చపాతీ తింటున్నారా? అయితే డేంజర్‌లో పడ్డట్టే..!
అరటి, యాపిల్ కలిపి తింటున్నారా.? ఈ విషయం తెలుసుకోవాల్సిందే.!
అరటి, యాపిల్ కలిపి తింటున్నారా.? ఈ విషయం తెలుసుకోవాల్సిందే.!
సీఎం రేవంత్ ప్రకటనపై రైతుల్లో ఆసక్తి.! రైతు పండుగ బహిరంగ సభ..
సీఎం రేవంత్ ప్రకటనపై రైతుల్లో ఆసక్తి.! రైతు పండుగ బహిరంగ సభ..