Karthika Deepam: ట్రాక్ తప్పిన కార్తీక దీపం.. బీట్ చేసిన గృహలక్ష్మి.. వంటలక్కకు తగ్గిన ఆదరణ.. రీప్లేస్ చేసిన దేవత..
Karthika Deepam: తెలుగు బుల్లి తెరపై కార్తీక దీపం(Karthika Deepam) సీరియల్ ఓ సెన్సేషన్. ఆడ, మగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కార్తీక దీపం సీరియల్ ను ఆదరించారు. అందుకనే బుల్లి తెరపై..
Karthika Deepam: తెలుగు బుల్లి తెరపై కార్తీక దీపం(Karthika Deepam) సీరియల్ ఓ సెన్సేషన్. ఆడ, మగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కార్తీక దీపం సీరియల్ ను ఆదరించారు. అందుకనే బుల్లి తెరపై అనేక సంచలన రికార్డులను నమోదు చేసింది బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ సీరియల్ కార్తీక దీపం. ఇప్పటి వరకూ ఏ బుల్లి తెర నటీనటులను దక్కని అభిమానం ఈ సీరియల్ నటులకు దక్కింది అని చెప్పవచ్చు. వంటలక్క, డాక్టర్ బాబులే కాదు, అత్తగారు, విలన్ మోనిత, పనిమనిషి ప్రియమణి వంటి వారిని కూడా ఆదరించారు అంటే ఈ సీరియల్ కు ఉన్న క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు. సామాన్యుల నుంచి సెలబ్రేటిల వరకూ ఈ సీరియల్ సమయం వస్తుంటే..టివిలవైపు దృష్టి సారించేవారు అంటే అర్ధం చేసుకోవచ్చు.. అందుకనే ఈ కార్తీక దీపం సీరియల్ ను బుల్లితెర బహుబలిగా ముద్దుగా పిలుచుకునేవారు. అయితే చూస్తున్నారు ఆదరిస్తున్నారు కదా అంటూ.. రోజు రోజుకీ అర్ధం లేని కథ, కథనంతో సాగాదీసుకుంటూ పోతుండడంతో.. రేటింగ్ పై భారీ ఎఫెక్ట్ పడింది. ముఖ్యంగా మోనిత గర్భం దగ్గర ట్విస్ట్ నుంచి సీరియల్ ట్రాక్ తప్పిందని అందుకనే ఆదరణ తగ్గుతుందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. దాదాపు మూడేళ్ళ కు పైగా 16 నుంచి 20 మధ్య రేటింగ్ తో జైత్రయాత్ర కొనసాగించిన ఈ సీరియల్ ఇప్పుడు రిపీట్ సినిమాలకు వచ్చిన రేటింగ్ కూడా రావడం లేదు.. 11 నుంచి 14 మధ్య అతి కష్టంమీద టీఆర్పీ రేటింగ్ ను దక్కించుకుంటుంది. వంటలక్కకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ భారీగా తగ్గిపోయింది.
అయితే ఈ ఇదే ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ రేసులోకి వచ్చింది. అత్యంత ఆదరణ పొందుతున్న సీరియల్ గా నిలిచింది. ఎప్పుడో కార్తీక్ దీపం సీరియల్ ను క్రాస్ చేయగా.. తర్వాత దేవత సీరియల్ కూడా కార్తీక దీపాన్ని దాటుకుని మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజాగా కార్తీక దీపాన్ని బీట్ చేసిన సీరియల్ గా అదే ఛానల్ లో ప్రసారం అవుతున్న మరో సీరియల్. తాజాగా గృహలక్ష్మి సీరియల్ వంటలక్కకు షాక్ ఇచ్చింది. కార్తీక దీపం సీరియల్ రేటింగ్స్‌ను క్రాస్ చేసింది. ఇప్పటికైనా ట్రాక్ తప్పిన కార్తీక దీపం సీరియల్ ను ముగించకపోతే భవిష్యత్ లో మరింత దారుణమైన రేటింగ్ ఖాయమంటున్నారు కొందరు.
Also Read: