Tollywood: తస్సాదియ్యా.. నెట్టింట సెగలు పుట్టిస్తోన్న సీరియల్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా.. ?

సీరియల్లో పద్దతిగా.. అందం, అమాయకత్వంతోపాటు తెలివైన అమ్మాయిగా కనిపించి తెలుగు రాష్ట్రాల్లోని జనాల్లో హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయ్యింది. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా..

Tollywood: తస్సాదియ్యా.. నెట్టింట సెగలు పుట్టిస్తోన్న సీరియల్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా.. ?
Actress Pics
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 02, 2024 | 9:12 PM

బుల్లితెర ప్రేక్షకులకు ఆ అమ్మాయి సుపరిచితమే. ఒక్క సీరియల్ ద్వారా తెలుగు అడియన్స్ హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అందం, అభినయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఫ్యామిలీ ప్రేక్షకులను మెప్పించింది. ఇటీవలే ఆ వయ్యారి నటించిన సీరియల్ శుభం కార్డ్ పడింది. కొన్ని నెలలుగా బుల్లితెరకు దూరంగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు నెట్టింట గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేస్తుంది. ఇంతకీ ఆ వయ్యారి ఎవరో గుర్తుపట్టగలరా.. తను మరెవరో కాదండి.. గుప్పెడంత మనసు సీరియల్ నటి రక్ష గౌడ. బుల్లితెరపై కార్తీక్ దీపం సీరియల్ ద్వారా ఆ రేంజ్ టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకున్న ధారవాహిక గుప్పెడంత మనసు. ఇందులో రిషి, వసుధార పాత్రలకు సేపరేట్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది. 2020లో ప్రారంభమైన ఆ సీరియల్ అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని టాప్ స్థానంలో దూసుకుపోయింది.

ఈ సీరియల్లో వసుధార పాత్రలో కనిపించింది రక్షగౌడ. ఈ సీరియల్లో నటించిన ముఖేష్ గౌడ, వసుధార జోడిగా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇందులో అందం, అమాయకత్వం, తెలివైన అమ్మాయిగా నటించి తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. కొన్ని నెలల క్రితమే ఈ సీరియల్ కు శుభం కార్డ్ పడింది. అయితే సీరియల్లో చుడిదార్స్, చీరకట్టులో పద్దతిగా కనిపించిన రక్షగౌడ.. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫోజులతో రచ్చ చేస్తుంది. చాలా కాలం తర్వాత నెట్టింట యాక్టివ్ గా ఉంటున్న ఈ భామ.. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. అందులో రక్షగౌడ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

రక్షగౌడ కర్ణాటకలోని మైసూర్ ప్రాంతానికి చెందిన అమ్మాయి. బెంగుళూరులో స్టడీ కంప్లీట్ చేసిన రక్షా.. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనుకుంది. బీబీఎం పూర్తి చేసి నటనపై ఆసక్తితో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. రాధా రమణ సీరియల్ ద్వారా సినీరంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన రక్ష గౌడ.. ఆ తర్వాత పలు సీరియల్స్ చేసింది. కృష్ణవేణి సీరియల్ ద్వారా తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. ఆ తర్వాత గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది.

ఇది చదవండి : Tollywood : అదృష్టం కలిసిరాని అందాల రాశి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా.. ?

Dandupalyam Movie: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. దండుపాళ్యం హీరోయిన్‏ను చూస్తే షాకవ్వాల్సిందే..

Tollywood: నిర్మాతలు డబ్బులు ఇవ్వలేదు.. ఎన్నో ఇబ్బందులు పడిన హీరోయిన్.. చివరకు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.