AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓర్నాయనో.. ఇదేంది ఇంతుంది.. ఇంటి పక్కనే తాపీగా బజ్జుంది.. ధైర్యముంటేనే చూడండి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో భారీ కొండచిలువ కలకలం రేపింది. శ్రీనివాస్ నగర్ కాలనీ గుట్ట సమీపంలోని ఇళ్ల మధ్య సుమారు 12 అడుగుల పొడవున్న పైథాన్ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ రెస్క్యూ టీమ్ సురక్షితంగా పట్టుకుని, అటవీశాఖ సమక్షంలో దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలేందుకు ఏర్పాట్లు చేసింది.

ఓర్నాయనో.. ఇదేంది ఇంతుంది.. ఇంటి పక్కనే తాపీగా బజ్జుంది.. ధైర్యముంటేనే చూడండి..
Python Rescued In Palvancha
N Narayana Rao
| Edited By: |

Updated on: Oct 01, 2026 | 2:55 PM

Share

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ కొండచిలువ కలకలం రేపింది. ఇళ్ల మధ్య భారీ శబ్ధాలతో పాకుతూ కనిపించింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పాల్వంచలోని శ్రీనివాస్ నగర్ కాలనీ గుట్ట సమీపంలో.. ఇళ్ల మధ్య భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది.. సుమారు 12 అడుగుల పొడవుతో.. భారీ ఆకారంతో ఉన్న కొండచిలువను చూసి స్థానికులు పరుగులు తీశారు. అంతేకాకుండా వెంటనే అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే ఫారెస్ట్ అధికారుల సూచనల మేరకు కొత్తగూడెం స్నేక్ రెస్క్యూ టీమ్ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత రెస్క్యూ టీమ్ సభ్యులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి, ప్రాణాపాయం లేకుండా ఆ కొండచిలువను సురక్షితంగా పట్టుకున్నారు. రెస్క్యూ టీమ్ పైథాన్ ను పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

వీడియో చూడండి..

మరోవైపు, కాలనీలోకి కొండచిలువ వచ్చిందనే విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రజలు దానిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రెస్క్యూ అనంతరం అటవీశాఖ సమక్షంలో ఆ కొండచిలువను దట్టమైన అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us