Brahmamudi, April 23rd episode: రాజ్, కావ్యల చేతుల మీదుగా సీతారాముల కళ్యాణం.. ఇరికించిన రుద్రాణి!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. పంతులు గారు ఇంటికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. సీతారాముల కళ్యాణ్ మీ చేతుల మీదుగా జరిపించాలన్న విషయాన్ని గుర్తు చేసేందుకు వచ్చానని చెప్తాడు. మీ దగ్గర నుంచి ఎలాంటి సమాచారం లేకపోతే.. నేనే స్వయంగా కనుక్కోవడానికి ఇంటికి వచ్చానని పంతులు చెప్తాడు. ఈ ఏడాది కూడా ఎప్పటిలాగే మేమే జరిపిస్తాం. అందులో మీరు ఎలంటి సంశయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఇందిరా దేవి అంటుంది. దీంతో ఇంట్లోని వాళ్లందరూ..

Brahmamudi, April 23rd episode: రాజ్, కావ్యల చేతుల మీదుగా సీతారాముల కళ్యాణం.. ఇరికించిన రుద్రాణి!
Brahmamudi
Follow us

|

Updated on: Apr 23, 2024 | 12:32 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. పంతులు గారు ఇంటికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. సీతారాముల కళ్యాణ్ మీ చేతుల మీదుగా జరిపించాలన్న విషయాన్ని గుర్తు చేసేందుకు వచ్చానని చెప్తాడు. మీ దగ్గర నుంచి ఎలాంటి సమాచారం లేకపోతే.. నేనే స్వయంగా కనుక్కోవడానికి ఇంటికి వచ్చానని పంతులు చెప్తాడు. ఈ ఏడాది కూడా ఎప్పటిలాగే మేమే జరిపిస్తాం. అందులో మీరు ఎలంటి సంశయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఇందిరా దేవి అంటుంది. దీంతో ఇంట్లోని వాళ్లందరూ షాక్ అవుతారు. మీరు అన్నీ ఆలోచించే.. ఈ నిర్ణయం తీసుకున్నారా? అని అపర్ణ అడుగుతుంది. ఇందులో ఆలోచించడానికి ఏముంది? ప్రతీ ఏడాది సీతారాముల కళ్యాణం మనమే కదా జరిపిస్తున్నాం అని ఇందిరా దేవి అంటే.. కానీ ఈ తరంలో మన వంశంలో అపశ్రుతి దొర్లిందని అపర్ణ అంటుంది. తర్వాత కావాలనే రుద్రాణి, ధాన్యం దెప్పి పొడుస్తారు.

కళ్యాణం జరిపించి తారాల్సిందే..

అక్కడే ఉన్న స్వప్న.. రాహుల్ మంచి ఐ హాస్పిటల్ ఎక్కడ ఉంది? అని అడిగితే.. ఎందుకని రాహుల్ అంటాడు. మీ అమ్మ దేవుడి కళ్యాణానికి అడ్డు పడుతుంది. ఆ పాపానికి కళ్లు పోతాయి కదా.. అప్పుడు హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి అని స్వప్న అంటుంది. నేను అడ్డు పడటం లేదు మా వదిన.. అని రుద్రాణి చెప్తుంది. అపర్ణా నీ సమస్య ఏంటి? అని ఇందిరా దేవి అడుగుతుంది. ఇప్పుడు ఇంట్లోనే ఓ సమాజం ఉంది అత్తయ్యా? బయట వారిలానే దెప్పిపొడుస్తూ వేలెత్తి చూపిస్తుంది. ఇప్పుడు బయట వాళ్లు కూడా ఇలానే మాట్లాడితే.. మన దగ్గర సమాధానం ఉందా? అని అపర్ణ అడుగుతుంది. ఎవరో ఏదో అనుకుంటారని దైవ కార్యాన్ని ఆపుకుంటామా? అని సుభాష్ అంటాడు. ఈ ఇంట్లో తుఫాను చెలరేగిందని తెలీదా? అందుకు కారణం అయిన సుపుత్రుడు తెలీదా? అని అపర్ణ అంటుంది. నీకు ఇష్టం లేదని చెప్పు.. కానీ ఈ వంకతో సంప్రదాయాన్ని ఆపాలని చూడకు. ఏది ఏమైనా ఈ కళ్యాణం జరిగి తీరాల్సిందే అని ఇందిరా దేవి అంటుంది.

