AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CWG 2026 : క్రికెట్ వదిలి జావెలిన్ పట్టాడు.. ఇప్పుడు నీరజ్ చోప్రాకే షాకిచ్చి గోల్డ్ మెడల్ కొట్టేశాడు

CWG 2026 : కామన్వెల్త్ గేమ్స్ 2026లో శ్రీలంక మాజీ క్రికెటర్ రుమేష్ తరంగ పతిరాగే సంచలన ప్రదర్శనతో నీరజ్ చోప్రాను వెనక్కి నెట్టి జావెలిన్ త్రోలో స్వర్ణం గెలిచాడు. మాజీ ఫాస్ట్ బౌలర్ నుంచి గోల్డ్ మెడలిస్ట్‌గా ఎదిగిన అతని అద్భుత ప్రయాణం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

CWG 2026 : క్రికెట్ వదిలి జావెలిన్ పట్టాడు.. ఇప్పుడు నీరజ్ చోప్రాకే షాకిచ్చి గోల్డ్ మెడల్ కొట్టేశాడు
Rumesh Tharanga Pathirage
Rakesh
|

Updated on: Aug 01, 2026 | 2:53 PM

Share

CWG 2026 : గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2026 పురుషుల జావెలిన్ త్రో ఫైనల్‌లో శ్రీలంకకు చెందిన రుమేష్ తరంగ పతిరాగే సంచలన ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని సాధించాడు. తీవ్రమైన చలి, ఈదురుగాలులు వీస్తున్న వాతావరణంలోనూ తన రెండో ప్రయత్నంలోనే ఏకంగా 89.75 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి ఈ చారిత్రక ఘనత సాధించాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో భారత డబుల్ ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రాను వెనక్కి నెట్టి గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. 2006 తర్వాత కామన్వెల్త్ గేమ్స్ అథ్లెటిక్స్‌లో శ్రీలంకకు లభించిన తొలి పసిడి పతకం ఇదే కావడం విశేషం.

భారత్‌కు రజతం, కాంస్య పతకాలు

ఈ ప్రతిష్టాత్మక పోటీలో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా 85.83 మీటర్ల అత్యుత్తమ త్రో నమోదు చేసి రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక కామన్వెల్త్ గేమ్స్‌లో అరంగేట్రం చేసిన భారత్‌కే చెందిన యశ్‌వీర్ సింగ్ తన చివరి ప్రయత్నంలో 85.41 మీటర్ల వ్యక్తిగత బెస్ట్ త్రో విసిరి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. తీవ్ర పోటీ మధ్యలో గ్రెనడాకు చెందిన ఆండర్సన్ పీటర్స్ (83.88మీ) నాలుగో స్థానంలో నిలవగా, పాకిస్తాన్ స్టార్ అర్షద్ నదీమ్ (77.41మీ) తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

ఫాస్ట్ బౌలర్ నుంచి జావెలిన్ ఛాంపియన్‌గా..

శ్రీలంకలోని కలుతరలో జన్మించిన రుమేష్ తరంగ పతిరాగే ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్‌గా తన క్రీడా ప్రస్థానాన్ని ప్రారంభించాడు. అండర్-18 స్థాయిలో ఆడుతున్నప్పుడు క్రమం తప్పకుండా గంటకు 130 కి.మీ నుంచి 134 కి.మీ వేగంతో బౌలింగ్ చేస్తూ మంచి బౌలర్‌గా గుర్తింపు పొందాడు. అయితే తన తండ్రి మార్గదర్శకత్వంలో మొదట డిస్కస్ త్రో నేర్చుకుని, 2017లో కోచ్ టోనీ సలహాతో జావెలిన్ త్రో వైపు అడుగులు వేశాడు. ఈ నిర్ణయమే అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. జావెలిన్‌లో ప్రాథమిక సూత్రాలు సరిగ్గా పాటిస్తే ఖచ్చితంగా విజయాలు సాధిస్తావని కోచ్ ఇచ్చిన ప్రోత్సాహమే ఈ స్థాయికి తెచ్చిందని పతిరాగే గుర్తుచేసుకున్నాడు.

