Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss : కొంపముంచిన బిగ్‏బాస్.. విడిపోతున్న భార్యభర్తలు ?.. హౌస్‏లోనే విడాకులు..

అన్ని భాషల్లోనూ ఈ షోపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బిగ్‏బాస్ రియాల్టీ షో.. స్నేహితులను చేస్తుంది.. ప్రేమికులను విడదీస్తుంది.. కానీ ఇప్పుడు బిగ్‏బాస్ ఏకంగా ఓ జంట విడాకులు తీసుకునేందుకు కారణమవుతుంది. రెండేళ్లు వైవాహిక బంధంలో బిగ్‏బాస్ చిచ్చుపెట్టింది. దీంతో విడాకులు కావాలంటూ హౌస్‏లో పట్టుబట్టింది. ఇంతకీ ఆ జంట ఎవరో తెలుసా.. బాలీవుడ్ బుల్లితెర ఫేమస్ నటి అంకితా లోఖండే.. విక్కీ జైన్.

Bigg Boss : కొంపముంచిన బిగ్‏బాస్.. విడిపోతున్న భార్యభర్తలు ?.. హౌస్‏లోనే విడాకులు..
Bigg Boss 17
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 21, 2023 | 10:59 AM

బిగ్‏బాస్ రియాల్టీ షో అంటేనే వివాదాస్పదం. ప్రస్తుతం తెలుగులో బిగ్‏బాస్ రచ్చ కొనసాగుతూనే ఉంది. గ్రాండ్ ఫినాలే రోజు తమ అభిమాన కంటెస్టెంట్స్‏కు స్వాగతం పలికేందుకు వచ్చిన ఫ్యాన్స్ చేసిన హంగామా గురించి చెప్పక్కర్లేదు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. ఆర్టీసీ బస్సు అద్దాలను పగలగొట్టారు. రన్నరప్ అయిన అమర్ దీప్ కారుపై దాడికి పాల్పడ్డారు. మరోవైపు బిగ్‏బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్.. అతడి సోదరుడిని అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. తెలుగులోనే కాకుండా అటు హిందీ, తమిళం, కన్నడలోనూ బిగ్‏బాస్ రియాల్టీ షో ప్రసారమవుతుంది. అయితే అన్ని భాషల్లోనూ ఈ షోపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బిగ్‏బాస్ రియాల్టీ షో.. స్నేహితులను చేస్తుంది.. ప్రేమికులను విడదీస్తుంది.. కానీ ఇప్పుడు బిగ్‏బాస్ ఏకంగా ఓ జంట విడాకులు తీసుకునేందుకు కారణమవుతుంది. రెండేళ్లు వైవాహిక బంధంలో బిగ్‏బాస్ చిచ్చుపెట్టింది. దీంతో విడాకులు కావాలంటూ హౌస్‏లో పట్టుబట్టింది. ఇంతకీ ఆ జంట ఎవరో తెలుసా.. బాలీవుడ్ బుల్లితెర ఫేమస్ నటి అంకితా లోఖండే.. విక్కీ జైన్.

అంకితా లోఖండే.. పవిత్ర రిష్తా సీరియల్ ద్వారా ఎక్కువగా పాపులర్ అయిన నటి. అదే సమయంలో దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో ప్రేమాయణం, బ్రేకప్ తో నిత్యం వార్తలలో నిలుస్తూండేది. అంకితా లోఖండే డిసెంబర్ 2021లో వ్యాపారవేత్త విక్కీ జైన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఇద్దరూ కలిసి బిగ్ బాస్ 17 హౌస్‌లోకి అడుగుపెట్టారు. అయితే హౌస్ లోకి వెళ్లినప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా తన భార్య అంకితా పట్ల విక్కీ చిన్నచూపు చూడడం.. ఇతర కంటెస్టెంట్స్ అందరి మధ్య తన భార్యను అవమానించడంపై విక్కీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా తన భర్త విక్కీని విడాకులు కావాలని కోరింది అంకితా.

