‘మ‌లుపు హీరోయిన్ నిక్కీ గల్రానీ’తో ఆది పెళ్లి?

కోలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ న‌టుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఆది పినిశెట్టి. ఏ పాత్ర అయినా త‌నదైన స్టైల్లో చేసి చూపిస్తారు ఆది పినిశెట్టి‌. దక్షిణాదిన మోస్ట్‌ బ్యాచులర్‌ హీరోల లిస్ట్‌లో ఆది పినిశెట్టి ఒకరు. ఇక తన పెళ్లిపై గత మూడు సంవత్సరాలుగా పలు ఇంటర్వ్యూలలో స్పందించిన ఆది..

'మ‌లుపు హీరోయిన్ నిక్కీ గల్రానీ'తో ఆది పెళ్లి?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 30, 2020 | 8:32 PM

కోలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ న‌టుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఆది పినిశెట్టి. ఏ పాత్ర అయినా త‌నదైన స్టైల్లో చేసి చూపిస్తారు ఆది పినిశెట్టి‌. దక్షిణాదిన మోస్ట్‌ బ్యాచులర్‌ హీరోల లిస్ట్‌లో ఆది పినిశెట్టి ఒకరు. ఇక తన పెళ్లిపై గత మూడు సంవత్సరాలుగా పలు ఇంటర్వ్యూలలో స్పందించిన ఆది.. అన్నీ కుదిరితే త్వరలోనే పెళ్లి చేసుకుంటానంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ పెళ్లి వార్తను మాత్రం ఈ హీరో ఇంతవరకు చెప్పలేదు. కాగా ఈ హీరో ఓ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే.

ఇప్ప‌టికే టాలీవుడ్‌లో యంగ్ హీరోలు నిఖిల్‌, నితిన్‌లు ఓ ఇంటివారైన సంగ‌తి తెలిసిందే. అలాగే రానా కూడా ఇప్ప‌టికే పెళ్లికి డేట్ ఫిక్స్ చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఇప్పుడు ఆది కూడా త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళం, మలయాళంలో పలు సినిమాల్లో నటించిన నిక్కీ గ‌ల్రానీని ఆది పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు త‌మిళ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం న‌డుస్తోంది. ప్ర‌ముఖ హీరోయిన్ సంజ‌న సోద‌రినే నిక్కీ గ‌ల్రానీ.

వీరిద్ద‌రూ గ‌త కొంత‌కాలంగా ప్రేమలో ఉన్నట్లు త‌మిళ మీడియాలో పలు మార్లు పుకార్లు వ‌స్తున్నాయి. వీరిద్దరు మలుపు, మరకతమణి చిత్రాల్లో నటించగా.. అవి రెండు మంచి విజయాన్ని సాధించాయి. ఆ క్రమంలోనే ఈ ఇద్దరు ప్రేమలో పడ్డట్లు టాక్ నడిచింది. ఇక వీటన్నింటికి బలం చేకూరుస్తూ.. ఇటీవల ఆది ఫ్యామిలీ ఫంక్షన్‌లో భాగమైంది నిక్కీ. ఆది పినిశెట్టి తండ్రి, ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి పుట్టినరోజు వేడుక ఇటీవల చెన్నైలో జరిగింది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ వేడుకకు ఎవరినీ పిలవలేదు. అయితే ఈ కార్యక్రమంలో నిక్కీ భాగమైంది. బర్త్‌డే వేడుకలకు సంబంధించి ఆది సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలలో నిక్కీ కూడా ఉంది. దీంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు మరోసారి రుజువైంది. మ‌రి ఈ వార్త‌ల‌పై వీరిద్ద‌రూ ఎలా స్పందిస్తార‌నేది చూడాలి.

Read More:

మొద్దు శ్రీను హంత‌కుడు అనారోగ్యంతో కాదు, క‌రోనాతోనే మృతి

వాట్సాప్‌లో మ‌రో ఇంట్రెస్టింగ్ ఫీచ‌ర్‌! శాశ్వ‌తంగా నోటిఫికేష‌న్లు మ్యూట్ చేసేలా..

ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?