క్రికెట్ పై తగ్గని ప్రేమ…

వృత్తిరీత్యా జావెలిన్ క్రీడాకారుడిగా మారినప్పటికీ, పతిరాగేకు క్రికెట్‌పై ఉన్న మక్కువ మాత్రం తగ్గలేదు. ప్రొఫెషనల్ టోర్నమెంట్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఇప్పటికీ స్వగ్రామానికి వెళ్లినప్పుడు తన చిన్ననాటి స్నేహితులతో కలిసి సాఫ్ట్‌బాల్ క్రికెట్ ఆడుతుంటాడు. సరదాగా ఆడే ఈ క్రికెట్ మ్యాచ్‌లు తన మనస్సుకు ఎంతో ప్రశాంతతను ఇస్తాయని పతిరాగే మీడియాకు తెలిపాడు.

రెండు రకాల క్రీడలు ఆడిన ఇతర ప్రముఖ క్రికెటర్లు

రుమేష్ తరంగ పతిరాగే మాత్రమే కాకుండా.. గతంలో కూడా చాలామంది దిగ్గజ క్రికెటర్లు ఇతర క్రీడల్లోనూ తమ సత్తా చాటారు. భారత లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ క్రికెట్ ఆడటానికి ముందు ఇంటర్నేషనల్ స్థాయిలో చెస్ ఆడాడు. వెస్టిండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ క్రికెట్‌తో పాటు తమ దేశం తరఫున ఫుట్‌బాల్ కూడా ఆడాడు. దక్షిణాఫ్రికా రన్ అవుట్ కింగ్ జాంటీ రోడ్స్ హాకీ, క్రికెట్ రెండింటిలోనూ రాణించాడు. ఇంగ్లాండ్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ క్రికెట్ నుంచి తప్పుకున్నాక ప్రొఫెషనల్ బాక్సింగ్ వైపు అడుగులు వేశాడు. అలాగే ఆస్ట్రేలియా ఉమెన్ స్టార్ అథ్లెట్ ఎలిస్ పెర్రీ ఫుట్‌బాల్ (సాకర్), క్రికెట్ రెండింటిలోనూ ప్రపంచకప్‌లు ఆడిన ఏకైక క్రీడాకారిణిగా రికార్డు సృష్టించగా, ఇంగ్లాండ్ మాజీ పేసర్ లియామ్ ప్లంకెట్ బేస్‌బాల్, క్రికెట్ రెండింటిలోనూ తన సత్తా చాటాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పట్టణ కోటపై ఎవరి జెండా?
పట్టణ కోటపై ఎవరి జెండా?
OTTలో దుమ్మురేపుతోన్న మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTTలో దుమ్మురేపుతోన్న మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
మాజీ ప్రేమికుల కోసం స్పెషల్ లవ్ మార్కెట్.. ఏడాదికోసారి కలుసుకునే
మాజీ ప్రేమికుల కోసం స్పెషల్ లవ్ మార్కెట్.. ఏడాదికోసారి కలుసుకునే
ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ ప్లాట్‌ఫామ్‌పై కేంద్ర విద్యాశాఖ సమీక్ష..
ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ ప్లాట్‌ఫామ్‌పై కేంద్ర విద్యాశాఖ సమీక్ష..
2027లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ సంచలనం
2027లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ సంచలనం
తక్కువ ధరలో స్మార్ట్‌వాచ్ తెచ్చేస్తున్న బోట్‌ లూనార్ డిస్కవరీ..
తక్కువ ధరలో స్మార్ట్‌వాచ్ తెచ్చేస్తున్న బోట్‌ లూనార్ డిస్కవరీ..
గుడ్‌న్యూస్‌.. ఐఫోన్ 17 ప్రోపై రూ.39,000 తగ్గింపు.. బెస్ట్‌ డీల్‌
గుడ్‌న్యూస్‌.. ఐఫోన్ 17 ప్రోపై రూ.39,000 తగ్గింపు.. బెస్ట్‌ డీల్‌
దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..
దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..
బాబోయ్ దెయ్యం.. మెట్లు దిగుతున్న యువతిపై ఎటాక్‌! సీసీ కెమెరాలో
బాబోయ్ దెయ్యం.. మెట్లు దిగుతున్న యువతిపై ఎటాక్‌! సీసీ కెమెరాలో
బిగ్‌బాస్‌ షోతో గంగవ్వకు మొత్తం ఎంత డబ్బు వచ్చిందో తెలుసా?
బిగ్‌బాస్‌ షోతో గంగవ్వకు మొత్తం ఎంత డబ్బు వచ్చిందో తెలుసా?
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర