Brahmamudi, March 7th episode: రుద్రాణికి చెక్ పెట్టేలా స్వప్న మోడలింగ్.. అనామికపై రాజ్ సీరియస్..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. భాస్కర్‌ను బాత్రూమ్‌లోకి తీసుకెళ్తాడు రాజ్. దీంతో కావాలనే భాస్కర్ రాజ్‌తోనే ఆడుకుంటాడు. కావాలనే రాజ్‌ని ఉడికించడానికి.. బుజ్జీ సబ్బు తీసుకురా అని పిలుస్తాడు. దీనికి బుజ్జి ఎందుకురా.. నేనే తీసుకు వస్తాను అని చెప్తాడు రాజ్. ఆ తర్వాత మళ్లీ అన్నయ్యా.. ఇది నీకు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నా అని భాస్కర్ అంటే.. ఏంట్రా చెప్పి చావు అని రాజ్ అంటాడు. టవల్, డ్రాయర్, బనియన్ కావాలి అన్నయ్యా.. స్వరాజ్ గ్రూప్ ఇండస్ట్రీస్..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. భాస్కర్‌ను బాత్రూమ్‌లోకి తీసుకెళ్తాడు రాజ్. దీంతో కావాలనే భాస్కర్ రాజ్‌తోనే ఆడుకుంటాడు. కావాలనే రాజ్‌ని ఉడికించడానికి.. బుజ్జీ సబ్బు తీసుకురా అని పిలుస్తాడు. దీనికి బుజ్జి ఎందుకురా.. నేనే తీసుకు వస్తాను అని చెప్తాడు రాజ్. ఆ తర్వాత మళ్లీ అన్నయ్యా.. ఇది నీకు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నా అని భాస్కర్ అంటే.. ఏంట్రా చెప్పి చావు అని రాజ్ అంటాడు. టవల్, డ్రాయర్, బనియన్ కావాలి అన్నయ్యా.. స్వరాజ్ గ్రూప్ ఇండస్ట్రీస్ చైర్మన్‌వి.. ఇవి నీకు చెప్పడం ఎలా అని ఆలోచిస్తుననా అని భాస్కర్ అంటాడు. తీసుకురమ్మని చెబుతాడు. ఎలాంటి వాడిని ఎలా చేశావురా.. అని రాజ్ తిట్టుకుంటూ వెళ్లి ఇన్నర్ వేర్స్ తీసుకొస్తాడు. వీడు అసలు అమెరికా నుంచి వచ్చాడా.. అనకాపల్లి నుంచి వచ్చాడా అని రాజ్ లోలోపల అనుకుంటాడు. మరోవైపు భాస్కర్ మాత్రం బాత్రమ్‌లో నవ్వుకుంటాడు.
స్వప్న మోడలింగ్ చూసి షాక్ అయిన.. దుగ్గిరాల ఫ్యామిలీ..
ఈ సీన్ కట్ చేస్తే.. రుద్రాణి బయటకు రాగానే.. ఇంటి బయట స్వప్న మోడలింగ్ చేస్తూ కనిపిస్తుంది. అది చూసి షాక్ అవుతుంది రుద్రాణి. ఏయ్ ఏంటిది.. ఇంట్లో వాళ్లు మోడలింగ్ చేయవద్దు అన్నారు కదా అని రుద్రాణి అంటే.. నీ కొడుకు కోట్ల ఆస్తి కూడబెడుతుంటే.. టైమ్ పాస్‌కి చేయడం లేదు మోడలింగ్.. మీరే ఇక్కడ అడుక్కు తింటున్నారు. నా సంగతి కూడా నేను చూసుకోవాలి కదా.. అందుకే మోడలింగ్ చేస్తున్నా. ఆపే హక్కు ఎవరికీ లేదు అని స్వప్న అంటుంది. దీంతో రుద్రాణి.. ఇంట్లో వాళ్ల అందర్నీ పిలుచుకొస్తుంది. వాళ్లంతా బయటకు వచ్చి.. స్వప్న ఫొటో షూట్ చూసి షాక్ అవుతారు.
