Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pallavi Prashanth: ‘నాకు, నా ఫ్యామిలీకి ఏదైనా జరిగితే వాళ్లదే బాధ్యత’.. పల్లవి ప్రశాంత్ కామెంట్స్..

నాలే రోజు అన్నపూర్ణ స్టూడియో ఎదుట ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. స్టూడియో నుంచి బయటకు వస్తున్న కంటెస్టెంట్స్ కార్లపై దాడి చేసి అద్దాలను పగలగొట్టారు. అమ్మాయిలు, సెలబ్రెటీలు అని చూడకుండా కారు డోర్లను లాగుతూ దారుణంగా ప్రవర్తించారు. ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన రచ్చను సుమోటాగా తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు అతడిపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. మొత్తం 9 కేసులలో ప్రశాంత్‏ను A1గా చేర్చారు. అతడి తమ్ముడి రాజును A2గా చేర్చారు జూబ్లీహిల్స్ పోలీసులు.

Pallavi Prashanth: 'నాకు, నా ఫ్యామిలీకి ఏదైనా జరిగితే వాళ్లదే బాధ్యత'.. పల్లవి ప్రశాంత్ కామెంట్స్..
Pallavi Prashanth
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 21, 2023 | 12:18 PM

పల్లవి ప్రశాంత్.. కామన్ మ్యాన్, రైతుబిడ్డగా బిగ్‏బాస్ సీజన్ 7లోకి అడుగుపెట్టాడు. నెగిటివిటీతో హౌస్‏లోకి అడుగుపెట్టిన ప్రశాంత్.. టాస్కులలో అల్లాడించేశాడు. తన ఆట తీరుతో బిగ్‏బాస్ విజేతగా నిలిచాడు. రైతుబిడ్డగా మొదలైన ప్రయాణం బిగ్‏బాస్ సీజన్ 7 విన్నర్ గా నిలిచాడు. కానీ ఆ ఆనందం ఎంతసేపు నిలవలేదు. నెగిటివిటీ, విమర్శలతో బిగ్‏బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ప్రశాంత్.. తన ప్రవర్తనతో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. కానీ గ్రాండ్ ఫినాలే అనంతరం పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన రచ్చతో ఇప్పుడు జైలులో ఉన్నాడు. ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియో ఎదుట ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. స్టూడియో నుంచి బయటకు వస్తున్న కంటెస్టెంట్స్ కార్లపై దాడి చేసి అద్దాలను పగలగొట్టారు. అమ్మాయిలు, సెలబ్రెటీలు అని చూడకుండా కారు డోర్లను లాగుతూ దారుణంగా ప్రవర్తించారు. ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన రచ్చను సుమోటాగా తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు అతడిపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. మొత్తం 9 కేసులలో ప్రశాంత్‏ను A1గా చేర్చారు. అతడి తమ్ముడి రాజును A2గా చేర్చారు జూబ్లీహిల్స్ పోలీసులు.

అయితే ప్రశాంత్ కారణంగానే ఆరోజు అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద అభిమానులు రెచ్చిపోయారని..ఆర్టీసీ బస్సులపై దాడి చేశారనేది ప్రధాన ఆరోపణ. గ్రాండ్ ఫినాలే అనంతరం ప్రశాంత్ ను వేరే గేట్ నుంచి బయటకు పంపించారు పోలీసులు. కానీ అతడు వినకుండా మళ్లీ అక్కడికే తిరిగి వచ్చాడు. దీంతో గొడవ పెద్దగా కావడం జరిగింది. ప్రశాంత్ విన్నర్ అయిన తర్వాత ర్యాలీ ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ అక్కడ ఉన్న పరిస్థితుల్లో ర్యాలీ కష్టమని.. కావాలంటే తర్వాతి రోజు సభ ఏర్పాటు చేసుకుమని చెప్పారు. కానీ ప్రశాంత్ వినకుండా ర్యాలీ నిర్వహించాడు. దీంతో అతడి ఫ్యాన్స్ రెచ్చిపోయి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. నిన్న రాత్రి ప్రశాంత్ నివాసంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతడితోపాటు ప్రశాంత్ తమ్ముడు రాజును అరెస్ట్ చేసి జడ్జీ ముందు ప్రవేశపెట్టగా.. అతడికి 14 రోజుల రిమాండ్ విధించి చంచల్ గూడ జైలుకు తరలించారు.

అయితే అరెస్ట్ కావడానికి ముందు ప్రశాంత్ మాట్లాడుతూ.. “నాకు సరిగా తిండీ నిద్ర లేదు. కొంచెం ఫ్రీ అయ్యాక మీకు గంటలు గంటలు ఇంటర్వ్యూ ఇస్తాను అని చెప్పాను. కొందరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదని వాళ్లు ఏదేదో మాట్లాడారు. ఇది చాలా త్పుప. ఆ ఐదుగురి ఫోటోస్, వీడియోస్ మా వాళ్ల దగ్గర ఉన్నాయి. వాళ్లు నన్ను కావాలనే నెగిటివ్ చేస్తున్నారు. నాకేమైనా అయితే వాళ్లదే బాధ్యత. బిగ్‏బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే నాకోసం వచ్చిన జనాన్ని చూసి నేను పరేషాన్. నాకు ఇంతమంది సపోర్ట్ చేశారా ?.. అనుకున్నాను. పోలీసులు వెనక గేట్ నుంచి వెళ్లమన్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. నాకోసం అంతమంది వచ్చారు. నేను దొంగలాగా వెనక నుంచి వెళ్లను. ముందు గేట్ నుంచే వెళ్తానని చెప్పాను. పోలీసులు ఏమని చెప్పారో నాకు వినబడలేదు. వాళ్లు నా మంచి కోసమే చెప్పారు. నాకు సరిగా వినబడకుండా ముందుకు వెళ్లాను. కావాలని నా గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. నాకు, నా ఇంట్లో వాళ్లకు ఏదైనా జరిగినా ఆ ఐదుగురి ఫోటోస్ బయటకు వస్తాయి” అని అన్నాడు ప్రశాంత్.