నిన్ని ఎపిసోడ్‏లో కంటెస్టెంట్ అయేషా ఖాన్ మాట్లాడుతూ.. విక్కీ వైవాహిక జీవితం.. ప్రేమ, పెళ్లి గురించి చెప్పాలని కోరింది. దీంతో విక్కీ మాట్లాడుతూ వివాహితుడు ఎదుర్కొనే బాధల గురించి సరదాగా చెప్పాడు. దీంతో అంకితా బాధపడింది. వైవాహిక జీవితం ఎందుకు సరిగ్గా లేదని అంకితా తన భర్తను అడగ్గా.. పెళ్లి తర్వాత పురుషులు ఎన్ని బాధలు భరిస్తున్నారో.. ఎలా అనిపిస్తుందో ఎప్పుడూ బయటకు చెప్పలేరు అని అన్నాడు. దీంతో అంకితా అతడిని విడాకులు కోరింది. బిగ్ బాస్ షో అనంతరం తన భర్తతో కలిసి ఇంటికి వెళ్లాలని కోరుకోవడం లేదని.. తన భర్త నుంచి విడాకులు కావాలని కోరింది. దీంతో కంటెస్టెంట్స్, అడియన్స్ షాకయ్యారు. మొత్తానికి మరో జంటను విడిపోయేందుకు కారణమయ్యింది బిగ్ బాస్ రియాల్టీ షో అంటున్నారు ప్రేక్షకులు.

View this post on Instagram

A post shared by Vikas Jain (@realvikasjainn)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ ఆటగాళ్ల విధ్వంసంతో..ఐపీఎల్‌ టాపర్స్‌ లిస్టే మారిపోయింది!
ఈ ఆటగాళ్ల విధ్వంసంతో..ఐపీఎల్‌ టాపర్స్‌ లిస్టే మారిపోయింది!
రేపు సంకటహర చతుర్ధి.. గణపతి అనుగ్రహం కోసం వేటిని దానం చేయాలంటే..
రేపు సంకటహర చతుర్ధి.. గణపతి అనుగ్రహం కోసం వేటిని దానం చేయాలంటే..
17 సినిమాలు చేసిన స్టార్ డమ్ సొంతం చేసుకోలేకపోయింది..
17 సినిమాలు చేసిన స్టార్ డమ్ సొంతం చేసుకోలేకపోయింది..
పించన్ తీసుకునే వయసులో ఈ పాడు పనులేంట్రా ముసలి నక్క
పించన్ తీసుకునే వయసులో ఈ పాడు పనులేంట్రా ముసలి నక్క
మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ అడ్మిషన్ 2025 నోటిఫికేషన్‌
మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ అడ్మిషన్ 2025 నోటిఫికేషన్‌
ఏడాదిలో రెండో చంద్రగ్రహణం ఎప్పుడు? మన దేశంలో కనిపిస్తుందా?లేదా
ఏడాదిలో రెండో చంద్రగ్రహణం ఎప్పుడు? మన దేశంలో కనిపిస్తుందా?లేదా
5 వరుస ఓటములకు చెక్.. కట్‌చేస్తే.. ధోనిసేనకు ఊహించని షాక్?
5 వరుస ఓటములకు చెక్.. కట్‌చేస్తే.. ధోనిసేనకు ఊహించని షాక్?
జాతకంలో కుజ దోషమా.. లక్షణాలు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నివారణలు
జాతకంలో కుజ దోషమా.. లక్షణాలు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నివారణలు
ఈ నటుడి భార్య కూడా చాలా పాపులర్.. ఆ జంట ఇప్పుడు ఎలా ఉన్నారంటే
ఈ నటుడి భార్య కూడా చాలా పాపులర్.. ఆ జంట ఇప్పుడు ఎలా ఉన్నారంటే
పవన్ కళ్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్..
పవన్ కళ్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్..