AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmamudi, December 21st episode: స్వప్నకు అరుణ్ షాక్.. రుద్రాణికి కౌంటర్ ఇచ్చిన పద్మావతి! అనామిక కొత్త ప్లాన్..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో అనామిక, కళ్యాణ్ ల పెళ్లి కోసం అందరూ రిసార్ట్ కి వస్తారు. జరిగేది మీ తమ్ముడి పెళ్లి మాత్రమే కాదు.. నా పెళ్లి కూడా.. నన్ను కూడా ఇక నుంచి గుర్తు పెట్టుకోండని అనామిక అంటే.. అమ్మో అప్పుడే నా కోడలు హక్కుల గురించి మట్లాడేస్తుందని ధాన్య లక్ష్మి అంటుంది. ఇప్పుడు రోజులన్నీ మారిపోయాని పెద్దావిడ అంటే.. ఎంత కాలం మారినా.. ఇప్పుడు బాధ్యతలతో పాటు భయాలు కూడా ఉంటాయి కదా అమ్మమ్మా అని కావ్య అంటుంది. నువ్వెక్కడ భయ పడ్డావ్.. మా అందర్నీ నువ్వే భయ పెట్టావ్ కదా అని రుద్రాణి అంటుంది. కావ్య సంగతి ఏమో గానీ.. నాకు మాత్రం ఆడ పిల్ల..

Brahmamudi, December 21st episode:  స్వప్నకు అరుణ్ షాక్.. రుద్రాణికి కౌంటర్ ఇచ్చిన పద్మావతి! అనామిక కొత్త ప్లాన్..
Brahmamudi
Follow us
Chinni Enni

|

Updated on: Dec 21, 2023 | 11:44 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో అనామిక, కళ్యాణ్ ల పెళ్లి కోసం అందరూ రిసార్ట్ కి వస్తారు. జరిగేది మీ తమ్ముడి పెళ్లి మాత్రమే కాదు.. నా పెళ్లి కూడా.. నన్ను కూడా ఇక నుంచి గుర్తు పెట్టుకోండని అనామిక అంటే.. అమ్మో అప్పుడే నా కోడలు హక్కుల గురించి మట్లాడేస్తుందని ధాన్య లక్ష్మి అంటుంది. ఇప్పుడు రోజులన్నీ మారిపోయాని పెద్దావిడ అంటే.. ఎంత కాలం మారినా.. ఇప్పుడు బాధ్యతలతో పాటు భయాలు కూడా ఉంటాయి కదా అమ్మమ్మా అని కావ్య అంటుంది. నువ్వెక్కడ భయ పడ్డావ్.. మా అందర్నీ నువ్వే భయ పెట్టావ్ కదా అని రుద్రాణి అంటుంది. కావ్య సంగతి ఏమో గానీ.. నాకు మాత్రం ఆడ పిల్ల, చీపురు పుల్ల.. అంటూ భయ పడటం రాదు అమ్మమ్మ గారూ.. కళ్యాణ్ కి కూడా అదే నచ్చింది.. ఏమంటావ్ కళ్యాణ్ అని అనామిక అంటుంది. నువ్వు సూటిగా మాట్లాడతావ్ కానీ.. నా విషయంలోనే నేరుగా కలవకుండా.. తిప్పి తిప్పి పిప్పి చేసేశావ్.. అని అంటాడు కళ్యాణ్. ఈలోపు ఆడ, మగ అని మాట్లాడుకుంటూ ఉంటారు. సరిగ్గా అప్పుడే అప్పూ, కృష్ణ మూర్తిలు, కనకం ఆటోలో వస్తారు. ఈ సంగతులు ఏమో కానీ.. మా వాడి ఫ్యూచర్ మాత్రం నాకు బాగా కనిపిస్తుంది. మావాడు అమూల్ బేబీలా సాఫ్ట్ గా ఉంటాడు. అనామిక మాత్రం ఫైర్ బ్రాండ్ లా ఉంటుంది. ఇప్పుడు నా కొడుకు కూడా మరో ప్రకాశంలా తయారవుతాడని అనిపిస్తుంది అని ప్రకాష్ అనగానే.. అందరూ నవ్వుతారు.

