Bigg Boss: ఛీ.. ఛీ.. కంటెస్టెంట్ల నోటి వెంట అలాంటి నీచపు మాటలా? బిగ్‌బాస్ షోపై పోలీసులకు ఫిర్యాదు

బిగ్ బాస్ రియాలిటీ షోలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ లుగా మారుతున్నాయి.ముఖ్యంగా కంటెస్టెంట్ల మాటలు, చర్యలు శ్రుతిమించుతున్నాయి. కుల, మత, జాత్యాహంకార వివక్ష వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఈ రియాలిటీ షోలపై వరుసగా పోలీస్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఈ బిగ్ బాస్ రియాలిటీ షో మరో వివాదంలో చిక్కుకుంది.

Bigg Boss: ఛీ.. ఛీ.. కంటెస్టెంట్ల నోటి వెంట అలాంటి నీచపు మాటలా? బిగ్‌బాస్ షోపై పోలీసులకు ఫిర్యాదు
Bigg Boss Reality Show

Updated on: Nov 21, 2025 | 7:57 PM

ప్రస్తుతం ‘బిగ్ బాస్’ సీజన్ నడుస్తోంది. ఇప్పటికే మలయాళంలో ఈ రియాలిటీ షో కంప్లీట్ కాగా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో ఇంకా రన్ అవుతోంది. అయితే బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తోన్న ఈ సెలబ్రిటీ రియాలిటీ షోలు వరుసగా వివాదాలను కూడా ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ‘బిగ్ బాస్ కన్నడ సీజన్ 12’ రియాలిటీ షో తరచూ వివాదంలో చిక్కుకుంటోంది. ముఖ్యంగా హౌస్ లోని కంటెస్టెంట్స్ చర్యలు, మాటలు పరిధి దాటుతున్నాయి. దీంతో ఈ రియాలిటీషోపై రోజు రోజుకు విమర్శలు ఎక్కువవుతున్నాయి. బి గ్ బాస్ నిర్వాహకులపై పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదులు నమోదవుతున్నాయి. తాజాగా బిగ్ బాస్ షో హోస్ట్ ,హీరో కిచ్చా సుదీప్‌పై కూడా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది ! అవును కంటెస్టెంట్ రక్షిత శెట్టిని హోస్ట్ సుదీప్ వేధించాడని బెంగళూరు సౌత్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు నమోదైంది. కాగా గత 12 సీజన్లుగా కిచ్చా సుదీప్ బిగ్ బాస్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన వందలాది మంది కంటెస్టెంట్లను చూసి ఉంటారు. ముఖ్యంగా స్ తప్పు చేసిన హౌస్ మేట్స్ కు వీకెండ్ లో బాగానే తలంటుతుంటాడు సుదీప్. ఈ సీజన్ లోనూ పరిధి దాటిన కంటెస్టెంట్లకు బాగానే క్లాస్ తీసుకుంటున్నాడీ హీరో. ఈ క్రమంలోనే ఆయన ఇటీవల రక్షితా శెట్టికి క్లాస్ తీసుకున్నాడు. ఇప్పుడిదే కాంట్రవర్సీకి దారి తీసింది. రక్షితా శెట్టిపై సుదీప్ చేసిన కామెంట్స్ పై కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రముఖ సామాజిక కార్యకర్త సంధ్య బిగ్ బాస్ నిర్వాహకులు, హోస్ట్ సుదీప్ పై DySP కి ఫిర్యాదు చేశారు. ‘సుదీప్ రక్షితను అవమానించాడు. ఆయనతో పాటు నేను అశ్విని గౌడపై కూడా ఫిర్యాదు చేశాను. వీరు వాడిన కొన్ని పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయి’ అంటూ సంధ్య ఫిర్యాదులో పేర్కొంది. అలాగే ఓ ఎపిసోడ్‌లో రషికపై మరో కంటెస్టెంట్‌ మాలవల్లి నటరాజ్ (గిల్లి) శారీరకంగా దాడి చేశాడని సంధ్య మండి పడింది. అంతేకాకుండా కర్ణాటక రక్షణ వేదికతో సంబంధం ఉన్న పోటీదారు అశ్విని గౌడను ఉద్దేశించి కుల వివక్ష వ్యాఖ్యలు చేయడం, రక్షిత నేపథ్యాన్ని అపహాస్యం చేశారంటూ ఫిర్యాదులో వివరించింది. అయితే ఈ వివాదంపై అటు బిగ్ బాస్ నిర్వాహకులు గానీ, హోస్ట్ కిచ్చా సుదీప్ కానీ ఇంకా స్పందించలేదు.

కొన్ని రోజుల ముందే నటరాజ్ (గిల్లి) పై మహిళా కమిషన్‌లో ఫిర్యాదు నమోదైంది. బిగ్ బాస్ హౌస్ లో అమ్మాయిలను గిల్లీ హింసిస్తున్నాడంటూ కుషాల అనే మహిళ ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలని మహిళా కమిషన్ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసింది. ఈ వివాదం కొనసాగుతుండగానే ఇప్పుడు మరో కాంట్రవర్సీ వచ్చి పడింది. ‘బిగ్ బాస్ కన్నడ సీజన్ 12’ 50 రోజులు పూర్తి చేసుకుని ముందుకు సాగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.