సీతారాముల కళ్యాణానికి నేను రాను..

సరే మీ ఇష్టం అత్తయ్యా.. కానీ నేను మాత్రం ఈ కళ్యాణానికి రాను అని అపర్ణ అంటుంది. ఇప్పుడే అడుగుతుంది ఆ సమాజం. ఎప్పుడూ పీటల మీద కూర్చుని కళ్యాణం జరిపించే నువ్వు రాకపోతే.. అప్పుడు ఏమని సమాధానం చెప్పాలి? అని ఇందిరా దేవి ప్రశ్నిస్తుంది. అపర్ణ వస్తుంది అమ్మా.. నేను తీసుకొస్తాను అని సుభాష్ అంటాడు. దీంతో అపర్ణ కోపంగా.. నాకు తలవంపులు తీసుకు రావడానికే పుట్టావు కదారా అని రాజ్ వైపు చూస్తూ చెబుతుంది. అమ్మా కావ్యా.. ఈ సీతారాముల కళ్యాణం జరిపిస్తే అప్పుడన్నా మీ కాపురం చక్క బడుతుందోమోనమ్మా.. వాడిని నువ్వే ఒప్పించాలి. అది నీ వల్లే అవుతుందని పెద్దావిడ చెబుతుంది.

ఇవి కూడా చదవండి

రాజ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని మీడియాకి చెబుదాం..

ఏంటి మామ్.. మనం ఒకటి అనుకుంటే.. మరొకటి జరుగుతుంది. చివరికి అందరూ ఒక్కటి అయిపోతున్నారు. అక్కడ అందరూ ఒక్కటైపోయి.. సంతోషంగా ఉంటారు. మనం చేసే ప్లాన్ అంతా వృథా అయిపోయందని రాహుల్ అంటాడు. వృథా కాలేదురా.. మనం అనుకున్నట్టే జరుగుతుంది. రేపు గుడికి రాజ్‌తో పాటు ఆ బాబు కూడా వస్తాడు. ఇప్పుడు దాన్ని మనం వాడుకోవాలి. రాజ్ అక్రమ సంబంధం పెట్టుకుని బిడ్డను తీసుకొచ్చాడు అని చెప్పాలి. మీడియాను పిలువు.. మిగిలినదంతా వాళ్లే చూసుకుంటారు అని రుద్రాణి చెబుతుంది. బిడ్డతో గుడికి వచ్చిన రాజ్ అందరి ముందూ అడ్డంగా బుక్ అయిపోతాడని రాహుల్ అంటే.. అది చూసి తట్టుకోలేని మా వదినా.. ఆవేశంతో రాజ్‌ని ఇంట్లో నుంచి బయటకు తోసేస్తుందని రుద్రాణి అంటుంది. దీంతో ఇద్దరూ సంబర పడిపోతారు.

రాజ్ రావాల్సిందేనని పట్టుబట్టిన కావ్య..

