AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Rithu: స్టార్ కమెడియన్ కొడుకుతో జబర్దస్త్ రీతూ.. ‘న్యూ బిగినింగ్’ అంటూ ఫొటోలు షేర్ చేసిన నటి

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫేమస్ అయిన నటీనటుల్లో రీతౌ చౌదరి ఒకరు. హైపర్ ఆది టీమ్‌లో ఆమె చేసిన స్కిట్స్ బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. ఇక హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని అందం రీతౌ సొంతం. అందుకే సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి మస్త్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Jabardasth Rithu: స్టార్ కమెడియన్ కొడుకుతో జబర్దస్త్ రీతూ.. 'న్యూ బిగినింగ్' అంటూ ఫొటోలు షేర్ చేసిన నటి
Jabardast Rithu Chowdary
Basha Shek
|

Updated on: Nov 14, 2024 | 8:05 PM

Share

యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన రీతూ చౌదరి ప్రారంభంలో పలు సీరియల్స్, షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. అయితే జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర టీవీషోల్లోనూ సందడి చేస్తోందీ అందాల తార. అందంతో పాటు కామెడీ టైమింగ్ తో కుర్రకారును కవ్వించే ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ట్రెండ్ కు తగ్గట్లు డ్రెస్సులు వేస్తూ కుర్రకారకు నిద్ర లేకుండా చేసే ఈ అందాల తార పై అప్పుడప్పుడు ట్రోలింగ్ కూడా జరుగుతుంటుంది. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా తన పని తాను చేసుకుపోతుంటుందీ అమ్మడు . మోడ్రన్ డ్రెస్సులే కాదు అప్పుడప్పుడు సాంప్రదాయబద్ధంగా చీర కట్టి మెప్పించడం ఈ అందాల తార స్టైల్. అందుకే నెట్టింట ఈ ముద్దుగుమ్మకు భారీ క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రీతూ చౌదరి తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో స్విమ్మింగ్ పూల్ పక్కన ఓ అబ్బాయితో ఫొటోలకు ఫోజులిచ్చిన ఆమె ‘న్యూ బిగినింగ్’ అని క్యాప్షన్ ఇచ్చింది.

అసలు విషయమిదే..

ప్రస్తుతం రీతూ షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. నిజానికి రీతూ చౌదరి వ్యాపార రంగంలో అడుగుపెట్టింది. ఇక ఆమెతో కలిసి ఫొటోలో కనిపిస్తున్న కుర్రాడి పేరు విజయ్ రాజా. అతను మరెవరో కాదు టాలీవుడ్ సీనియర్ నటుడు , కమెడియన్ శివాజీ రాజా కుమారుడు. ఇప్పుడు రీతూతో కలిసి హాస్పిటాలిటీ, అతిథ్య రంగంలో sukha farm stay పేరుతో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు విజయ్. ఇందులో కంటైనర్ ఫార్మ్ స్టే , ప్రైవేట్ పూల్, ఔట్ డోర్ థియేటర్, ఈవెంట్ స్పేస్ , ఒకేసారి 300 మంది అతిథులు పాల్గొనేలా సకల సదుపాయాలు ఉన్నట్లు ఈ పోస్టులో చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

విజయ్ రాజాతో రీతూ చౌదరి..

అయితే రీతు చౌదరి పోస్టును చూసిన నెటిజన్లు చాలా మంది విజయ్ రాజాతో ఆమె ప్రేమలో ఉందని, త్వరలోనే ఇద్దరు పెళ్లి చేసుకోనున్నారని అభిప్రాయపడుతున్నారు.

రీతూ చౌదరి లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల