Brahmamudi, June 15th Episode: అపర్ణా మజాకా.. తగ్గని ఠీవి.. కావ్య పుట్టింటిపై ప్రేమ వర్షం..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్య సూప్ తీసుకొచ్చి ఇస్తుంది. నీ భార్య చేతితో ఇచ్చిన సూప్ నేను తాగను. అసలు ఈ మనిషిని ఎదురు పడొద్దని నిన్నే చెప్పాను కదా. మళ్లీ వచ్చిందేంటి? అని అపర్ణ అంటే.. అందరూ నన్నే అనండి అని కావ్య అంటుంది. ఇంకెవరు అన్నారు నిన్ను? అని అపర్ణ కంగారుగా అడుగుతుంది. మీ అబ్బాయే.. మీకు ఇలా కావడానికి కారణం నేనే అని అన్నారని కావ్య అంటే..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్య సూప్ తీసుకొచ్చి ఇస్తుంది. నీ భార్య చేతితో ఇచ్చిన సూప్ నేను తాగను. అసలు ఈ మనిషిని ఎదురు పడొద్దని నిన్నే చెప్పాను కదా. మళ్లీ వచ్చిందేంటి? అని అపర్ణ అంటే.. అందరూ నన్నే అనండి అని కావ్య అంటుంది. ఇంకెవరు అన్నారు నిన్ను? అని అపర్ణ కంగారుగా అడుగుతుంది. మీ అబ్బాయే.. మీకు ఇలా కావడానికి కారణం నేనే అని అన్నారని కావ్య అంటే.. వాడి పళ్లు రాలగొడతాను.. నాకు ఇలా జరగడానికి వీడి తండ్రి చేసిన మోసమే కారణం. ఒకరు చేసిన తప్పుకు ఇంకొకరిని బాధ్యుల్ని చేస్తే ఎంత నరకం అనుభవిస్తామో నీకేం తెలుసు. నాకే తెలుసురా. నేను చేసిన తప్పు నువ్వు చేయకు అర్థమైయిందా అని అపర్ణ బాధ పడుతూ ఉంటుంది. ఆ తర్వాత కావ్యపై అరుస్తాడు రాజ్. ఇప్పుడే కదా గడ్డిపెట్టాను మళ్లీ నీ పెళ్లాన్ని తిడతావేంటి? అసలు నీకు ఉందా? బుద్ధి అని రాజ్‌ని అంటుంది. ఇక కావ్య రాజ్‌కి సూప్ ఇచ్చి వెళ్తుంది.
నీ భార్య మనసు ముక్కలు కాకుండా చూసుకో..
సూప్ తీసుకో మమ్మీ అని రాజ్ అపర్ణకు సూప్ ఇస్తాడు. ఇన్నాళ్లూ నీ తండ్రి కోసం చేసి త్యాగాలు చాలు. నా మనసు ముక్కలు అయిపోయినట్టు.. నీ భార్య మనసు ముక్కలు కాకుండా చూసుకో.. నీ పెళ్లాన్ని పట్టించుకోరా దద్దమ్మా. భర్త మనసులో తను లేదని తెలిస్తే ఏ ఆడది కూడా తట్టుకోలేదని అంటుంది అపర్ణ. ఆ తర్వాత కావ్య చీర మార్చుకుంటూ ఉంటుంది. అప్పుడే రాజ్ వస్తూ.. ఏయ్ అని కంగారు పడతాడు. ఇక కావ్య కావాలనే రాజ్‌ని ఆటపట్టిస్తుంది. ఉమ్మా అని ముద్దు ఇస్తుంది. మరోవైపు రాజ్ ఏమో ఓ కంగారు పడిపోతూ.. గోడకు అతుక్కుపోతాడు. ఇక కావ్య మరింత దగ్గరగా వస్తుంది. రాజ్ ఓ మెలికలు తిరిగిపోతూ ఉంటాడు. అప్పుడే ఇంట్లో పూజ ఉంది మర్చిపోయావా అని గుర్తు చేస్తాడు.
కావ్య ముద్దు గోల..
దీంతో కావ్య కంగారు పడి.. సరే పూజ ఉంది కాబట్టి మిమ్మల్ని బలాత్కారం చేయడం లేదని అంటుంది. సరేలే మా అమ్మా, నాన్నలకు మంచి చేయడం మర్చిపోకు అని రాజ్ అంటాడు. మిమ్మల్ని ముద్దు పెట్టుకుంటేనే తప్ప దారికి రారని కావ్య అంటే.. అమ్మో వద్దు వద్దు అని రాజ్ భయ పడిపోతాడు. ఆ తర్వాత పూజకు అన్నీ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. చేసినవన్నీ చేసేసి.. పూజలు చేస్తే పరిహారం అయిపోతుందా.. ఈ పూజ జరిపించిన గుండె గాయం నయమవుతుందని అనుకోవడం లేదని సుభాష్‌ని తిడుతుంది ఇందిరా దేవి. అమ్మమ్మ గారూ ఆయన కోడల్ని నేను ఇక్కడే ఉన్నాను. నా ముందు మావయ్య గారిని నిందించడం అవసరమా? అని కావ్య అంటే.. నేను నీ అంత వెర్రిబాగులదాన్ని కాదమ్మా.. నువ్వు అంటే గుండె నిబ్బరంతో నిలబడ్డావ్ కానీ అందరూ అలా ఉండలేరని ఇందిరా దేవి అంటుంది. ఈ పూజ అపర్ణ క్షేమం కోసమే చేయిస్తున్నా తప్ప.. నా తప్పు మాసిపోవాలని కాదని సుభాష్ అంటాడు.
