AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘బిగ్​బాస్ 4’ వీక్ష‌కుల‌కు గుడ్ న్యూస్..సూప‌ర్ అప్ డేట్

బిగ్‌ బాస్‌..తెలుగులో కూడా ఈ రియాల్టీ షో సూప‌ర్ సక్సెస్ అయ్యింది. మొద‌టి మూడు సీజ‌న్ల‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. అందుకే సీజ‌న్ 4 కోసం బుల్లితెర ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

'బిగ్​బాస్ 4' వీక్ష‌కుల‌కు గుడ్ న్యూస్..సూప‌ర్ అప్ డేట్
Ram Naramaneni
|

Updated on: Aug 01, 2020 | 6:54 AM

Share

Bigg Boss Telugu 4 : బిగ్‌ బాస్‌..తెలుగులో కూడా ఈ రియాల్టీ షో సూప‌ర్ సక్సెస్ అయ్యింది. మొద‌టి మూడు సీజ‌న్ల‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. అందుకే సీజ‌న్ 4 కోసం బుల్లితెర ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే క‌రోనా వ్యాప్తి, లాక్ డౌన్ నేప‌థ్యంలో ఇప్ప‌టివ‌ర‌కు ఈ షోపై సందిగ్ధ‌త నెల‌కొన‌గా, తాజా అప్ డేట్ తో ఫుల్ క్లారిటీ వ‌చ్చేసింది. బిగ్‌ బాస్ సీజ‌న్ 4 టీజ‌ర్ షూటింగ్ ప్రారంభించారు.

మూడో సీజన్​ వ్యాఖ్యాతగా అద‌ర‌గొట్టిన‌ హీరో నాగార్జున.. ఈ సీజన్​కూ హోస్ట్​గా సంద‌డి చేయ‌నున్నారు. ఇందులో భాగంగా జరిగిన యాడ్‌ షూటింగ్‌లో ఆయ‌న‌ పాల్గొన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన ప్ర‌త్యేక సెట్‌లో ఈ షూటింగ్ జరిగింది. ‘సోగ్గాడే చిన్నినాయన’ ఫేమ్ కల్యాణ్‌కృష్ణ దర్శకత్వం వహించారు. సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్ ప‌నిచేశారు. త్వరలోనే ఈ టీజ‌ర్ రిలీజ్ చేయనున్నారు. మరోవైపు బిగ్‌ బాస్‌ సీజన్‌-4లో పాల్గొనే వారి లిస్ట్ కూడా రెడీ చేస్తున్నారు. ఇప్పటికే ప‌లువురిని ఫైన‌ల్ చేసిన‌ట్టు స‌మాచారం. ఈ సీజన్‌లో పాల్గొనే వారికి ముందుగానే కొవిడ్‌-19 టెస్టులు చేసి, క్వారంటైన్‌కు తరలిస్తారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని క‌న్ఫామ్ అయిన తర్వాతే బిగ్ ‌బాస్‌ హౌస్‌లోకి అనుమతిస్తారు. కరోనా కారణంగా ఈసారి బిగ్ ‌బాస్‌ను జాగ్ర‌త్త‌లు తీసుకుని నిర్వహిస్తున్నారు.

Read More : ప్రకాశం జిల్లా : శానిటైజర్​ తాగి మృతిచెందిన వారిలో నలుగురికి కరోనా

Follow Us
ఏపీకి మరోసారి తుఫాన్ ముప్పు.. దూసుకొస్తున్న అల్పపీడనం..
ఏపీకి మరోసారి తుఫాన్ ముప్పు.. దూసుకొస్తున్న అల్పపీడనం..
బుల్లెట్ ట్రైన్ డ్రైవర్ కావాలంటే ఏం చేయాలి? ఎక్కడ దరఖాస్తు చేయాలి
బుల్లెట్ ట్రైన్ డ్రైవర్ కావాలంటే ఏం చేయాలి? ఎక్కడ దరఖాస్తు చేయాలి
ఆర్‌టీవో లేడీ ఇన్‌స్పెక్టర్ దారుణ హత్య..!
ఆర్‌టీవో లేడీ ఇన్‌స్పెక్టర్ దారుణ హత్య..!
పూజలో వెలిగించే అగరబత్తితో ఇంత ప్రమాదమా?
పూజలో వెలిగించే అగరబత్తితో ఇంత ప్రమాదమా?
జీవిత సత్యాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పిన ఇసుక కోట కథ..!
జీవిత సత్యాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పిన ఇసుక కోట కథ..!
కలలో పోగొట్టుకున్న డబ్బు తిరిగి దొరికిందా? ఈ శుభసూచన మీకేనట!
కలలో పోగొట్టుకున్న డబ్బు తిరిగి దొరికిందా? ఈ శుభసూచన మీకేనట!
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ రైస్.. ఇది పెడితే బాక్స్ ఖాళీనే
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ రైస్.. ఇది పెడితే బాక్స్ ఖాళీనే
షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్
షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్
ఫ్రిజ్‌లో ఎన్ని వాటర్ బాటిళ్లు పెట్టాలి? ఎక్కువ పెడితే ఏమవుతుంది?
ఫ్రిజ్‌లో ఎన్ని వాటర్ బాటిళ్లు పెట్టాలి? ఎక్కువ పెడితే ఏమవుతుంది?
MBBS, BDS విద్యార్థులకు సర్కార్ గుడ్‌న్యూస్‌.. స్టైపండ్ పెంపు
MBBS, BDS విద్యార్థులకు సర్కార్ గుడ్‌న్యూస్‌.. స్టైపండ్ పెంపు