
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రుద్రాణి యాక్సిడెంట్ చేయడంతో మాయ పక్కకు ఎగిరి పడుతుంది. తల నుంచి రక్తం వస్తూ.. స్పృహ కోల్పోతుంది. దీంతో కంగారు పడిన కావ్య, అప్పూలు.. మాయని ఎంత లేపినా లేవదు. దీంతో ఏం చేయాలో తెలీక.. హడావిడిగా ఆస్పత్రికి తీసుకెళ్తారు. బెడ్‌పై మాయ పడుకుని ఉంటుంది. ఒకవైపు మాయని డాక్టర్లు చెక్ చేస్తుండగా.. ఏం జరుగుతుందో అని.. కావ్య, అప్పూలు కంగారుగా తిరుగుతూ ఉంటారు. అక్కా దాని గురించి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావే పిచ్చిదానా.. అది మీ ఫ్యామిలీకి మోసం చేసినందుకు ఆ దేవుడు దారుణమైన చావు రాసి పెట్టాడు. దేవుడు శిక్ష వేసింది ఆ మాయకు కాదు నాకు.. మా అత్తగారు ఆయనకు.. ఆ దొంగ మాయకు పెళ్లి చేయడానికి రేపే ముహూర్తం పెట్టించారని ఏడుస్తూ ఉంటుంది. దీంతో కావ్యని ఓదార్చుతుంది అప్పూ.
ఇంతో మాయని చూసిన డాక్టర్ బయటకు వస్తుంది. డాక్టర్ బయటకు రాగానే.. తనకు ఇప్పుడు ఎలా ఉందని కావ్య అడుగుతుంది. కండీషన్ చాలా సీరియస్‌గా ఉంది. ఇప్పుడు ఏమీ చెప్పలేమని డాక్టర్ చెబుతుంది. దీంతో ఒక్కసారిగా కృంగిపోతుంది కావ్య. ఇప్పుడు ఏం చేయాలి? ఉన్న ఒక్క సాక్ష్యం మాయ. తనకే ఇలా జరిగితే ఎలా? నా చేతులతోనే నా కాపురాన్ని నాశనం చేసుకున్నా. ఇప్పుడు ఆయనకు, ఆ దొంగ మాయకు పెళ్లి జరిగితే ఎలా? ఏం చేయాలి? అని ఆవేదన పడుతుంది కావ్య. మరోవైపు కావ్యని అప్పూ ఓదార్చుతుంది.
మరోవైపు మాయని గుద్ది చంపేశానని.. అది బతకదు.. చిత్రకు, రాజ్‌కి పెళ్లి చేసేస్తాం. కావ్యా నువ్వు ఇంట్లోంచి వెళ్లడం ఖాయమని రుద్రాణి సంతోష పడుతూ ఉంటుంది. రుద్రాణి అనుకున్నట్టు.. రాజ్‌కి చిత్రకు పెళ్లి జరిగిపోతుందా? మరి కావ్య చేస్తుంది. ఇంతకీ బెడ్ మీద ఉన్నది అసలు మాయేనా? ఇలా సస్పెన్సుల మధ్య బ్రహ్మముడి ఎపిసోడ్ కొనసాగుతుంది. ఇదంతా చూస్తే.. రాజ్, చిత్ర పెళ్లి దగ్గర పడేంత వరకూ ఏం జరుగుతుంది అనేది ఇంకా క్లారిటీ ఉండదు. చిత్ర మెడలో రాజ్ తాళి కట్టే సమయంలోనే ఏదైనా మ్యాజిక్ జరగాలి. మరి ఇదంతా జరుగుతూ ఉంటే.. సుభాష్ నోరు మూసుకుని మౌనంగా ఉంటాడా లేక నిజం చెప్పేస్తాడా? ఎటు నుంచి ఈ సీరియల్ ఎటు తిరుగుతుందో చూడాలి.