‘దావూద్ ఇబ్ర‌హీం’ బ‌యోపిక్‌ను తీయ‌నున్న యాత్ర డైరెక్ట‌ర్‌..

ఈ క్ర‌మంలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌హి వీ రాఘ‌వ‌న్ కూడా వెబ్ సిరీస్‌పై దృష్టి పెట్టారు. అది కూడా వ‌రల్డ్‌ ఫేమ‌స్ డాన్ దావూద్ ఇబ్ర‌హీంపై బ‌యోపిక్ తీయ‌బోతున్నార‌ట‌. దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద‌యాత్ర‌పై సినిమా తీసి.. ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన మ‌హి వీ రాఘ‌వ.. మ‌రో సంచ‌ల‌న బ‌యోపిక్‌కి రెడీ అవుతున్న‌ట్లు..

'దావూద్ ఇబ్ర‌హీం' బ‌యోపిక్‌ను తీయ‌నున్న యాత్ర డైరెక్ట‌ర్‌..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 31, 2020 | 8:29 PM

కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా ఓటీటీలకు మంచి డిమాండ్ పెరిగింది. కోవిడ్ కార‌ణంగా థియేట‌ర్లు కూడా ఓపెన్ కాక‌పోవ‌డంతో.. ద‌ర్శ‌క నిర్మాత‌లంద‌రూ ఓటీటీ వేదిక‌ల‌గానే త‌మ సినిమాల‌ను రిలీజ్ చేస్తున్నారు. అందులోనూ వెబ్ సిరీస్‌లకు మంచి ప్రాముఖ్యత పెరిగింది. సినిమాలతో పాటు వీటికి కూడా మంచి డిమాండ్ వస్తూండటంతో టాప్ సెలబ్రిటీలు కూడా ఓటీటీల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్ప‌టికే బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు కూడా వెబ్ సిరీస్‌లలో కనిపిస్తున్నారు. ప్ర‌స్తుతం తెలుగులో కూడా వెబ్ సిరీస్‌లకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ క్ర‌మంలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌హి వీ రాఘ‌వ‌న్ కూడా వెబ్ సిరీస్‌పై దృష్టి పెట్టారు. అది కూడా వ‌రల్డ్‌ ఫేమ‌స్ డాన్ దావూద్ ఇబ్ర‌హీంపై బ‌యోపిక్ తీయ‌బోతున్నార‌ట‌.

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద‌యాత్ర‌పై సినిమా తీసి.. ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన మ‌హి వీ రాఘ‌వ.. మ‌రో సంచ‌ల‌న బ‌యోపిక్‌కి రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీం.. జీవిత ఆధారంగా ఓ వెబ్ సిరీస్‌ను ఈ డైరెక్టర్‌ తెర‌కెక్కించ‌నున్న‌ట్లు స‌మాచారం. అందులో ఆయ‌న జీవితానికి సంబంధించిన ఎన్నో కీల‌క విష‌యాల‌ను ద‌ర్శ‌కుడు చూపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌లే ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన మ‌హి వీ రాఘ‌వ.. వెబ్ సిరీస్‌ను తీయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

ఇందులో భాగంగానే దావూద్ బ‌యోపిక్‌ని తెరెక్కించ‌నున్న‌ట్లు స‌మాచారం. అయితే దావూద్ ఇబ్ర‌హీం జీవిత క‌థ‌ను తెర‌కెక్కించ‌డ‌మ‌న్న‌ది ఎంతో క్లిష్టంతో కూడుకునిన్న‌ది. ఎందుకంటే ఆయ‌న జీవితంలో ఎన్నో వివాదాలు ముడిప‌డి ఉన్నాయి. మ‌రి నిజంగానే ఆయ‌న రియ‌ల్ లైఫ్‌లో జ‌రిగిన‌వి ప్రేక్ష‌కుల‌కు చూపిస్తారా? అన్న‌ది తెలియాలంటే దావూద్ ఇబ్ర‌హీం బ‌యోపిక్ వ‌చ్చేంత వ‌ర‌కూ ఎదురు చూడాల్సిందే.

Read More:

ఆగ‌ష్టు 1 నుంచి మారే న్యూ రూల్స్ ఇవే..

‘స‌చిన్ కూతురు సారా’, ‘క్రికెట‌ర్ శుభ్ మాన్ గిల్’ మ‌ధ్య ఏం జ‌రుగుతోంది?

ప్ర‌ముఖ న‌టుడు శ‌ర‌త్ కుమార్‌కి షాక్‌.. ఫోన్ హ్యాక్ చేసి బెదిరింపులు..