Brahmanandam: బ్రహ్మానందం స్టైల్ సామ్ కాపీ చేసిందంటున్న నెటిజన్స్.. ఎంత దుర్మార్గమంటూ బ్రహ్మీ రియాక్షన్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జు్న్.. డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. డిసంబర్ 17న పాన్ ఇండియా లెవల్లో

ఐకాన్ స్టార్ అల్లు అర్జు్న్.. డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. డిసంబర్ 17న పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా సూపరి హిట్ అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం సినిమానే కాకుండా.. పుష్పలోని ప్రతి పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా సమంత చేసిన స్పెషల్ సాంగ్ ఊ అంటావా మావా.. ఊహు అంటావా పాట సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఈ పాటకు అనుహ్యమైన రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. సమంత స్టెప్పులు.. ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సాంగ్ లిరిక్స్, వాయిస్ శ్రోతలు ఫిదా అయ్యారు. ఓ వైపు యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఈ పాటపై నెట్టింట్లో మీమ్స్, ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి.
ఓవైపు ఈపాటపై ఏపీ పురుషుల సంఘం హైకోర్టును ఆశ్రయించగా.. ఈపాట లిరిక్స్‌పై ఊ అంటావా పాప..ఊహు అంటావా పాప అంటూ పేరడి సాంగ్‌ను విడుదల చేశారు. అయితే ఈపాటలో సమంత వేసిన స్టెప్పుపై సోషల్ మీడియాలో ఓ మీమ్ తెగ వైరల్ అవుతోంది. ఇందులో సమంత వేసిన ఓ స్టెప్ గతంలో బ్రహ్మానందం ఇచ్చిన ఫోజుకు సరిగ్గా సెట్ అయ్యింది. దీంతో మా బ్రహ్మానందం స్టైల్ ను కాపీ చేయకండి సామ్.. అంటూ మీమ్స్ చేసేశారు. దీంతో ఇప్పుడు ఈ ఫోటో తెగ వైరల్ అవుతుంది. తాజాగా ఈ మీమ్ పై బ్రహ్మనందం స్పందించారు. ఓ బుల్లితెర ఛానల్లో స్పెషల్ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన ఆయన ఈ మీమ్ చూసి..నేను ఎప్పుడో 25 ఏళ్ల క్రితం అలా అన్నాను.. ఇప్పుడు సమంత కాపీ కొట్టిందని అనడం ఎంత దుర్మార్గం.. అని బ్రహ్మానందం అని అన్నారు.
View this post on Instagram
Also Read: RRR Song: ఆ పాటను కాపీ చేశారా ? ఆర్ఆర్ఆర్ కొమురం భీముడో సాంగ్ పై నెటిజన్స్ అసహనం..
ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సరికొత్త రికార్డ్.. 24 గంటల్లో అత్యధికంగా వీక్షించిన ట్రైలర్‌గా గుర్తింపు
Bangarraju Movie: షూటింగ్ పూర్తి చేసిన బంగార్రాజు.. త్వరలోనే ప్రమోషన్స్ పై దృష్టి పెట్టనున్న టీమ్..