అప్పూతో తనకున్న అనుబంధం గురించి చెప్పిన కళ్యాణ్..

అప్పూని చూసిన కళ్యాణ్.. చేయి పట్టుకుని లాక్కెళ్తాడు. ఈ రోజు నువ్వు మొత్తం నువ్వు నా పక్కనే ఉండాలి. నువ్వే ఈ రోజు నాకు తోడు పెళ్లి కొడుకు.. అని కళ్యాణ్ అంటాడు. ఇది చూసిన అనామిక ఫ్యామిలీ కుళ్లుకుంటుంది. తోడు పెళ్లి కొడుకు అంటే అబ్బాయి ఉండాలి కదా అని ధాన్య లక్ష్మి అంటే.. నా బ్రో అమ్మాయిలా ఎప్పుడు ఉంది? నాకు పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎప్పుడూ అమ్మాయిలా లేదు. నేను భయ పడితే ధైర్యం చెప్పింది. బాధ పడితే నవ్వించింది. అలసి పోయి ఆగిపోతే ముందుకు నడిపించింది. మౌనంగా ఉంటే మాట్లాడేలా చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే నా బ్రోనే నా బలం. మరి ఇంత బలమైన బ్రోని అమ్మాయి అంటే ఎలా ఒప్పుకుంటా అని కళ్యాణ్ అంటాడు. కళ్యాణ్ మాటలకు అప్పూ, కనకం, కృష్ణ మూర్తిలు బాధ పడతారు.

పెళ్లికి వస్తోన్న విక్రమాదిత్య, పద్మావతిలు..

మరోవైపు విక్రమాదిత్య, పద్మావతి, అరవింద, రాధమ్మలు కూడా కళ్యాణ్ పెళ్లి వస్తారు. ఈయనతో కలిసి వెళ్లే అవకాశం వచ్చింది. అస్సలు మిస్ చేసుకోకూడదని పద్మావతి అనుకుంటే.. దీన్ని దూరం పెట్టాలని విక్కీ అనుకుంటాడు. అప్పుడే రాజ్ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు అని అడుగుతాడు. రిసార్ట్ కి దగ్గర్లోనే ఉన్నామని చెప్తాడు విక్కీ. ఆ తర్వాత అందరూ కలిసి లోపలికి వెళ్తారు. అప్పుడే స్వప్నకి అరుణ్ ఫోన్ చేస్తాడు. దీంతో ఫోన్ మాట్లాడటానికి స్వప్న బయటకు వెళ్తుంది.

ఇవి కూడా చదవండి

స్వప్నకి ఫోన్ చేసి భయ పెడుతున్న అరుణ్..

హాయ్ స్వప్న అని అంటాడు అరుణ్. కావాలనే స్వప్నని రెచ్చగొట్టే విధంగా అరుణ్ మాట్లాడతాడు. దీంతో స్వప్న.. అరుణ్ కి గట్టి వార్నింగ్ ఇస్తూ.. ఫొటోలు మా ఆయనకి పంపిస్తావా.. అని అడుగుతుంది. నీతో కలిసి ఉండటానికే.. నిన్నూ రాహుల్ ని విడగొట్టాలని ప్లాన్ చేశానని రాహుల్ అంటాడు. నేను అక్కడికి వస్తాను.. ఎవరికీ తెలియకుండా నాతో వచ్చేయ్ అంటాడు అరుణ్.. రారా నీ కోసమే వెయిట్ చేస్తున్నా.. నీతోనే నిజం చెప్పిస్తాను అని స్వప్న అంటుంది. నేను అక్కడికి వస్తాను.. కానీ నిజం చెప్పను. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని నేనే అని చెప్తాను అని అరుణ్ అంటాడు. దీంతో స్వప్న షాక్ అవుతుంది. ఇప్పుడు వీడిని నేను హ్యాండిల్ చేయలేనే.. వెంటనే కావ్యకు చెప్దాం అని స్వప్న అనుకుంటుంది.

సరదాగా గడిపిన విక్రమాదిత్య – రాజ్ ఫ్యామిలీ..

