టేబుల్ టెన్నిస్‌లో ట్రాఫిక్ డీఎస్పీకి బంగారు పతకం.. అభినందించిన డీజీపీ
హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు జరిగిన 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2026లో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఏసీపీ కట్టా హరిప్రసాద్ సత్తా చాటారు. టేబుల్ టెన్నిస్ సింగిల్స్ విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. బహుమతి ప్రదానోత్సవంలో డీజీపీ సీవీ ఆనంద్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నారు.

తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (TGPA) వేదికగా 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2026 పోటీలు ఘనంగా ముగిశాయి. విజేతలకు డీజీపీ చేతుల మీదుగా పతకాలు అందజేశారు. ప్రతి పోలీస్ అధికారి శారీరక వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. ఐదు క్లస్టర్ల విధానంలో ఈ పోటీలను నిర్వహించి.. పథకాలను అందజేశారు. పోలీసుల్లో మానసిక, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడానికి ఈ పోటీలు ఎంతగానో దోహదపడ్డాయని డీజీపీ తెలిపారు. కాగా.. పోటీల్లో పలువురు అధికారులు తమ ప్రతిభతో సత్తా చాటారు. ఈ పోటీట్లో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఏసీపీ కట్టా హరిప్రసాద్ టేబుల్ టెన్నిస్ పోటీల్లో బంగారు పతకం సాధించారు.
హైదరాబాద్ నగరంలోని తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో సెప్టెంబర్ 28-30 వరకు 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్-2026 కొనసాగాయి. ఈ పోటీల్లో పాల్గొన్న హరిప్రసాద్ టేబుల్ టెన్నిస్ పోటీలో సింగిల్స్ విభాగంలో స్వర్ణపతకం సాధించారు. బహుమతి ప్రదానోత్సవంలో డీజీపీ సీవీ ఆనంద్ చేతుల మీదుగా స్వర్ణపతకాన్ని అందుకున్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్‌లో కూడా రాష్ట్ర స్థాయిలో పలు బహుమతులను గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే.. టేబుల్ టెన్నిస్‌లో స్వర్ణపతకం సాధించిన హరిప్రసాద్‌ను తోటి ఉద్యోగులు, సిబ్బంది అభినందించారు.
మిరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
