Brahmamudi, August 26th episode: కావ్య ఇచ్చిన షాక్ కి అవాక్కైన దుగ్గిరాల ఫ్యామిలీ లేడీస్.. మళ్లీ ఇరుక్కుపోయిన రాజ్!!
ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో అనామికను కలవడానికి రెడీ అయి వెళ్తూ ఉంటాడు కళ్యాణ్. అనామిక, కళ్యాణ్ కి కాల్ చేసి ఎక్కడికి రావాలో అడ్రస్ చెప్తుంది. అలాగే కొన్ని కండీషన్స్ కూడా పెడుతుంది. ఈలోపు కళ్యాణ్, అప్పూకి కూడా కాల్ చేసి రమ్మంటాడు. నెక్ట్స్ కావ్య తన అత్తింటి వెళ్లేందుకు ఆటో కోసం రోడ్డు మీద నిల్చుంటుంది. ఈలోపు రౌడీలు వస్తారు. కావ్యపై కామెంట్స్ చేస్తారు. అబ్బా ఎవర్రా ఈ మేడమ్.. భలే అందంగా ఉంది. సినిమా హీరోయినా లేక సీరియల్ హీరోయినా అంటూ కామెంట్స్ చేస్తారు. కావ్య వాళ్ల వైపు కోపంగా చూస్తూ మౌనంగా ఉంటుంది. ఆ అల్లరి మూక మీర ఆటపట్టిస్తూ ఉండగా.. వాళ్లని కడిగిపారేద్దామనుకుంటుంది కావ్య. ఇంతలో అటుగా రాజ్ కారు రావడాన్ని కావ్య చూస్తుంది. దీంతో మౌనంగా ఉండి పోతుంది. రాజ్ కారులో వెళ్తూ కావ్యని, అల్లరి మూకను..
ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో అనామికను కలవడానికి రెడీ అయి వెళ్తూ ఉంటాడు కళ్యాణ్. అనామిక, కళ్యాణ్ కి కాల్ చేసి ఎక్కడికి రావాలో అడ్రస్ చెప్తుంది. అలాగే కొన్ని కండీషన్స్ కూడా పెడుతుంది. ఈలోపు కళ్యాణ్, అప్పూకి కూడా కాల్ చేసి రమ్మంటాడు. నెక్ట్స్ కావ్య తన అత్తింటి వెళ్లేందుకు ఆటో కోసం రోడ్డు మీద నిల్చుంటుంది. ఈలోపు రౌడీలు వస్తారు. కావ్యపై కామెంట్స్ చేస్తారు. అబ్బా ఎవర్రా ఈ మేడమ్.. భలే అందంగా ఉంది. సినిమా హీరోయినా లేక సీరియల్ హీరోయినా అంటూ కామెంట్స్ చేస్తారు. కావ్య వాళ్ల వైపు కోపంగా చూస్తూ మౌనంగా ఉంటుంది. ఆ అల్లరి మూక మీర ఆటపట్టిస్తూ ఉండగా.. వాళ్లని కడిగిపారేద్దామనుకుంటుంది కావ్య. ఇంతలో అటుగా రాజ్ కారు రావడాన్ని కావ్య చూస్తుంది. దీంతో మౌనంగా ఉండి పోతుంది. రాజ్ కారులో వెళ్తూ కావ్యని, అల్లరి మూకను చూస్తాడు. అలా కొంచెం ముందుకు వెళ్లి కారు ఆపుతాడు. ఇంట్లో నా మీద నోరు వేసుకుని పడిపోతుంది.. వీళ్లు అలా కామెంట్స్ చేస్తున్నా దద్దిలా నిల్చుంది అంటాడు రాజ్. మరోవైపు కావ్య ఇప్పుడు ఈయన నా కోసం వీళ్లతో గొడవ పడతారో లేదో చూద్దాం.. నన్ను భార్యగా ఒప్పుకుంటారో అని ఆలోచిస్తూ ఉంటుంది. దీంతో ఇదే ఛాన్స్ కదా అని ఆ రౌడీ గ్యాంగ్ కావ్య చుట్టూ చేరి.. ఆటపట్టిస్తూ ఉంటారు. దీంతో రాజ్ ఎంట్రీ ఇచ్చి.. రౌడీలను ఉతికి పారేస్తాడు. ఇంక కావ్య వైపు చూడగా.. కావ్య సైలెంట్ గా కారు ఎక్కుతుంది.
