Brahmamudi, November 9th Episode: రెచ్చిపోయిన ధాన్యలక్ష్మి.. అప్పూకి డబ్బులు పడేసి వదిలించుకో..

ఇక అనామిక, రుద్రాణి అనుకున్నట్టుగా బాంబ్ పేల్చేస్తారు. అందరూ సంతోషంగా ఉండే సమయంలో.. అంతకంటే పెద్ద బాంబ్ పేలుతుంది టీవీలో రండి అని రుద్రాణి అంటుంది. అందులో కళ్యాణ్ ఆటో నడుపుతున్న న్యూస్ చూసి అందరూ షాక్ అవుతారు. ఇక వీర లెవల్‌లో రెచ్చిపోతుంది ధాన్యలక్ష్మి..

Brahmamudi, November 9th Episode: రెచ్చిపోయిన ధాన్యలక్ష్మి.. అప్పూకి డబ్బులు పడేసి వదిలించుకో..
BrahmamudiImage Credit source: Disney Hot star
Follow us
Chinni Enni

|

Updated on: Nov 09, 2024 | 3:10 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. తన మెడలో హారం వేయాలని రాజ్‌ని బ్లాక్ మెయిల్ చేస్తుంది కావ్య. కాక్ రోచ్ వీడియో చూపించి బెదిరిస్తుంది. అందుకు రాజ్ చేసేది ఏమీ లేక ఇక చచ్చినట్టు ఒప్పుకుంటాడు. ఇక హారాన్ని కావ్య మెడలో వేస్తాడు రాజ్. ఆ తర్వాత కళ్యాణ్‌కు ఓ గిఫ్ట్‌ ఇస్తుంది కళావతి. అది ఓపెన్ చేసి చూడగా పెన్ ఉంటుంది. అది చూసి కళ్యాణ్ సంతోష పడి థాంక్స్ అని చెబుతాడు. ఇది మామూలు పెన్ కాదు ఓల్డేజ్ హోమ్‌కి డొనేషన్ ఇవ్వడం కోసం ఈ పెన్ వేలం వేస్తే నేను కొన్నాను. ఇది మీరు ఎప్పటి నుంచో కలవాలి అనుకుంటున్న మీ ఫేవరెట్ రైటర్ అని చెప్పగానే కళ్యాణ్ మరింత హ్యాపీగా ఫీల్ అవుతాడు. మీరు రాసే పాటలన్నీ బాగుంటున్నాయి.. ఇంకా మంచి పాటలు రాయాలని కావ్య అంటుంది. ఏంటి నువ్వు సినిమా పాటలు రాస్తున్నావా అని అందరూ అడిగే సరికి.. నేను ఇంకా నేను నేనుగా పాటలు రాయడం లేదు.. లిరిక్ రైటర్ లక్ష్మీ కాంత్ పేరు మీద రాస్తున్నా.. ఆయన శిష్యుడిగా చేయాలని ప్రయత్నిస్తున్నట్లు కళ్యాణ్ చెప్తాడు. దీంతో అందరూ ఎంతో సంతోష పడతారు.

కళ్యాణ్ అమ్మ పాట విని సంతోష పడిన ఫ్యామిలీ..

నువ్వు రాసిన పాట ఏమన్నా ఉంటే వినుపించురా వినాలని ఉంది కదా అని ఇందిరా దేవి అడిగితే.. ఈ మధ్యే అమ్మ మీద పాట రాశాడు.. చాలా బాగుందని అప్పూ చెబితే.. అందరూ వినిపించమని అడుగుతారు. ఇక కళ్యాణ్ పాడిన పాట వినిపిస్తాడు. అది విని ధాన్యలక్ష్మి ఎంతో ఎమోషనల్ అవుతుంది. అందరూ ఎంతో ఆనందంగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత అందరూ క్రాకర్స్ కాల్చుతారు. రాజ్ భయపడి వెళ్తే.. అందరూ కలిసి లాక్కెళ్తారు. అందరూ పెద్ద పెద్ద బాంబులు కాల్చితే రాజ్ భయపడి కావ్యని హగ్ చేసుకుంటాడు. అప్పుడే అనామిక రుద్రాణికి ఫోన్ చేస్తుంది. ఇక రుద్రాణి టీవీ ఆన్ చేసి.. ఇక్కడ కాల్చిన బాంబులు చాలు కానీ.. ఇక్కడ అంత కంటే పెద్ద బాంబ్ పేలుతుంది చూడటానికి రండి అని పిలుస్తుంది. ఏంటా అని అందరూ వెళ్లి చూసే సరికి.. కళ్యాణ్ ఆటో నడుపుతున్న న్యూస్ టెలికాస్ట్ చేస్తారు. అది చూసి అందరూ షాక్ అవుతారు. రోడ్డున పడ్డ దుగ్గిరాల వంశ ప్రతిష్ట అని న్యూస్‌లో చెబుతారు. దీంతో ఇక ధాన్యలక్ష్మి రెచ్చిపోతుంది.

బాంబ్ పేల్చేసిందిగా.. రెచ్చిపోయిన ధాన్యలక్ష్మి..

