Brahmamudi, December 22nd episode: అప్పూ ప్రేమని కనిపెట్టిన పద్మావతి.. కావ్య దెబ్బకు పారిపోయిన అరుణ్!
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో అప్పూని డోర్ దగ్గర నిల్చోమని చెప్తుంది అనామిక. దీంతో అప్పూ ఫీల్ అవుతుంది. హే అదేం మర్యాద.. అప్పూని వెళ్లనీ అని కళ్యాణ్ అంటే.. మన బ్రోనే కదా.. అర్థం చేసుకుంటుందిలే అని అనామిక అంటుంది. బయట డోర్ దగ్గర ఉన్న అప్పూ బాధ పడుతూ ఉంటుంది. ఈలోపు అనామిక తన పేరెంట్స్ ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటానని చెప్పు అని కళ్యాణ్ దగ్గర నుంచి మాట తీసుకుంటుంది. ఆ తర్వాత కళ్యాణ్ ని హగ్ చేసుకుంటుంది అనామిక. సరిగ్గా అప్పుడే ధాన్య లక్ష్మి, ప్రకాష్ వస్తారు. నువ్వేంటి అప్పూ ఇక్కడ నిల్చున్నావ్.. అని అడుగుతారు. అదేం లేదు ఆంటీ..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో అప్పూని డోర్ దగ్గర నిల్చోమని చెప్తుంది అనామిక. దీంతో అప్పూ ఫీల్ అవుతుంది. హే అదేం మర్యాద.. అప్పూని వెళ్లనీ అని కళ్యాణ్ అంటే.. మన బ్రోనే కదా.. అర్థం చేసుకుంటుందిలే అని అనామిక అంటుంది. బయట డోర్ దగ్గర ఉన్న అప్పూ బాధ పడుతూ ఉంటుంది. ఈలోపు అనామిక తన పేరెంట్స్ ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటానని చెప్పు అని కళ్యాణ్ దగ్గర నుంచి మాట తీసుకుంటుంది. ఆ తర్వాత కళ్యాణ్ ని హగ్ చేసుకుంటుంది అనామిక. సరిగ్గా అప్పుడే ధాన్య లక్ష్మి, ప్రకాష్ వస్తారు. నువ్వేంటి అప్పూ ఇక్కడ నిల్చున్నావ్.. అని అడుగుతారు. అదేం లేదు ఆంటీ.. అని అప్పూ చెప్తుంది. సరే లోపలికి వెళ్లనీ అంటారు. వద్దని అప్పూ చెప్పినా వినిపించుకోకుండా.. గదిలోకి వెళ్తారు కళ్యాణ్ పేరెంట్స్.
హగ్ చేసుకున్న అనామిక, కళ్యాణ్ లు..
లోపల అనామిక, కళ్యాణ్ హగ్ చేసుకోవడం చేసుకోవడం చూసి.. ప్రకాష్ కొంప ముంచకురా అని అంటారు. నా బ్యాగ్ నీతో పాటు వచ్చింది ఇవ్వు. నా బ్యాగ్ మోసుకుని రండి అని చెప్పి ధాన్య లక్ష్మి వెళ్లి పోతుంది. ఆ తర్వాత ప్రకాష్ కూడా వెళ్లి పోతాడు. ఈ సీన్ కట్ చేస్తే.. కావ్యను పక్కకు లాక్కొచ్చి.. అరుణ్ కాల్ చేసిన విషయం కంగారుగా చెప్తుంది. నన్ను మళ్లీ బెదరిస్తున్నాడని అంటుంది స్వప్న. ఏమంటున్నావ్ అక్కా.. అరుణ్ కాల్ చేయడం ఏంటి? అని కావ్య షాక్ అవుతుంది. అవును కాల్ చేసి.. ఇక్కడికి వచ్చి ఈ పెళ్లి ఆపుతానని అంటున్నాడు. నా కడుపులో బేబీకి తండ్రి వాడే అని చెప్తానని అంటున్నాడు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. కాళ్లూ చేతులు ఆడటం లేదని స్వప్న కంగారు పడుతుంది.
అరుణ్ కాల్ చేసిన విషయం కావ్యకు చెప్పిన స్వప్న..
తప్పించుకుని పారిపోయినవాడు.. మళ్లీ తిరిగి కాల్ చేసి బెదిరించడం ఏంటి? అంత ధైర్యం వాడికి ఎలా వచ్చింది? దొరికి పోతాడు అని తెలిసి కూడా ఎలా రాగలిగాడని కావ్య ఆలోచిస్తుంది. నేను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు.. నేను ఇంటికి వెళ్లి పోతా.. పోనీ కొన్ని రోజులు ఎవరికీ కనిపించకుండా ఎక్కడికైనా వెళ్లి పోతాను. వాడు వచ్చి ఏం గొడవ పెడతాడో అని భయంగా ఉందని స్వప్న అంటుంది. నువ్వు ఎన్ని రోజులు ఇలా దాక్కుంటావ్.. నువ్వేం భయపడకు.. ఈ సారి ఫోన్ చేస్తే.. నువ్వు ఏం చేసుకుంటావో చేస్కో.. నేను ఎక్కడికీ రాను.. నువ్వు వస్తే ఇక్కడికే రా అని చెప్పేయ్ అని కావ్య అంటే.. వచ్చి వాడు నిజంగానే పెళ్లిలో గొడవ చేస్తాడని స్వప్న భయ పడుతుంది. అక్కడ వరకూ మనం రానివ్వం కదా.. కనిపించగానే వాడిని పట్టుకుందాం. పెళ్లి అయ్యాక.. అందరి ముందూ వాడిని నిలబెట్టి.. వాడి బాగోతం మొత్తం బయట పెడదాం అని కావ్య.. స్వప్నకు ధైర్యం చెప్తుంది. సరే అని వెళ్తుంది స్వప్న.