ఈ సీన్ కట్ చేస్తే.. కావ్య బట్టలు తీసుకొచ్చి బెడ్ మీద పెడుతుంది. ఏంటి? ఇవి అని రాజ్ అడుగుతారు. ఇంట్లోనుంచి బయటకు వెళ్లేవాళ్లకు బట్టు పెట్టి పంపించడం ఆనవాయితీ కదా అందుకు అని కావ్య అంటుంది. నేను గుడికి రావడం లేదని రాజ్ అంటే.. గుడికి రావడానికి ఏంటి అభ్యంతరం అని కావ్య అంటే.. నేను బాబును గుడికి తీసుకెళ్తే.. అక్కడ జరిగేది కళ్యాణం కాదు.. గొడవ. అది నాకు ఇష్టం లేదని రాజ్ అంటే.. మీరు బాబుతో ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. కానీ అది జరుగుతుంది కదా.. భర్త లేకుండా భార్య కళ్యాణానికి ఎలా వెళ్తుంది. వచ్చి పక్కనే ఉండండి అని కావ్య అంటే.. నేను రాను.. నువ్వే వెళ్లు అని రాజ్ అంటే.. సీతా రాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. రెండు కళ్లూ చాలవు. ఏమో ఈ కళ్యాణం జరిపిస్తే అయినా మీ సమస్యలు తొలగిపోతాయేమో అని కావ్య అంటే.. ఈ సమస్యలను నేను కొని తెచ్చుకున్నా. కాబట్టి పడాల్సిందే. కాబట్టి నేను రాను అని రాజ్ అంటాడు. కళ్యాణానికి కూడా మీరు ఖచ్చితంగా రావాల్సిందే అని కావ్య అంటుంది.

సీతారాముల కళ్యాణానికి కనకం ఫ్యామిలీ..

మరోవైపు అప్పూ ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్తుంది. ఏయ్ అప్పూ ఆగవే.. సీతా రాముల కళ్యాణానికి వెళ్లాలి అని చెప్పాను కదా.. మర్చిపోయావా అని కనకం అంటుంది. అయ్యో నాకు పని ఉంది అమ్మా.. నువ్వు వెళ్లు అని అప్పూ అంటే.. లేదు నీ కళ్యాణం జరగాలని నేను మొక్కుకున్నా కాబట్టి నువ్వు రావాల్సిందేనని కనకం చెబుతుంది. సరి పోయింది. వాళ్లతో వెళ్లాలా? ఇప్పటిదాకా జరిగిన గొడవలు చాలవా అని అప్పూ అడుగుతుంది. ఏది ఏమైనా గుడికి వెళ్లాలి అని కనకం తీసుకెళ్తుంది.

కావ్య, రాజ్ చేతుల మీదుగా కళ్యాణం.. ఇరికించేసిన రుద్రాణి..

ఇక అప్పుడే దుగ్గిరాల ఫ్యామిలీ గుడికి వస్తారు. అక్కడ మీడియా ఉంటుంది. రుద్రాణి, రాహుల్‌లు తెగ సంతోష పడిపోతూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న మీడియాను చూసి అందరూ షాక్ అవుతారు. రేయ్ కళ్యాణ్ ఏర్పాట్లనీ నువ్వే చేశావ్ కదా.. మీడియాను కూడా పిలిచావా? అని రాజ్ అడుగుతాడు. ఏమో అన్నయ్యా నాకేం తెలీదని కళ్యాణ్ అంటాడు. ఇప్పుడు వీళ్లు బాబు గురించి ఖచ్చితంగా అడుగుతారు. ఇలాంటిదేదో జరుగుతుందని మమ్మీ భయ పడుతూనే ఉందని రాజ్ అంటాడు. ఈలోపు మీడియా వచ్చి.. ఇక ప్రశ్నలు అడగటం మొదలు పెడతారు. ఎవరి చేతుల మీద కళ్యాణ్ జరిపించబోతున్నారు? అని మీడియా అంటే.. రాజ్, కావ్యల చేతుల మీద చేపిస్తున్నాం అని పెద్దావిడ అంటుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. అరే ఎవరు సర్ ఈ బాబు అని మీడియా అడుగుతుంది. అప్పుడే ప్రకాశం కవర్ చేయాలని చూస్తాడు. వాడు మా రాజ్ కొడుకు అని రుద్రాణి కావాలనే ఇరికించేస్తుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.

Latest Articles
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వామును అద్భుత ఔషధం!
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వామును అద్భుత ఔషధం!
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..