ఆ క్రేజీ సినిమాకు నాని నో చెప్పాడా !

మ‌ల‌యాళ స్టార్ హీరో దుల్కర్ స‌ల్మాన్ ఇటీవ‌ల‌ పుట్టిన రోజు జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న న‌టించ‌బోయే కొత్త సినిమాల‌ ప్ర‌క‌ట‌న‌లు వ‌చ్చాయి.

ఆ క్రేజీ సినిమాకు నాని నో చెప్పాడా !

Hero Nani : మ‌ల‌యాళ స్టార్ హీరో దుల్కర్ స‌ల్మాన్ ఇటీవ‌ల‌ పుట్టిన రోజు జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న న‌టించ‌బోయే కొత్త సినిమాల‌ ప్ర‌క‌ట‌న‌లు వ‌చ్చాయి. అందులో లెఫ్టినెంట్​ అధికారి రామ్​ బయోపిక్ కూడా ఒక‌టి. హ‌ను రాఘ‌వ‌పూడి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు. ఇటీవలే ఇందుకు సంబంధించిన ప్రీలుక్​ను విడుదల చేసింది మూవీ యూనిట్. ‘మహానటి’ సినిమా నిర్మాతలు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే, తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ వెలుగులోకి వ‌చ్చింది.

ఈ బ‌యోపిక్ కోసం తొలుత నేచుర‌ల్ స్టార్ నానిని అప్రోచ్ అయ్యింద‌ట మూవీ యూనిట్. కానీ కొన్ని కార‌ర‌ణాల వ‌ల్ల నాని ఈ మూవీలో న‌టించేందుకు నో చెప్పాడ‌ట‌. మ‌రి దుల్కర్​​ సల్మాన్​ లెప్టినెంట్​ రామ్​ పాత్రలో ఎంత‌మేర రంజిప‌జేస్తాడో చూడాలి. ఇప్పటికే వచ్చిన ప్రీలుక్​ సినిమా ప్రేమికుల‌ను బాగా ఆక‌ట్టుకుంది. హను రాఘవపూడి నుంచి మ‌రో మ్యాజిక్ కోసం ప్రేక్ష‌కులు ఎదురు చూస్తున్నారు. విశాల్​ చంద్ర‌శేఖ‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. టైటిల్​ను త్వరలోనే అనౌన్స్ చేయ‌నున్నారు. ప్రస్తుతం హీరోయిన్ ఎంపిక ప‌నిలో బిజీగా ఉంది చిత్ర యూనిట్.

 

Read More : ‘బిగ్​బాస్ 4’ వీక్ష‌కుల‌కు గుడ్ న్యూస్..సూప‌ర్ అప్ డేట్

Click on your DTH Provider to Add TV9 Telugu