Brahmamudi, April 17th episode: టుడే ఎపిసోడ్‌లో వాటే ట్విస్ట్.. వచ్చిన వెన్నెల.. నిజం తెలిసిపోయిందిగా!
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. శ్వేత వెన్నెల కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు రాజ్ వచ్చి.. ఏంటి అందరూ అక్కడ ఉంటే నువ్వు ఒంటరిగా ఇక్కడ నిలబడ్డావ్ అని అడుగుతాడు. ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా అని చెబుతుంది శ్వేత. ఎవరా అంత ఇంపార్టెంట్ ఫ్రెండ్.. బ్రాయ్ ఫ్రెండా అని రాజ్ అడిగితే.. వెన్నెల ఇంకో ఐదు నిమిషాల్లో ఇక్కడ ఉంటుంది. రాజ్ ఏమీ చేయలేదు. కావ్యను ఇంత టార్చర్ పెడుతున్నందుకు.. ఈ ఐదు నిమిషాలు రాజ్‌కి టార్చర్ చూపిస్తా అని మనసులో..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. శ్వేత వెన్నెల కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు రాజ్ వచ్చి.. ఏంటి అందరూ అక్కడ ఉంటే నువ్వు ఒంటరిగా ఇక్కడ నిలబడ్డావ్ అని అడుగుతాడు. ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా అని చెబుతుంది శ్వేత. ఎవరా అంత ఇంపార్టెంట్ ఫ్రెండ్.. బ్రాయ్ ఫ్రెండా అని రాజ్ అడిగితే.. వెన్నెల ఇంకో ఐదు నిమిషాల్లో ఇక్కడ ఉంటుంది. రాజ్ ఏమీ చేయలేదు. కావ్యను ఇంత టార్చర్ పెడుతున్నందుకు.. ఈ ఐదు నిమిషాలు రాజ్‌కి టార్చర్ చూపిస్తా అని మనసులో అనుకుని.. వెన్నెల అని కోపంగా చెబుతుంది. దీంతో రాజ్ షాక్ అవుతాడు. ఏంటి అలా షాక్ అయ్యావ్ అని శ్వేత అడిగితే.. వెన్నెల వస్తోందా అని రాజ్ అడుగుతాడు. ఏంటి? వెన్నెల వస్తుందా? ఆ వెన్నెల.. ఈ వెన్నెల ఒక్కరో కాదో ఈయనే చెప్పాలి అని కావ్య అంటుంది. అసలు నీకు ఏ వెన్నెల తెలుసు? అని శ్వేత అడిగితే.. ఏహే మీ వెన్నెల గోల ఆపండి అని రాజ్ అంటాడు. మొదలు పెట్టింది మీరే కదా అని కావ్య కోపంగా అంటుంది.
రాజ్‌ని ఓ ఆట ఆడుకున్న శ్వేత, కావ్యలు..
ఆ తర్వాత శ్వేత, కావ్యలు ఒకరి తర్వాత మరొకరు మాట్లాడుతూ.. రాజ్‌కు విసుగు తెప్పిస్తారు. అసలు తను వస్తున్నట్టు నాకెందుకు చెప్పలేదని రాజ్ అడిగితే.. ఇక్కడ నీ ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు. వాళ్లు వస్తున్నట్టు కూడా చెప్పలేదు కదా అని శ్వేత అంటే.. వాళ్లు వేరు.. వెన్నెల వేరని రాజ్ అంటాడు. ఆ.. చెప్పండి ఆగిపోయారే అని కావ్య అంటే.. ఇప్పుడు ఇక్కడికి వెన్నెల వస్తే అసలు నిజం బయట పడి పోతుంది. ఎలా అని రాజ్ కంగారు పడతాడు. మీరు ఇంత కంగారు పడుతున్నారంటే.. మీరు చెప్పిన వెన్నెల.. ఈ వెన్నెల ఒక్కరే అన్నమాట. ఇప్పుడు ఆమె వస్తుంది అన్నీ బయట పడతాయ్ అని కావ్య అంటుంది. కావ్య చెప్పింది ఏంటి రాజ్.. చెప్పు.. అని శ్వేత అంటే.. మోసాన్ని దాచారు.. తల్లిని చేశారు అని కావ్య అంటుంది. ఇలా ఒకరి తర్వాత మరొకరు మాట్లాడుతూ ఉంటారు. ఆపుతారా అని రాజ్ గట్టిగా అరుస్తాడు. మీ ప్రశ్నలకు నాకు చిరాకు వస్తుందని అంటాడు. ఇంతలోనే కారు వచ్చి ఆగుతుంది. అందులో నుంచి వెన్నెల దిగుతుంది. తనను చూసి షాక్ అవుతారు.
రాహుల్, రుద్రాణిల ప్లాన్ సక్సెస్.. పేపర్స్‌పై సంతకం పెట్టిన స్వప్న..
ఈ సీన్ కట్ చేస్తే.. రుద్రాణి, రాహుల్‌లు ఇద్దరూ కలిసి స్వప్న రూమ్‌కి దగ్గరకు వస్తారు. డోర్ తీసి చూడగా.. స్వప్న ఒక రేంజ్‌లో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అది చూసి ఇద్దరూ షాక్ అవుతారు. ఇదేంటి ఫుల్లుగా పడుకుంటుంది అనుకుంటే.. డ్యాన్స్ చేస్తుందని రుద్రాణి అంటుంది. ఇది కూడా మన మంచికే. పేపర్స్ మీద వేలి ముద్ర కాకుండా నేరుగా సైన్ తీసుకుందాం అని రాహుల్ అంటాడు. ఇద్దరూ లోపలికి వెళ్లి.. నువ్వు వెళ్లి ఆ పేపర్స్ తీసుకురా.. నేను సంతకం పెట్టిస్తాను అని రాహుల్ అంటాడు. రాహుల్‌ని చూసిన స్వప్న.. పిలిచి డ్యాన్స్ చేయమంటుంది స్వప్న. ఈలోపు రుద్రాణి భయ పడుతూ వచ్చి ఆస్తి పేపర్స్ తీసుకుంటుంది. ఆంటీ మీరెందుకు వచ్చారో నాకు తెలుసు అని స్వప్న అంటుంది. అది విని ఇద్దరూ షాక్ అవుతారు. డ్యాన్స్ చేయడానికే కదా అని స్వప్న అంటుంది. ఆ తర్వాత స్వప్నను మాటల్లో పెట్టి.. ఆస్తి పేపర్స్ పై సంతకం పెట్టించుకుంటారు రుద్రాణి, రాహుల్‌లు.
చనిపోయిన వెన్నెల.. దొరికేసిన రాజ్..
ఈ సీన్ కట్ చేస్తే.. వెన్నెల స్లో మోషన్‌లో నడుచుకుంటూ వెళ్తుంది. హాయ్ వెన్నెల.. నువ్వు అప్పుడు ఎలా ఉన్నావో.. ఇప్పుడూ అలానే ఉన్నావ్ అని శ్వేత అంటుంది. అప్పుడే ఆయా వచ్చి బాబు ఏడుస్తున్నాడు అని చెబుతుంది. ఈలోపు వెన్నెల బాబును ఎత్తుకుని.. నీ వైఫ్ రాలేదా? అని రాజ్‌ని అడుగుతుంది. అప్పుడే శ్వేత కావ్యని పరిచయం చేస్తుంది. పిల్లాడిని కావ్యకు ఇస్తుంది వెన్నెల. ఆ తర్వాత మరో ఫ్రెండ్ లేచి.. టెన్త్ తర్వాత నువ్వు ఏమైపోయావ్ అని అడుగుతారు. ఇవాళ అందరికీ నా కథ చెప్పాలనే వచ్చాను అని.. స్టేజ్ ఎక్కుతుంది. మీరు ఏమాత్రం ఊహించని నిజం ఇప్పుడు చెప్పబోతున్నా.. నేను మీ క్లాస్ మేట్ వెన్నెల కాదు.. నేనూ వెన్నెల కవల పిల్లలం. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పూర్తి అయ్యాక.. వెన్నెల ఆరోగ్యం అస్సలు బాలేదు. మానాన్న ఇల్లు అమ్మేసి మమ్మల్ని బెంగళూరు తీసుకెళ్లారు. అక్కడ వెన్నెలకు ట్రీట్మెంట్ అందించాం అని చెబుతుంది. ఇంతలో కావ్య మరి తనెందుకు రాలేదని అడుగుతుంది. అప్పుడే వెన్నెల ఫొటోకు దండ వేసి ఉన్న ఫొటోను చూపించి.. తను చనిపోయిందని.. ఒకసారి ఎయిర్ పోర్టులో కలిసినప్పుడు ఈ విషయం రాజ్‌కి చెప్పానని అంటుంది. ఈ విషయం మీకు ఇప్పటి వరకూ తెలీదంటే.. రాజ్ చెప్పలేదని అంటుంది.
సంతోష పడిన కావ్య..
అది విన్న కావ్య.. షాక్ అయి.. ఏడుస్తూ పక్కకు వెళ్లి కూర్చుంటుంది. శ్వేత కూడా వెనకాలే వెళ్లి.. కావ్య అని పిలుస్తుంది. దీంతో శ్వేతను హగ్ చేసుకున్న కావ్య.. నా ప్రేమ నిజంగానే ఉంది. నేను ఉండగా ఆయన మరో అమ్మాయిపై ఎందుకు మనసు పారేసుకున్నారా? అని ప్రశ్నించుకుంటూనే ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నాకు తెలిసింది. ఆయన ఏదో దాచడానికి ఈ అబద్దం చెప్పారని తెలిసిందని సంతోషపడుతుంది. వెన్నెల చనిపోయిందని తెలుసు కానీ.. మరి ఆ బిడ్డ ఎవరు? రాజ్ ఎందుకు అబద్ధం చెప్పాడు అని శ్వేత అంటే.. అదే నిజం తెలుసుకోవాలి అని కావ్య అంటుంది. ఏం తెలుసుకుంటావో ఏమో కానీ.. వెన్నెల కోసమే రీ యూనియన్ పెట్టామని రాజ్‌కు చెప్పకు అని శ్వేత అంటుంది. నా కోసం ఇంత సహాయం చేశావ్.. నేనెందుకు చెప్తాను అని కావ్య అంటుంది. ఇక ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.