ఇంతలో విక్రమాదిత్య, పద్మావతిలు వస్తారు. వాళ్లను దుగ్గిరాల కుటుంబం ఆహ్వానిస్తుంది. అందరూ కలవడంతో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. వీళ్లు కూడా మీలాగే మిడిల్ క్లాస్ వాళ్లు అని రుద్రాణి అంటే.. మిడిల్ క్లాస్ అయితే ఏముంది.. అత్తింటి పేరు నిలబెట్టి.. వంటా వార్పూతో ఇంట్లో వాళ్లను చక్కగా చూసుకుంటే చాలు కదండీ పద్మావతి కౌంటర్ ఇస్తుంది. అమ్మా గడుసుపిండమే.. ఎంత చక్కగా చెప్పావే.. నువ్వు నాకు నచ్చావే పిల్లా అని పెద్దావిడ అంటుంది.

రాజ్- కావ్య, పద్మావతి – విక్రమాదిత్యల కామెడీ.. నవ్వులే నవ్వులు..

అనంతరం పద్మావతి వాళ్లకు రూమ్స్ చూపిస్తారు దుగ్గిరాల కుటుంబం. అప్పుడే బెడ్ రూమ్ గురించి రాజ్- కావ్య, పద్మావతి – విక్రమాదిత్యలు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత రాజ్- కావ్య, పద్మావతి – విక్రమాదిత్యలు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. ఈ కామెడీ నిజంగానే నవ్వులు తెప్పిస్తుంది. మరోవైపు కావ్య ఇంకా రావడం లేదని స్వప్న ఇంకా టెన్షన్ పడుతుంది. ఈలోపు రాహుల్ వచ్చి కావాలనే స్పప్నని ఏడిపిస్తాడు. ఇందాక కాల్ వచ్చినప్పటి నుంచి నీ బిహేవియర్ లో మార్పు వచ్చిందని అంటాడు. దీంతో స్వప్న.. రాహుల్ పై అరుస్తుంది. స్వప్నని గమనించిన రాహుల్ .. ఫోన్ రాగానే పాప బాగా కంగారు పడుతుందని అనుకుంటాడు. ఈలోపు రుద్రాణి వచ్చి ఏమంటుంది నీ పెళ్లాం అని అడుగుతుంది. కానీ అది కావ్యకు చెప్తే ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుందని రాహుల్ అంటాడు. దీనికున్న పొగరుకు చెప్పదు. కావ్య చెప్పినట్లు వింటే.. అందరికీ నచ్చేసింది. ఎలాగైనా ఈ పెళ్లి ఆగిపోవాలి. దానికి కారణం స్వప్నే అవ్వాలి అని రుద్రాణి అంటుంది. దాని భయం, కంగారు చూస్తుంటే.. ఖచ్చితంగా అదే జరుగుతుందని అనిపిస్తుంది.

అనామిక ప్లాన్.. బాధలో అప్పూ..

ఆ తర్వాత అప్పూ, కళ్యాణ్ రూమ్ కి వస్తారు. ఏంటి బ్రో అంత సైలెంట్ గా ఉన్నావ్.. అని కళ్యాణ్ అంటే.. అప్పూ కవర్ చేస్తుంది. ఏ అకేషన్ కి ఏం బట్టలు వేసుకోవాలో.. నాకు తెలీడం లేదు. నువ్వు సెలెక్ట్ చేసి పెట్టు అని కళ్యాణ్ అడుగుతాడు. దానికి అప్పూ సెటైర్ వేస్తుంది. నువ్వు ఒప్పుకోవాలంటే.. ఒక్కటేంటి.. డజను డ్రెస్సులు కొనిస్తాను అని కళ్యాణ్ అంటాడు. అప్పుడూ అనామిక.. కళ్యాణ్ గదికి వస్తుంది. కళ్యాణ్, అప్పూలను చూసిన అనామిక మండి పడుతుంది. వచ్చిన దగ్గర నుంచి నీతో పర్సనల్ గా మాట్లాడని ట్రై చేస్తుంటే.. ఎప్పుడూ ఎవరో ఒకరు అడ్డుగానే ఉంటున్నారని.. కావాలని అంటుంది అనామిక. సరే అని అక్కడి నుంచి అప్పూ వెళ్లి పోతుంది. ఇక ఈ రోజుతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.