Brahmamudi, November 7th Episode: సంతోషంలో దుగ్గిరాల ఫ్యామిలీ.. బాంబ్ పేల్చేందుకు రుద్రాణి సిద్ధం!

కళ్యాణ్, అప్పూలు ఇంటికి వస్తారు. అప్పూ భయం భయంగా వస్తుంది. వాళ్లను చూసిన రుద్రాణి.. ఇంకా ఎంతకాలం ఈ గొడవలు.. క్షమించేసి ఒక్కటిగా మారిపొమ్మని చెబుతుంది. అది విని స్వప్న షాక్ అవుతుంది. ఆ తర్వాత ధాన్యలక్ష్మి, ప్రకాశంలకు బట్టలు పెడతారు కళ్యాణ్, అప్పూలు. దీంతో వాళ్లు ఎంతో సంతోషిస్తారు..

Brahmamudi, November 7th Episode: సంతోషంలో దుగ్గిరాల ఫ్యామిలీ.. బాంబ్ పేల్చేందుకు రుద్రాణి సిద్ధం!
BrahmamudiImage Credit source: Disney Hot star
Follow us
Chinni Enni

|

Updated on: Nov 07, 2024 | 12:02 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ఇందిరా దేవి కావ్యకు చెక్స్ ఇస్తుంది. వీటన్నింటినీ చెక్ చేసుకోమని చెబుతుంది. అమ్మమ్మా ఇదంతా కరెక్ట్ కాదని అనిపిస్తుంది. మీ చేతుల మీదుగా జరిపిస్తేనే మంచిదనిపిస్తుందని కావ్య అంటుంది. అబ్బబ్బా నీతో ఇదే తలనొప్పి అయిపోయింది. నిన్న మీ ఇంట్లో మొదలు పెట్టావు. ఇప్పటి వరకు ఆపలేదు. ఎవరి చేతుల మీదుగా ఇస్తే బాగుంటుందో మీ తాతయ్యకు తెలీదా? అని పెద్దావిడ అంటే.. ఇప్పటికే నేను సిఈవో అవడం ఈ ఇంట్లో చాలా మందికి నచ్చలేదు. ఇప్పుడు ఇది కూడా నా చేతుల మీదగా జరిపిస్తే ఇంకేమన్నా ఉందా అని కావ్య అంటే.. మహా అయితే కుళ్లుకుంటారు.. లేదంటే ఏడుస్తారు.. అంతే కదా.. అని ఇందిరా దేవి అంటుంది. దీని వల్ల ఆయన మనసు బాధ పడితే అని కావ్య అంటే.. చూడు కావ్యా వాడు చేసింది ఎంత తప్పో తెలుసా? వాడికి అర్థమయ్యేలా చేయడానికే ఇదంతా అని ఇందిరా దేవి చెబుతుంది.

రాజ్‌ గదిలోకి వెళ్లిన కావ్య..

ఆ తర్వాత కావ్య రాజ్ గది దగ్గరకు వెళ్తుంది. గది బయటనే నిల్చొని తలుపు కొడుతుంది. రాజ్ వెనక్కి తిరిగి.. ఏంటి ఆ లెటర్స్.. కొత్తగా పోస్ట్ మ్యాన్ జాబుకు ఏమన్నా జాయిన్ అయ్యావా? అని రాజ్ అడిగితే.. పోస్ట్ వస్తే పని మనిషితో పంపిస్తానని కావ్య అంటుంది. ఆ తర్వాత లోపలికి వస్తుంది కావ్య. ఏయ్ ఏంటి లోపలికి వచ్చేశావు.. గది బయటకే వెళ్లి మాట్లాడమని రాజ్ అంటాడు. ఇది గది లోపలే మాట్లాడే విషయమని కావ్య అంటుంది. నువ్వు ఏం చెప్పినా కరిగే రకం కాదు.. స్టోన్ అని రాజ్ అంటాడు. అర్థమైంది.. మీరు జీవితాంతం ట్రై చేసినా నన్ను అర్థం చేసుకోలేరు. తాతయ్య గారు మన కంపెనీ ఎంప్లాయిస్‌కి నా చేతుల మీదుగా బోనస్‌లు ఇవ్వమని చెప్పారు.. కానీ మీ చేతుల మీదుగా ఇస్తే బాగుంటుందని అడగటానికి వచ్చానని కావ్య చెబుతుంది. అంటే తాతయ్య ఇచ్చింది నాకు దానం చేయడానికి వచ్చావా అని రాజ్ అంటే.. ఇది మీ హక్కు అని కావ్య అంటుంది. ఎప్పటికైనా ఆ కంపెనీ నాదే.. ఆ కంపెనీకి సిఈవోని నేనే.. నువ్వు ఆకాశంలో మబ్బులాంటిదానివి.. ఎప్పుడో ఒకప్పుడు వెళ్లిపోక తప్పదు అని రాజ్ అంటే.. అన్నీ తెలిసి మీతో మాట్లాడానికి వచ్చాను చూడు నాకు బుద్ధి లేదని కావ్య అంటుంది. నేనూ ముందు నుంచి అందరికీ అదే చెబుతున్నానని అని చెప్పి రాజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

రుద్రాణి వేదాలు.. షాక్ అయిన స్వప్న..

