Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Super Singer: మరోసారి అలరించడానికి సరికొత్త హంగులతో సిద్దమైన “సూపర్ సింగర్”..

విభిన్నమైన ఆలోచనతో, విలక్షణమైన వాయిస్ లతో సర్వం సిద్ధం చేసుకుంది. షో కోసం ఆడిషన్స్ నిర్వహించి,.. వాటి నుంచి వడపోసిన స్వరాలు ప్రేక్షకులు ఆస్వాదించబోతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక అమెరికా నుంచి, కేరళ నుంచి వచ్చి పాటల మీద, సంగీతం మీద ఆసక్తితో, నిరూపించుకోవాలన్న ఆకాంక్షతో కంటెస్టెంట్స్ పాల్గొనేందుకు రావడం ఈ షో ప్రత్యేకత. మాటల సెలయేరు, హావభావాల పూలతేరు శ్రీముఖి ఈ షో ని ప్రెజెంట్ చేస్తున్నారు.

Super Singer: మరోసారి అలరించడానికి సరికొత్త హంగులతో సిద్దమైన సూపర్ సింగర్..
Super Singer
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 21, 2023 | 6:09 PM

సింగింగ్ షో లలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని, ఎన్నో అద్భుత స్వరాలను పరిచయం చేసిన “సూపర్ సింగర్” ఇప్పుడు స్టార్ మా లో మరింత వినూత్నంగా మళ్ళీ ప్రారంభం కాబోతోంది. విభిన్నమైన ఆలోచనతో, విలక్షణమైన వాయిస్ లతో సర్వం సిద్ధం చేసుకుంది. షో కోసం ఆడిషన్స్ నిర్వహించి.. వాటి నుంచి వడపోసిన స్వరాలు ప్రేక్షకులు ఆస్వాదించబోతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక అమెరికా నుంచి, కేరళ నుంచి వచ్చి పాటల మీద, సంగీతం మీద ఆసక్తితో, నిరూపించుకోవాలన్న ఆకాంక్షతో కంటెస్టెంట్స్ పాల్గొనేందుకు రావడం ఈ షో ప్రత్యేకత. మాటల సెలయేరు, హావభావాల పూలతేరు శ్రీముఖి ఈ షో ని ప్రెజెంట్ చేస్తున్నారు. నలుగురు విభిన్నమైన ప్రతిభ గల న్యాయమూర్తులు ఈ సారి కంటెస్టెంట్స్ ని తీర్చిదిద్దడమే కాదు.. వారి పాటల పాటవాన్ని నిర్ణయించబోతున్నారు. పోటీని మరింత రసవత్తరంగా నడిపించబోతున్నారు.

కమ్మని బాణీకి తన తియ్యని స్వరాన్ని చేర్చి పాటని అందమైన అనుభవంగా తీర్చిదిద్దే గాయని శ్వేతా మోహన్, జానపదాన్ని, సినిమా గీతాన్ని సమంగా తన విలక్షణమైన గొంతుతో పలికించి గుండెల్ని ఊయలలూగిస్తున్న మంగ్లీ ; అకాడెమి అవార్డుల వేదిక పైన తన బలమైన వినూత్న స్వరాన్ని వినిపించిన యువ స్వరం రాహుల్ సిప్లిగంజ్; అందమైన సాహిత్య స్పర్శ తో సందర్భానికి సముచితమైన, ఘనమైన స్థానాన్ని ఇచ్చే గేయ రచయిత అనంత శ్రీరామ్ – ఈ సారి న్యాయ నిర్ణేతలు. 20 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభం కాబోతున్న ఈ షో లో 16 మందితో అసలైన పోటీ మొదలవుతుంది.

ఈ నెల 23 నుంచి.. ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు “సూపర్ సింగర్” సంగీతాభిమానుల్నే కాదు.. ప్రతి “స్టార్ మా” ప్రేక్షకుల్ని అలరించబోతోంది. షో నిర్వహణలో ఈ సారి స్టార్ మా ఓ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. కంటెస్టెంట్స్, వాళ్ళని తీర్చిదిద్దే జడ్జెస్, మార్కులు.. ఇవి మాత్రమే కాకుండా షో ని ఇంకా ఇంటరెస్టింగ్ గా మలచబోతున్న ఆ విషయం ఏంటో తెలుసుకోవాలంటే స్టార్ మా లో సూపర్ సింగర్ చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.