ఏంట్రా ఇదేనా నువ్వు బ్రతికే బ్రతుకు. దీన్ని పెళ్లి చేసుకుని పోషించడానికి నువ్వు ఆటో నడుపుతున్నావా? నువ్వు ఇంత దరిద్రాన్ని అనుభవిస్తున్నావా? నిజాయితీగా బ్రతకడం ఏంటో నువ్వు నాకు చెబుతున్నావా.. నువ్వు వెళ్లి ఒక ఆటో నడుపుతున్నావా? అని ధాన్యలక్ష్మి అంటుంది. నేను చెప్పేది ఒకసారి విను అమ్మా.. అని కళ్యాణ్ చెబుతున్నా.. ధాన్యలక్ష్మి వినిపించుకోకుండా రెచ్చిపోతుంది. నీకేం గతి లేదా ఇన్ని కోట్ల ఆస్తిని పెట్టుకుని.. దరిద్రంలా పట్టుకుందేంటిరా ఇది నిన్ను అని అప్పూని అంటుంది. మధ్యలో స్వప్న మాట్లాడుతూ మర్యాదగా మాట్లాడమని అంటుంది. ఏయ్ ఆపు.. ముగ్గురికి ముగ్గురు అక్కాచెళ్లెల్లు ఈ వంశానికి చెదలు పట్టినట్టు పట్టుకున్నారు.. ఛీ.. టీవీలో ఏం చెబుతున్నారో విన్నావా.. అని అరుస్తుంది ధాన్యలక్ష్మి.

ఇవి కూడా చదవండి

ఇందుకే మీ కొడుకు ఇంట్లోంచి వెళ్లిపోయాడు..

ఏం చేశారని చూపిస్తున్నారు ఆంటీ? ఒక కవి తన ఉనికిని కాపాడుకోవడానికి ఆటో నడుపుతున్నాడు. దానికి మీరు ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నారు? అని అప్పూ అంటుంది. ఏయ్ నువ్వు మాట్లాడకు.. నువ్వెంత.. నీ బ్రతుకెంత అని ధాన్యలక్ష్మి తిడుతుంది. ఏమైంది దాని బ్రతుక్కి కోట్లు కావాలని కోరుకోవడం లేదు కదా.. మీ అబ్బాయి చెట్టుకింద ఉండమన్నా ఉంటానంది. ఒక పూట తిండి పెట్టి.. మరోపూట పస్తులు ఉండమన్నా ఉంటానంది. దాని బ్రతుకుని తక్కువ చేసి మాట్లాడే హక్కు మీకు లేదని కావ్య అంటే.. నువ్వు నోరు మూసుకో.. ఇది నాకూ నా కొడుక్కి మధ్య జరిగేది.. మీ వాళ్ల గురించి మాకు ఏమీ తెలీదని అనుకుంటున్నారా? అని ధాన్యలక్ష్మి అంటే.. ఇదిగో ఈ నోరు.. ఈ గయ్యాళితనం చూసే మీ కొడుకు ఇంట్లోంచి వెళ్లిపోయాడని స్వప్న అంటుంది. ఏరా ఇంటికి రమ్మంటే రాలేదు.. డబ్బు పంపిస్తే తీసుకోలేదు. ఇప్పుడు ఆటో నడుపుతున్నావు? నువ్వెందుకు అంత కష్ట పడటం అని అడుగుతున్నా.. ఇదంతా అవసరమా అని రాజ్ అడుగుతాడు.

చచ్చినా నేను ఇంటికి తిరిగి రాను..

ఎందుకు తిరిగి రావాలి అన్నయ్యా? మా అమ్మ ప్రేమ గంగలా ఉప్పొంగిపోతుందని రావాలా? నేను ఇంటికి వస్తే ఏం జరుగుతుందో నాకు రెండోసారి తెలిసిందని కళ్యాణ్ అంటాడు. అత్తయ్యా చూశారా.. వాడు ఏం అంటున్నాడో.. మీకు ఎవరికీ అవసరం లేదా అని ధాన్య లక్ష్మి అడుగుతుంది. ఇప్పుడు ఏమైందని నిప్పులు తొక్కిన కోతిలా అరుస్తున్నావు? వాడు ఎవరైనా చంపేశాడా.. భార్యని పస్తులు ఉంచలేక పని చేసి సంపాదిస్తున్నాడు. అది నేరం కాదే అని ఇందిరా దేవి అంటుంది. అప్పూ నన్ను నన్నుగా ప్రేమించింది. నా ఆస్తిని చూసి కాదు.. నేను కష్టపడి పైకి రావాలి అనుకుంటున్నా.. నేనేంటో నిరూపించుకుంటానని కళ్యాణ్ అంటాడు. నోర్ముయ్.. చేసిన నిర్వాకం చాలు.. దాని మొహాం మీద ఎంతో కొంత పడేస్తాను. వదిలేసి ఇక్కడే ఉండమని అంటుంది ధాన్యలక్ష్మి. అందుకే నేను చచ్చేదాకా ఇంటికి రానని కళ్యాణ్ అంటాడు. ఇక ఇక్కడితో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?