ధాన్య లక్ష్మి.. అవాకులు.. చవాకులు..
ఇప్పుడు ఈ ఇంటి గౌరవం దెబ్బతినదా.. ఇది అందాల ప్రదర్శనే కదా. ఇలాంటి ఫొటోలు బయటకు వెళ్తే.. దుగ్గిరాల ఫ్యామిలీ పరువు ఏమౌవుతుంది? అని అపర్ణతో ధాన్య లక్ష్మి వెటకారంగా అంటుంది. అత్త, భర్త చేతులు ఎత్తేస్తే ఎలా.. కొంచెమైనా కంట్రోల్‌లో పెట్టాలి కదా అని అపర్ణ అంటుంది. ఇప్పుడు ఏమీ వద్దు.. ఆ ఫొటోషూట్ అయిన తర్వాత స్వప్నతో మాట్లాడదాం అని సుభాష్ అంటాడు.
స్వప్న మోడలింగ్ చూసి షాక్ అయిన కావ్య, రాజ్‌లు..
ఈ సీన్ కట్ చేస్తే.. భాస్కర్‌ను ఎలా వదిలించుకోవాలా అని రాజ్ ఆలోచిస్తాడు. అప్పుడే కావ్య కావాలనే భాస్కర్‌కు ఇడ్లీ తినిపిస్తుంది. అది చూసి వాట్ అంటూ గట్టిగా అరుస్తాడు రాజ్. దీంతో అంతా షాక్ అవుతారు. కాళ్లు విరగొడతాను.. మొహం చట్నీ చేస్తాను అని ఇన్ డైరెక్ట్‌గా కావ్యకు వార్నింగ్ ఇస్తాడు రాజ్. ఒక్క రోజు ఆఫీస్‌లో లేకపోతే ఇలా చేస్తారా.. వస్తున్నా.. కావ్య రా.. ఆఫీస్‌లో కొంపలు అంటుకుంటున్నాయి. మనం ఆఫీస్‌కి వెళ్లాలి పదా అని రాజ్ అంటాడు. ఇప్పుడా.. మా బావా అని కావ్య అంటే.. చూసుకోవడానికి ఇద్దరు ఉన్నారు కదా అని కావ్యని లాక్కెళ్తాడు రాజ్. అది చూసి ఇంట్లో వాళ్లందరూ నవ్వుకుంటారు. ఇంటికి వచ్చిన రాజ్, కావ్యలు స్వప్న ఫొటో షూట్ చూసి షాక్ అవుతారు.
డబ్బు అవసరం వల్ల మోడలింగ్ చేస్తున్నా..
ఏంటి ఏం చేస్తున్నావో నీకు తెలుసా? ఈ విషయం నలుగురికీ తెలిస్తే.. ఈ ఇంటి పరువు ఏమౌవుతుంది? నువ్వు ఆ కనకం కూతురివి కాదు.. దుగ్గిరాల ఇంటి కోడలివి. వీళ్లందరికీ ఏం సమాధానం చెప్తావో చెప్పు అని స్వప్నను నిలదీస్తుంది రుద్రాణి. ఏదైనా చేసే ముందు పెద్ద వాళ్ల అనుమతి తీసుకుని చేయాలి కదా అని అపర్ణ అంటే.. కానీ మకెవరికీ తెలియకుండా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావ్ అమ్మా అని ఇందిరా దేవి అంటుంది. తప్పలేదు అమ్మమ్మగారూ.. అవసరం వల్ల ఇలా చేయాల్సి వచ్చిందని స్వప్న అంటుంది. ఏంటి ఆ అవసరం అని ధాన్య లక్ష్మి అంటే.. డబ్బు అని చెప్తుంది స్వప్న. ఈ ఇంట్లో నీకు డబ్బుకు లోటా అని సీతా రామయ్య అంటే.. అవును తాతయ్య గారూ.. నా అత్త, భర్త అడుక్కుతింటున్నారంట.. నాకు ఏదన్నా కావాలంటే నా పుట్టింటి నుంచి తెచ్చుకోవాలి అంట అని స్వప్న చెప్తుంది.
