పై ఫొటోలో చిరునవ్వులు చిందిస్తున్నఅమ్మాయిని గుర్తు పట్టారా? ఈ క్యూటీ ఇప్పుడు టాలీవుడ్ లో బాగా ఫేమస్. చాలా మంది లాగే షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత తన దైన యాంకరింగ్ తో బుల్లితెర పై మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్మాల్ స్క్రీన్‌పైనే బిజీగా ఉంటూనే సిల్వర్ స్క్రీన్‌పైనా సత్తా చాటింది. పలు సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ఆ మధ్యన ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ తోనూ యూట్యూబ్ ను షేక్ చేసింది. ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా ఎంతో చలాకీగా, సరదాగా ఉండే ఈ అమ్మాయి ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లోనూ సందడి చేస్తోంది. తన ఆట తీరు, మాట తీరుతో బుల్లితెర అభిమానులకు బాగా చేరువవుతోంది. ఈ సీజన్ కంటెస్టెంట్స్ అందరిలో ఈ బ్యూటీనే మోస్ట్ పాపులర్. తను తప్పితే హౌస్ లో ఆడియెన్స్ కు పెద్దగా తెలిసిన ముఖాలేవీ లేవు. ఇక టాస్కుల్లోనూ, గేమ్స్ ల్లోనూ తన ట్యాలెంట్ చూపిస్తోందీ అందాల తార. అలాగే మాటకు మాట ఇస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఆటతీరు చూస్తుంటే బిగ్ బాస్ టాప్-3 లో కచ్చితంగా నిలిచే ఛాన్స్ ఉంది. మరి ఈ క్యూటీ ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు స్టార్ యాంకర్ విష్ణుప్రియ.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. విష్ణుప్రియతో పాటు బెజవాడ బేబక్క, యష్మీ గౌడ, ప్రేరణ, కిర్రాక్ సీత, సోనియా ఆకుల, నైనిక ఈ సీజన్ లో తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. అయితే వీరితో పాటు హౌస్ మొత్తంలోనూ విష్ణు ప్రియకే బయటి నుంచి ఎక్కువగా మద్దతు లభిస్తుందని తెలుస్తోంది.
సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ ఇప్పుడు ఇలా ఉపయోగపడుతోంది. అందుకే రెండు వారాల్లోనూ నామినేషన్స్ లో నిలిచిన విష్ణుప్రియకు భారీగా ఓట్లు పడ్డాయి. ఫలితంగా గత రెండు వారాల ఓటింగ్ లోనూ అగ్రస్థానంలో నిలిచిందీ యాంకరమ్మ. తన జోరు చూస్తుంటే కచ్చితంగా టాప్-3లో నిలుస్తుందంటున్నారు ఫ్యాన్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.