దుగ్గిరాల ఇంటికి వచ్చిన కనకం, కృష్ణమూర్తి..
ఆ తర్వాత రాజ్, కావ్యలు తప్ప ఇంట్లోని అందరూ హాలులో ఉంటారు. అప్పుడే సుబ్రమణ్యం, శైలూలు వస్తారు. వాళ్లను చూసి వీళ్లేందుకు వచ్చారు? అని ధాన్య లక్ష్మి అంటుంది. ఈలోపు అపర్ణను అనామిక పుట్టింటి వాళ్లు పలకరిస్తారు. ఇవాళ పూజ ఉంది కదా నేనే రమ్మన్నాను అని అనామిక చెప్తుంది. రాజు, రాణి ఇంకా కిందకు రాలేదా? అని అపర్ణ అడుగుతుంది. పైన ఉన్నారని ధాన్య లక్ష్మి చెబుతుంది. ఆ నెక్ట్స్ కనకం, కృష్ణమూర్తి, అప్పూలు ఇంటికి వస్తారు. వాళ్లను చూసి అనామిక, శైలు మండి పడిపోతారు. ఇప్పుడు ఎలా ఉందని కృష్ణ మూర్తి అంటే.. పర్వాలేదు.. కూర్చొండి అని అపర్ణ అంటుంది. దానికి ఇంట్లోని వాళ్లందరూ షాక్ అవుతారు.
కళ్లు తిరిగి పడబోయిన రుద్రాణి..
మీ వాళ్లు పోయి పోయి మా వదిన దగ్గరే కూర్చొన్నారు. బీపీని పెంచడానికా అని రుద్రాణి అంటే కావ్య కోపంగా చూస్తుంది. అప్పుడే కావ్యని పిలుస్తుంది అపర్ణ. నేనే మిమ్మల్ని చూడటానికి రమ్మన్నాను అని కావ్య చెప్తే.. నీకు అసలు బుద్ధి ఉందా? వాళ్లను ఎవరు పిలిచారని నేను అడిగానా.. నేనే పిలిచాను. ఇంట్లో పూజ ఉందని నువ్వెందుకు చెప్పలేదు. నీ పుట్టింటి వాళ్లు వస్తే పలకరించడం తెలీదా అని అపర్ణ అంటుంది. అపర్ణ మాటలకు అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురవుతారు. వెళ్లి వాళ్లకు కాఫీ తీసుకురమ్మని అపర్ణ చెబుతుంది. అపర్ణ మాటలకు రుద్రాణి కళ్లు తిరిగి పడిపోతుండగా.. రాజ్, రాహుల్‌లు పట్టుకుంటారు. అక్కడేం జరుగుతుందిరా అని రుద్రాణి అంటుంది.
నీ భార్యని షాపింగ్‌కి కూడా తీసుకెళ్లలేవా..
ఆ తర్వాత రాజ్‌ని పిలుస్తుంది అపర్ణ. ఈ సీన్ నిజంగానే చాలా అందర్నీ షాక్‌కి గురి చేస్తుంది. అమ్మమ్మ గారూ నన్ను ఒకసారి గిల్లండి అని స్వప్న అంటే.. పెద్దావిడ గిల్లుతుంది. హా ఇది నిజమే అని స్వప్న సంతోష పడుతుంది. ఈలోపు రాజ్ పలకరిస్తే.. కనకం తింగరిగా సమాధానం చెబుతుంది. కాఫీ ఇస్తుండగా కావ్యని ఆపి.. ఏంటి ఈ చీర పూజ ఉందని తెలుసు కదా.. పట్టు చీర కట్టుకుని ఏడవచ్చు కదా అని అపర్ణ అంటే.. వెంటనే మార్చుకుని వస్తాను అని కావ్య అంటే.. ఇక నుంచి అయినా నా పెద్ద కోడలిగా ఖరీదైన చీరలు కట్టుకోవాలి. పొద్దున్న లేస్తే వంద పనులు చేస్తుంది. పెళ్లాన్ని ఆ మాత్రం షాపింగ్‌కి తీసుకెళ్లి. మంచి చీరలు కొనిపెట్టలేవా? అని రాజ్‌ని అంటుంది అపర్ణ.
ఆ మనిషి పూజలో కూర్చోవడం ఏంటి?
ఇక ఆ తర్వాత పూజకు అంతా సిద్ధం అవుతుంది. అపర్ణను పిలవడానికి అందరూ తర్జన భర్జన పడుతూ ఉంటారు. అప్పుడే కావ్య వెళ్లి అపర్ణను పిలుస్తుంది. నీ కర్మ వెళ్లు అని పెద్దావిడ అంటుంది. కావ్య పిలవగానే.. అపర్ణ వచ్చి పూజకు ఎంత సమయం పడుతుందని అడుగుతుంది. ఓ గంట సమయం పడుతుందని పంతులు గారు చెబుతారు. అంత సేపు నేను కూర్చోలేనండి ఎలా? అని అపర్ణ అంటే.. భార్య చేయలేని పరిస్థితిలో ఉంటే.. భర్త చేయాలని పంతులు చెప్తాడు. సుభాష్ పూజకు కూర్చొంటాడు. దీంతో అత్తయ్య గారూ.. నన్ను చావు చివరి అంచుల వరకూ తీసుకెళ్లిన ఆ మనిషి పూజలో కూర్చోవడం ఏంటి? అని అపర్ణ అంటుంది. ఇప్పుడు పూజ మధ్యలో ఆపడం మంచిది కాదని పెద్దావిడ చెబుతుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.