ఆ తర్వాత కళ్యాణ్, అప్పూలు దుగ్గిరాల వారి ఇంటికి వస్తారు. కళ్యాణ్ కోసం ధాన్య లక్ష్మి, రుద్రాణి ఎదురు వస్తారు. ఏంటి కళ్యాణ్ నువ్వు ఎవరో ఇంటికి వస్తున్నట్టు అలా భయం భయంగా వస్తున్నావు అని రుద్రాణి అంటుంది. ఓహో నీ కొడుకు ఇంకా రాలేదనేనా చిరాకుగా ఉన్నావు.. ఇప్పుడు వచ్చేశాడుగా.. అయినా ఇంకా ఎన్నాళ్లు ధాన్య లక్ష్మి కొడుకు, కోడలి మీద ఈ అలకలు.. ఒక్కసారి క్షమించేశావంటే మనసులో ఉండే బాధ మొత్తం పోయి హ్యాపీగా ఉండొచ్చని రుద్రాణి అంటుంది. అది విన్న స్వప్న.. వామ్మో వామ్మో నువ్వా అందరూ కలిసి ఉండటం కోసం ఆలోచిస్తున్నావా? నువ్వు ఎప్పుడూ గొడవలు పెట్టడం, విడగొట్టడమే కదా అని అంటుంది. అప్పుడే ప్రకాశం వచ్చి.. చాలా కరెక్ట్‌గా చెప్పావు.. ఏరా ఇంత లేటుగా వచ్చారే.. ఉదయాన్నే రమ్మని చెప్పాను కదా.. లోపల కావ్య ఉంది రండి అని ప్రకాశం అంటాడు.

ఇవి కూడా చదవండి

కొడుకు, కోడలికి బట్టలు పెట్టిన ధాన్యలక్ష్మి..

మరోవైపు కళ్యాణ్ గదిలో ఫీల్‌ అవుతూ కూర్చొంటాడు. ఇక్కడ ఏం చేస్తున్నావ్? నువ్వు కష్టపడిన డబ్బుతో మీ అమ్మా నాన్నలకు బట్టలు కొని తీసుకొచ్చావ్ కదా వెళ్లు ఇవ్వమని అప్పూ అంటే.. అదేంటి పొట్టీ నువ్వు రావా అని కళ్యాణ్ అడుగుతాడు. నేను ఎందుకులే అని అప్పూ అంటుంది. ఆ తర్వాత ధాన్యలక్ష్మి, ప్రకాశంల దగ్గరకు వెళ్లి నా మొదటి సంపాదనతో మీ కోసం బట్టలు కొన్నానని వెళ్లి ఇస్తారు. అందుకు ధాన్యలక్ష్మి, ప్రకాశంలు ఎంతో సంతోషిస్తారు. బట్టలు తీసుకోవడానికి ధాన్యలక్ష్మి ఆలోచిస్తుంది. అప్పుడే ఇందిరా దేవి, అపర్ణలు వస్తారు? ఏంటి అలా ఆలోచిస్తున్నావ్? తీసుకో ధాన్యలక్ష్మి ఇలాంటి అవకాశం అందరికీ దక్కదని అపర్ణ, పెద్దావిడలు అంటారు. ఎంతో సంతోషంగా ధాన్యలక్ష్మి బట్టలు తీసుకుంటుంది. ఆ తర్వాత అప్పూ ప్రకాశానికి ఇస్తుంది. మీరు తీసుకోవడమేనా పండక్కి వచ్చిన కొడుకు, కోడలికి బట్టలు పెట్టరా.. వెళ్లి తీసుకొచ్చి ఇవ్వమని ఇందిరా దేవి అంటుంది. నేను కేవలం వాడికి మాత్రమే తీసుకొచ్చాను.. ఆవిడ చీర కట్టుకుంటుందో లేక ప్యాటు, షర్టు వేసుకుంటుందో తెలీదు అత్తాయ్యా అందుకే తీసుకోలేదని ధాన్యలక్ష్మి అంటే.. అందుకే నేను నీ కోసం తీసుకొచ్చానని ప్రకాశం వెళ్లి బట్టలు తీసుకొస్తాడు.

సంతోషంగా దుగ్గిరాల ఇల్లు..

అందరూ సంతోషంగా ఉంటారు. అది చూసి రుద్రాణి కుళ్లుకుంటుంది. వెంటనే అనామికకు ఫోన్ చేసి.. ఏదో చేస్తావని ఎదురు చూస్తుంటే.. ఆ న్యూస్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో చెప్తే ప్లాన్ చేస్తా.. ఇక్కడ శత్రువులు కూడా మిత్రులుగా కలిసిపోయి తెగ నవ్వేసుకుంటున్నారని రుద్రాణి అంటుంది. ఎంత సేపు నవ్వుకుంటారో నవ్వుకోనివ్వండి. వాళ్లు ఎంత నవ్వినా చివరకు ఏడుపే కదా మిగిలేదని అనామిక అంటుంది. ఆ తర్వాత ముగ్గురు అక్కా చెళ్లెల్లు కలిసి పూజ చేస్తారు. అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. కావ్య అందరికీ హారతి ఇస్తుంది. అలాగే రాజ్‌కి కూడా ఇస్తుంది. వద్దు అనలేక తీసుకుంటాడు రాజ్. ఆ తర్వాత కావ్య ఉద్యోగులందరికీ బోనస్‌లు ఇస్తుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!