Tollywood: భర్తకే భరణం ఇచ్చేసిన స్టార్ హీరోయిన్.. ఎందుకో తెలిస్తే ఈ ముద్దుగుమ్మను మెచ్చుకోకుండా ఉండలేరు
స్టార్ హీరో రవి మోహన్ (జయం రవి), ఆయన భర్త ఆర్తి విడాకుల వ్యవహారం ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తనకు విడాకులు కావాల్సిందేనని హీరో తెగేసి చెప్పడం, భార్య కూడా తనకు నెలకు రూ.40 లక్షల భరణం ఇప్పించాలనడం సంచలనంగా మారింది.

ఈ మధ్యన సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు, విడాకులు సర్వసాధారణమైపోయాయి. చాలా మంది సెలబ్రిటీలు తమ భాగస్వాములతో సర్దుకుపోలేక కోర్టు మెట్లెక్కుతున్నారు. విడాకులు కావాల్సిందేనని పట్టుబడుతున్నారు. అలా తాజాగా మరో సెలబ్రిటీ జంట విడాకుల కోసం కోర్టు మెట్లెక్కింది. వారే కోలీవుడ్ స్టార్ కపుల్ రవి మోహన్- ఆర్తి. 2009లో ప్రేమించి పెళ్లిచేసుకున్న ఈ జంట ఇప్పుడు కలిసి ఉండలేమంటోంది. 16 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు చెప్పాలనుకుంటోంది. ఈ క్రమంలోనే రవి మోహన్ గతేడాది విడాకుల విషయాన్ని బయట పెట్టాడు. అయితే ఫ్యామిలీ కోర్టు వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చాలని చాలా ట్రై చేసింది. కౌన్సెలింగ్ కూడా ఇచ్చింది. కానీ నటుడు మాత్రం తన భార్యతో విడాకులు కావాల్సిందేనని పట్టుబడుతున్నాడు. దీంతో ప్రతిగా ఆర్తి కూడా తనకు నెలకు రూ. 40 లక్షల విడాకుల భరణం ఇప్పించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఈ వ్యవహారంపై నెట్టింట భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ‘ఇవేమైనా పెళ్లి విడాకులా? లేక బిజినెస్ సెటిల్మెంటా?’ అని కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇదొక్కటే కాదు గతంలో చాహల్- ధనశ్రీ వర్మ విడాకుల వ్యవహారంలోనూ ఇలాగే జరిగింది. భరణం విషయంలో స్టార్ సెలబ్రిటీలపై తరచూ విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళల విషయంలో..
అయితే ఒక స్టార్ హీరోయిన్ రివర్స్ లో తన భర్తకే భరణం ఇచ్చేసింది. తన కుమార్తె కోసం తన ఆస్తిని సైతం వదులుకోవడానికి రెడీ అయ్యింది. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ టీవీ నటి శ్వేత తివారి. 1998లో రాజా చౌదరినీ వివాహం చేసుకుందీ అందాల తార. కానీ రాజా మద్యం అలవాట్లు, గృహహింసను శ్వేత భరించలేకపోయింది. దీంతో విడాకుల కోసం కోర్టు మెట్లెక్కింది. వీరిద్దరి మధ్య దాదాపు ఐదేళ్ల పాటు న్యాయపోరాటం సాగింది. చివరకు రాజా చౌదరితో విడాకుల సెటిల్‌మెంట్‌లో భాగంగా, రూ. 93 లక్షల విలువైన ఫ్లాట్ ను భరణంగా ఇచ్చిందట. తమ కుమార్తె పలక్ తివారీ సంరక్షణ కోసం శ్వేత తాను ఉన్న ఆస్తిని కూడా వదులుకోవడానికే సిద్ధమైంది.
శ్వేతా తివారీ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
‘నా జీవితంలో, నా కుమార్తె పలక్ కంటే గొప్పది ఏదీ లేదు. నేను సంపాదించినదంతా ఆమె కోసమే. ఒక తల్లిగా ఆమెకు బంగారు భవిష్యత్ ను అందించడమే నా లక్ష్యం’ అని అంటోంది శ్వేతా తివారీ. ఎంతైనా ఈ అమ్మ ప్రేమను మెచ్చుకోవాల్సిందే.
కూతురితో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








