AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Rules: డేట్ ఆఫ్ బర్త్, డెట్ సర్టిఫికేట్లు పొందాలంటే కష్టమే.. కేంద్రం కఠిన రూల్స్.. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చేశాయి..

డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల జారీకి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇక నుంచి వీటి జారీ ప్రక్రియ కఠినతరంగా ఉంటుంది. ఇప్పటివరకు ఈ సర్టిఫికేట్లను సులువుగా పొందే అవకాశం ఉండేది. కానీ ఇక నుంచి ఆలస్యం కానుంది.

New Rules: డేట్ ఆఫ్ బర్త్, డెట్ సర్టిఫికేట్లు పొందాలంటే కష్టమే.. కేంద్రం కఠిన రూల్స్.. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చేశాయి..
Date Of Birth
Venkatrao Lella
|

Updated on: Oct 01, 2026 | 3:17 PM

Share

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనన మరణాల సవరణ చట్టంను అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. జనన మరణాల నమోదు చట్టం 1969కు కొన్ని సవరణలు కేంద్రం చేసింది. ఇందులో భాగంగా డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల జారీకి కొత్త రూల్స్ తీసుకురాగా.. గతంతో పోలిస్తే ఇవి మరింత కఠినంగా ఉన్నాయి. ప్రజలు సకాలంలో జనన, మరణాలు నమోదు చేసుకునేలా, జాప్యాన్ని నివారించడం లక్ష్యంగా కఠిన ఆంక్షలు విధించారు. జనన మరణాల నమోదు సవరణ బిల్లు ఈ ఏడాది ఆగస్టులో జరిగిన వర్షాకాల సమావేశాల్లో ఆమోదం పొందగా.. రాష్ట్రపతి ఆమోదంతో అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. జనన, మరణ ధృవపత్రాల జారీలో పారదర్శకత కోసం ఈ కొత్త రూల్స్ తీసుకొచ్చారు. నేటి నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త రూల్స్ ఏంటో చూద్దాం.

కొత్త రూల్స్ ఇవే..

జననం లేదా మరణం జరిగిన 21 రోజుల్లోపు నమోదు చేసుకుంటే ప్రక్రియ సులభతరంగా ఉంటుంది. ఎలాంటి రుసుంలు చెల్లించకుండానే ఉచితంగా జారీ చేస్తారు. ఒకవేళ 21 రోజుల తర్వాత దరఖాస్తు చేసుకుంటే ప్రక్రియ మరింత కఠినతరంగా ఉంటుంది. ఒక ఏడాది నుంచి రెండేళ్లలోపు దరఖాస్తు చేసుకుంటే సర్టిఫికేట్ల జారీ ప్రక్రియ క్లిష్టతరంగా ఉంటుంది. జిల్లా మేజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆదేశాలు అవసరం పడతాయి. ఇక రెండేళ్లు దాటాక అప్లై చేసుకుంటే ఫస్ట్ క్లాస్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ ఆదేశాలు అవసరమవుతాయి. వారి ఆదేశాలు ఇచ్చిన తర్వాతనే సర్టిఫికేట్లు జారీ అవుతాయి. ఈ కొత్త మార్గదర్శకాలను అమలు చేసే బాధ్యతలను రిజిస్ట్రార్లకు అప్పగించారు. దేశవ్యాప్తంగా అన్ని గ్రామ, నగర పంచాయతీలతో పాటు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఈ ఆదేశాలు అమలవుతాయని కేంద్రం స్పష్టం చేసింది.

వేరే జిల్లాలో మరణిస్తే..

ఇక ఒక వ్యక్తి తన సొంత జిల్లాలో కాకుండా వేరే జిల్లాల్లో మరణిస్తే డెత్ సర్టిఫికేట్ కోసం కుటుంబసభ్యులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. మరణించిన వ్యక్తికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత ఆస్పత్రి జారీ చేసే సర్టిఫికేట్‌ను మీ సేవా కేంద్రాల్లో సమర్పించి డెత్ సర్టిఫికేట్ సులువుగా పొందవచ్చు. 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని, ప్రజలు దీనిని గమనించాలని కేంద్రం కోరింది. డేట్ ఆఫ్ బర్త్, డెట్ సర్టిఫికేట్ జారీలో ఖచ్చితత్వాన్ని నిర్దారించడం, పారదర్శకంగా జారీ చేసేందుకు కేంద్రం ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ప్రతీఒక్కరికీ అవసరం. దీంతో పిల్లల జననం జరిగిన తర్వాత వెంటనే తల్లిదండ్రులు అప్లై చేసుకోవడం మంచిది. దీని వల్ల సులువుగా పొందే అవకాశం ఉంటుంది.

Follow Us