ఆ తర్వాత కళ్యాణ్, అప్పులు కలసి అనామికను కలవడానికి బైక్ పై వెళ్తారు. ఫోన్ నెంబర్ తెలిసింది కదరా భయ్.. మరి గీ గిఫ్ట్ ల కోసం పోవడం ఏంటి? ఫోన్ నెంబర్ బట్టి అడ్రస్ ఎట్లా తెలుసుకోవాలో నీకు తెలుసు కదా అని అప్పు అంటుంది. డైరెక్ట్ గా తనే ఎదురుబడి గిఫ్ట్ ఇస్తానంటే.. మళ్లీ అడ్రస్ ఎందుకు బ్రో అని అంటాడు కళ్యాణ్. ఏదో ఒకటి ఏడు పాగల్ అని అప్పు తిడుతుంది. ఈలోపు బండి ఆగిపోతుంది. బండి ఎందుకు ఆపినావ్ ఏంది? అని అప్పు అడుగుతుంది. నిజం చెప్తే నువ్వు కూడా ఏడుస్తావ్ అని అంటాడు కళ్యాణ్. ఏంటి అని అప్పు అని అడిగితే.. నాకు బైక్ దుకాణం పెట్టిందని కళ్యాణ్ అంటాడు. సరిపోయింది అయితే ఇక నువ్వు పోయినట్టే అని అప్పు అటుంది. అలా అయితే ఎలా అని కంగారు పడిపోతూ ఉంటాడు.
ఈ సీన్ కట్ చేస్తే.. కారులో కావ్య, కళ్యాణ్ లు వెళ్తూ ఉంటారు. రాజ్ వైపు చూస్తూ.. నా మీద ప్రేమ ఉంది కానీ బయటకు చూపించరు అని మనసులో అనుకుంటుంది. మీరు ఏమీ అనుకోకపోతే నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను.. ఆన్సర్ చెబుతారా అని రాజ్ ని అడుగుతంది. రాజ్ మౌనంగా తల పక్కకి తిప్పుకుంటాడు. మీరు ముఖం తిప్పుకున్నా.. స్టీరింగ్ తిప్పుకున్నా అనే అడిగేది అడుగుతా అంటుంది కావ్య. అసలు నన్ను భార్యగానే అంగీకరించను అన్నారు కదా.. మరి వాళ్లను ఎందుకు కొట్టారు అని కావ్య అడగ్గా.. రాజ్ పొలమారుతాడు. దీంతో కావ్య మంచినీళ్లు ఇస్తుంది. నన్ను కామెంట్స్ చేస్తే మీకెందుకు కోపం వచ్చిందని మళ్లీ అడగ్గా.. ఫోన్ తీసుకుని ఎవరితోనే మాట్లాడుతున్నట్లుగా కావ్యకి ఆన్సర్ ఇస్తాడు. దీంతో కావ్య అర్థమైంది.. నా మీద ఉన్న ప్రేమను ఎలాగోలా బయటకు తీసుకొస్తాను అనుకుంటుంది.
