Vijay Sethupathi: బిగ్‏బాస్ హోస్ట్‏గా విజయ్ సేతుపతి.. రెమ్యునరేషన్ ఎన్ని కోట్లు ఇస్తున్నారంటే..

|

Sep 08, 2024 | 7:41 PM

సెప్టెంబర్ 1న ప్రారంభమైన తెలుగు బిగ్‏బాస్ సీజన్ 8లో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇక త్వరలోనే తమిళంలోనూ బిగ్‏బాస్ సీజన్ 8 స్టార్ట్ కానుంది. అయితే ఇన్నాళ్లు తమిళ్ బిగ్‏బాస్ షో హోస్ట్ గా కమల్ హాసన్ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ షో నుంచి ఆయన తప్పుకోవడంతో కమల్ స్థానంలోకి కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి వచ్చారు. ఇక నుంచి తమిళ్ బిగ్‏బాస్ షో హోస్ట్ గా మక్కల్ సెల్వన్ కొనసాగనున్నారు.

Vijay Sethupathi: బిగ్‏బాస్ హోస్ట్‏గా విజయ్ సేతుపతి.. రెమ్యునరేషన్ ఎన్ని కోట్లు ఇస్తున్నారంటే..
Vijay Sethupathi
Follow us on

దేశవ్యాప్తంగా బిగ్‏బాస్ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఓవైపు విమర్శలు వస్తున్నప్పటికీ ఈ షోను వీక్షించే అడియన్స్ సంఖ్య తగ్గడం లేదు. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళంలోనూ ఈ షోకు మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. ఇప్పటికే హిందీలో 17 సీజన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇక తెలుగులో 7 సీజన్స్ విజయవంతంగా పూర్తికాగా.. ఇప్పుడు సీజన్ 8 రన్ అవుతుంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన తెలుగు బిగ్‏బాస్ సీజన్ 8లో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇక త్వరలోనే తమిళంలోనూ బిగ్‏బాస్ సీజన్ 8 స్టార్ట్ కానుంది. అయితే ఇన్నాళ్లు తమిళ్ బిగ్‏బాస్ షో హోస్ట్ గా కమల్ హాసన్ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ షో నుంచి ఆయన తప్పుకోవడంతో కమల్ స్థానంలోకి కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి వచ్చారు. ఇక నుంచి తమిళ్ బిగ్‏బాస్ షో హోస్ట్ గా మక్కల్ సెల్వన్ కొనసాగనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇదివరకే ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు.

అయితే ఈ షో కోసం విజయ్ సేతుపతి తీసుకునే రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చే నడుస్తుంది. ఇటీవలే మహారాజా చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రం దాదాపు రూ.120 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ సేతుపతి.. ఇప్పుడు బిగ్‏బాస్ హోస్ట్ గా బుల్లితెర అడియన్స్ ముందుకు రానున్నారు.

100 రోజులపాటు సాగే ఈ బిగ్‏బాస్ సీజన్ 8కు ఆయనకు భారీ మొత్తంలోనే ఆఫర్ చేశారట. ప్రతి శనివారం, ఆదివారం మాత్రమే బిగ్‏బాస్ స్టేజ్ పై సందడి చేయనున్నారు. అందుకు ఆయనకు సుమారు రూ.60 కోట్ల పారితోషికం ఇస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం విజయ్ సేతుపతి ఒక్కో సినిమాకు రూ.20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్. అలాగే ఒక్క యాడ్ కోసం రూ. 1 కోటి వరకు తీసుకుంటారట. అలాంటింది… దాదాపు 100 రోజులు నడిచే బిగ్‏బాస్ సీజన్ 8 షో కోసం సేతుపతి తీసుకునే రెమ్యునరేషన్ చాలా తక్కువే అంటున్నారు ఫ్యాన్స్. ఇక కమల్ తర్వాత బిగ్‏బాస్ హోస్ట్ గా విజయ్ ఎంపిక కరెక్ట్ అంటున్నారు బిగ్‏బాస్ అభిమానులు. గతంలో ఈ షో కోసం కమల్ హాసన్ రూ.120 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నారట.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.