స్వప్నకు ధైర్యం చెప్పిన కావ్య.. ప్రకాష్ కామెడీ సీన్లు..
ఈ లోపు రాహుల్.. అరుణ్ కి కాల్ చేస్తాడు. లోపలికి రమ్మంటారా అని అరుణ్ అడిగితే.. అవసరం లేదు.. నేను టైమ్ చూసుకుని చెప్పినప్పుడు మాత్రం.. స్వప్నకు ఎదురు పడితే సరి పోతుందని రాహుల్ చెప్తాడు. మరో వైపు తన అందం గురించి.. ధాన్య లక్ష్మికి గొప్పలు చెబుతుంది. ఇది విన్న కుచల కుమారి భర్త.. నోర్ముయ్.. ఏం మాట్లాడుతున్నావ్.. ఇంకొక్క మాట మాట్లాడితే నాలుక కోసి కుక్కలకు.. నక్కలకు వేస్తాను అని కౌంటర్ వేస్తాడు. ఆ తర్వాత కుచల కుమారి.. ధాన్య లక్ష్మి.. నగల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సరిగ్గా అప్పుడే ప్రకాష్.. వస్తాడు. పంచె కట్టుకోవడం మానేసి చెడ్డీ మీదనే మర్చి పోయి వచ్చేస్తాడు ప్రకాష్. ఇది చూసిన అక్కడి వాళ్లందరూ నవ్వుతారు.
కావాలనే కావ్యని తిట్టించిన రాజ్..
అందరూ ఇక హల్దీ ఫంక్షన్ కోసం సిద్ధం చేస్తారు. ఎవరికి వారు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కావ్య వస్తుంది. కావ్యని తిట్టించాలని ప్లాన్ చేస్తాడు రాజ్. కావ్య చేతిలో ఉన్న ప్లేట్లు తీసుకుని.. రాజ్ తీసుకుని వస్తాడు. అది చూసిన అపర్ణ.. ఆడవాళ్లతో చేయించాల్సిన పని.. మొగవాళ్లతో చేయించడానికి బుద్ధి లేదా అని తిడుతుంది. వద్దని చెప్పాలని తెలీదా అని అపర్ణ సీరియస్ అయితే.. కావాలనే రుద్రాణి మధ్యలో పుల్లలు పెడుతుంది. ఇదంతా గమనించి రాధమ్మ.. నువ్వే వెళ్లి ఆ ప్లేట్స్ తీసుకొచ్చావ్ కదా.. అందరూ తిడుతుంటే.. నువ్వేంటి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నావ్ అని మందలిస్తుంది. అలాంటప్పుడు తన తప్పేం లేదని నువ్వు చెప్పాలి కదారా.. అని రాజ్ ని అందరూ తప్పు పడతారు. సుభాష్ కూడా ఫైర్ అవుతాడు. ఇది చూసిన కావ్య లోలోపల నవ్వుతూ ఉంటుంది. అప్పుడే పద్మావతి మెడలో హారం కిందకు జారుతుంది. ఇది గమనించిన పెద్దావిడ.. విక్రమ్ రా వచ్చి ఆ హారం జారి పోతుంది. సరిగ్గా పెట్టు అని చెప్తుంది. హారాన్ని.. గట్టిగా పద్మావతి మెడకు బిగిస్తాడు విక్రమాదిత్య. సైలెంట్ గా కావ్య.. రాజ్ కాలి తొక్కుతుంది. దీంతో గట్టిగా అరుస్తాడు రాజ్. మొత్తం మీద ఈ సన్నివేశాలన్నీ.. నవ్వు తెప్పిస్తాయి.
కావ్య, రాజ్ లపై పద్మావతి అనుమానం..
రాజ్, కావ్యల జోడీపై పద్మావతికి అనుమానం వస్తుంది. వాళ్లు కూడా మనలాగే పోట్లాడుకుంటారేమో.. రాజ్ కూడా కావ్యని సరిగ్గా చూసుకోవడం లేదోమో అని అంటుంది పద్మావతి. విక్రమ్, పద్మావతిలను గమనించిన కావ్య.. విక్కీ కూడా మా ఆయనలాగే ఉన్నట్టున్నాడని మనసులో అనుకుంటుంది కావ్య. ఆ తర్వాత అనామిక, కళ్యాణ్ లు వస్తారు. ఇక వారికి పసుపు రాయడం స్టార్ట్ చేస్తారు. ఈ లోపు ధాన్య లక్ష్మి.. ప్రకాష్ గురించి చెప్తుంది. దీంతో అందరూ నవ్వుతారు. ఇక సంప్రదాయం గురించి చెప్తూ.. పసుపు రాస్తుంది పెద్దావిడ. ఆ తర్వాత ప్రకాష్ మతి మరుపు గురించి అందరూ జోకులు వేసుకుని నవ్వుతారు. ఇక కళ్యాణ్ ని చూసి అప్పూ బాధ పడుతుంది. నువ్వు కోరుకున్న అమ్మాయితోనే సంతోషంగా ఉండు అని అనుకుంటుంది.