అనామికకు అదిరే జవాబు ఇచ్చిన రాజ్..
పుట్టింటి నుంచి తెచ్చుకోమని ఎలా అంటావ్.. చాలా హాస్యా స్పదంగా ఉంది. వాళ్లే ఈ ఇంటి మీద పడి దోచుకు తినేవాళ్లు కదా అని ధాన్య లక్ష్మి అంటుంది. చిన్న అత్తయ్యా ఇక్కడ జరిగేది ఏంటి? మీరు మాట్లాడేది ఏంటి? అని కావ్య చివాట్లు పడుతుంది. దోచుకునేవాళ్లు కాకపోతే.. అప్పూని ఎర వేసి.. మా ఆయన్ని ఎగరేసుకు పోవాలని ఎందుకు అనుకుంటారని అనామిక అంటుంది. నా పుట్టింటి నుంచి మాట్లాడే ముందు ఒక్కసారి నిన్ను నువ్వు ఆత్మ విమర్శ చేసుకో అనామిక అని కావ్య అంటే.. అనామిక ఇక్కడ సమస్య వేరు.. ఇక్కడ ఉన్నవాళ్లు.. ఉన్నవాళ్ల గురించే మాట్లాడుకోండి. లేని వాళ్ల గురించి మాట్లాడుకోవడం సభ్యత కాదని రాజ్ కూడా అంటాడు
నా బిడ్డ భవిష్యత్తు ఏంటో కూడా అర్థం కావడం లేదు: స్వప్న
స్వప్నా ఏంటమ్మా ఇది.. నీకు ఏదైనా కావాలంటే అడగాలి కదా.. నీ సంపాదన నువ్వే చూసుకో అని ఎవరు చెప్పారు? పెద్దవాళ్లతో నువ్వేం చెప్పాల్సిన పని లేదా అని పెద్దావిడ, అపర్ణ అడుగుతారు. నా కష్టం ఎవరికి చెప్పాలి? చెప్పండి.. భార్యగా భర్తని అడగాలి. భర్త పట్టించుకోకపోతే అత్త గారిని అడగాలి. ఆ ఇద్దరూ పట్టించుకోకపోతే.. ఏం చేయాలి? నా ఖర్చులు, నా అవసరాలు ఎవరికీ అక్కర్లేదు. ఇప్పుడే ఇలా ఉంటే.. రేపు పుట్టబోయే బిడ్డ పరిస్థితి ఏంటి? నాలాగే వాడు కూడా దేహీ అని అడగాలా.. అందుకే నాకు తోచిన పని చేస్తున్నా.. నన్ను ప్రశ్నించే అధికారం, నా భర్తకు కానీ, అత్తకు కానీ లేదు. నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు ఉందంటారా అని స్వప్న అంటే.. మేము అంతా ఉన్నాం కదా అమ్మా అని సుభాష్ అంటాడు. మిమ్మల్ని నేను ఎలా అడగగలను అంకుల్.. అని స్వప్న అంటుంది. కరెక్టే కదా డాడ్.. స్వప్న చెప్పిన దాంట్లో తప్పేం ఉంది? ఏరా రాహుల్ నీ భార్య భాద్యత నీది కాదని ఎలా తప్పించుకుంటావ్? అని రాజ్ అంటే.. వాడికి బుద్ధి లేదు సరేరా.. తల్లికి ఏమైంది? అని ప్రకాష్ అంటాడు. ఇప్పుడు ఈ సమస్య ఇక్కడితో తీరిపోయేది కాదు ఆంటీ.. రేపు నా బిడ్డ భవిష్యత్తు ఏంటో కూడా తెలీడం లేదని స్వప్న అంటుంది. అమ్మా స్వప్నా.. నీ సమస్య ఇప్పుడు మా దాకా వచ్చింది కదా.. తాతయ్య ఆలోచించి మంచి పరిష్కారం చెప్తారు. ఇక పదండి అందరూ అని అంటుంది ఇందిరా దేవి. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.