అప్పూ బాధను గమనించిన పద్మావతి..
అప్పూ బాదగా ఉండటం గమనించిన పద్మావతి.. ఏమైంది అలా ఉన్నావని అడుగుతుంది. బాగానే ఉన్నానని అప్పూ చెప్పినా.. లేదు ఏదో జరిగింది ఎందుకు బాధ పడుతున్నావ్ చెప్పు అని పద్మావతి అడుగుతుంది. అవి బాధతో వచ్చిన కన్నీళ్లు కాదమ్మా.. ఆనంద బాష్పాలు అని కవర్ చేస్తారు కనకం, కృష్ణ మూర్తి. కానీ పద్మావతి నమ్మదు. అప్పూని పిలుస్తాడు కళ్యాణ్. ఆ తర్వాత అందరూ పసుపు రాయడం స్టార్ట్ చేస్తారు. అప్పూని చూసిన అనామిక ఫీల్ అవుతుంది. మెట్లు ఎక్కే క్రమంలో.. రాధ జారబోతుంది. అప్పుడే కళ్యాణ్, రాజ్, విక్కీ, విక్కీ బ్రో వచ్చి పట్టుకుంటారు. వాళ్లను చూసిన అందరూ సంతోషిస్తారు.
రుద్రాణి పుల్లలు.. కావ్యా, రాజ్ ల ఆటలు..
ఆ తర్వాత కావ్య, రాజ్ లు విక్కీ పిన్ని విషయంలో గొడవ పడతారు. ఇది గమనించిన రుద్రాణి.. పుల్లలు పెట్టడానికి ట్రై చేస్తుంది. రాజ్, కావ్యల మధ్య ప్రేమ లేకున్నా ఉందని.. నటస్తున్నారని అనుమానంగా ఉందమ్మా అని ఇందిరా దేవి దగ్గర అంటుంది. అప్పుడే కావ్య దగ్గరకు వచ్చి స్వప్న.. మా అత్త నీ మీద అమ్మమ్మకి ఫిర్యాదు చేస్తుంది. నువ్వూ రాజ్ సంతోషంగా లేరని చెప్తుంది. నిజమేనా అని స్వప్న అడుగుతుంది. అదేం లేదక్కా.. ఇప్పుడు చూడు మీ అత్తకి షాక్ ఇస్తాను. అని కావ్య వెళ్లి రాజ్ కి పసుపు రాస్తుంది. దీంతో రాజ్ కూడా కావ్యకి పసుపు రాయడానికి ట్రై చేస్తారు. ఇద్దరూ పసుపుతో రాసుకుంటారు. దీంతో అందరూ సంతోష పడతారు. వాళ్లిద్దర్నీ చూసిన ఇందిరా దేవి.. నీ మొహం వాళ్లెక్కడ గొడవ పడుతున్నారు అని రుద్రాణిపై ఫైర్ అవుతుంది. దీంతో పద్దూ కూడా.. విక్కీకి పసుపు రాస్తుంది. ఆ తర్వాత కళ్యాణ్.. అప్పూకి పసుపు రాయబోతే.. అనామిక అడ్డుకుని కళ్యాణ్ కి రాస్తుంది. ఆ తర్వాత జంటలు అందరూ కలిసి పసుపు రాసుకుంటారు. ఇదే సమయంలో అప్పూని పక్కకు లాక్కెళ్తుంది అనామిక అమ్మ శైలు.
కావ్యను చూసి పారిపోయిన అరుణ్..
అప్పుడే స్వప్నకి అరుణ్ కనిపిస్తాడు. స్వప్న వెంటనే కావ్యని తీసుకుని వస్తుంది. దీంతో అరుణ్ పారి పోతాడు. అల్లుడి గారితో ఎందుకు నువ్వు అంత చనువుగా ఉంటున్నావ్ అని అప్పూని.. సుబ్రమణ్యం, శైలు అడుగుతారు. ఇన్ని రోజులూ వేరు.. ఇప్పుడు మా అమ్మాయితో పెళ్లి జరుగుతుంది కదా ఇంకా అలానే తిరగడానికి సిగ్గు లేదా అని అడుగుతారు. వాళ్లు తిట్టడాన్ని కనకం, కృష్ణమూర్తి గమనిస్తారు. వెంటనే వచ్చి.. మీరేం మాట్లాడుతున్నారో తెలుస్తుందా.. మీరు మా అమ్మాయిని అపార్థం చేసుకుంటున్నారని అంటారు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.