ఇక ఆ తర్వాత అనామిక ఇచ్చిన టైమ్ అయిపోతూ ఉండటంతో కళ్యాణ్ కంగారు పడుతుంది. బ్రో బండి స్టార్ట్ కావడం లేదు ఏం చేద్దాం అంటాడు.. ఈ బండి పక్కకు పెట్టి.. లిఫ్ట్ అడిగి వెళ్దాం అంటాడు అప్పు. వెనుక నుంచి వచ్చిన కారును ఆపుతాడు. అందులో ఆనామిక ఉంటుంది.. ట్యాక్సీ కావాలా సర్ అని అడుగుతుంది. ఈలోపు అప్పు కవి.. కవి అంటూ పిలుస్తుంది. కళ్యాణ్.. అప్పూని పట్టించుకోకుండా కారు ఎక్కి వెళ్లిపోతూ ఉంటాడు. ఇక కళ్యాణ్ కంగారు చూసి.. ఆటపట్టిస్తుంది అనామిక. ఆఫీసుకు లేట్ అవుతుందా.. ఇంటర్వ్యూకి వెళ్లాలా? గర్ల ఫ్రెండ్ దగ్గరికా అంటూ అడుగుతుంది. లేదు ఒక రాక్షసి.. అభిమాని రాక్షసి కలవాలని చెప్తాడు కళ్యాణ్. దీంతో అనామిక మండిపడుతుంది. ఏమైంది తనని తిడుతుంటే.. మీకెందుకు కోపం వచ్చింది? అని అడుగుతాడు కళ్యాణ్. అంత కసి, కోపం ఉన్నప్పుడు కలవడానికి ఎందుకు వెళ్తున్నారు? అని అనామిక అడగ్గా.. కలవకుండా నన్ను ఉరుకులు.. పరుగులు పెట్టిస్తోంది అందుకే.. ఇవాళ ఎదురుపడి గిఫ్ట్ ఇస్తా అంది వెళ్తున్నా అని సమాధానం చెప్తాడు కళ్యాణ్.
ఇక దుగ్గిరాల ఫ్యామిలీలో లేడీస్ అందరికీ వార్నింగ్ ఇస్తుంది అపర్ణ. ఆ మట్టి మనిషి వచ్చే టైమ్ అయింది.. ఎవరూ మాట్లాడటానికి వీల్లేదు అని చెప్తుంది. నా సొంత చెల్లెలు అయినా సరే నేను కూడా మాట్లాడను అని స్వప్న అనగా.. ఏనాడైనా సొంత చెల్లెలా చూస్తేనే కదా.. ఇవాళ చూడ్డానికి..అని ధాన్య లక్ష్మి అంటుంది. ఎవ్వరైనా సరే పలకరించినా.. పలకొద్దు అంటూ చెప్తుంది అపర్ణ. మాకు కావాల్సింది అదే.. కావ్యని పర్మినెంట్ గా ఇంట్లో నుంచి గెంటేసే రోజు కోసం ఎదురు చూస్తున్నా అని రుద్రాణి మనసులో అనుకుంటుంది. ఇంతలో కావ్య, రాజ్ లు ఇద్దరూ కలిసి వస్తారు. ఇంది చూసిన ఇందిరా దేవి, ధాన్య లక్ష్మి సంతోషిస్తారు. ఇక కావ్య కారులో నుంచి దిగుతూ కావాలనే హ్యాండ్ బ్యాగ్ ను వదిలేస్తుంది. అది చూసిన రాజ్ కావ్యని పిలవలేక.. హ్యాండ్ బ్యాగ్ ను తీసుకొని లోపలికి వస్తాడు. అది చూసిన అపర్ణ షాక్ అవుతంది. ఈలోపు రుద్రాణి.. నీకొడుకు నా మాట వింటాడు అన్నావు కదా.. ఇప్పుడేమైంది అని అపర్ణ చెవిలో గుసగుసలాడుతుంది. దీనికి నా కొడుకు సంగతి నాకు బాగా తెలుసు అంటుంది అపర్ణ. ఇంట్లోని వాళ్లను చూసిన రాజ్.. పని మనిషిని పిలిచి కావ్య హ్యాండ్ బ్యాగ్ ఇస్తాడు. ఆ తర్వాత వాళ్లిద్దరూ గదిలోకి వెళ్తారు.
ఇక అనామిక.. కళ్యాణ్ ను రెస్టారెంట్ దగ్గర దింపుతుంది. వెంటనే కళ్యాణ్ దిగి లోపలికి వెళ్తాడు. అప్పుడు ఒక లేడీ బ్యాగ్ తో బ్లూ కలర్ సారీలో కళ్యాణ్ దగ్గరికి వస్తుంది. ఆమెను చూసిన కళ్యాణ్ సంతోష పడతాడు. ఇదంతా అనామిక రెస్టారెంట్ బయట నుంచి చూస్తూ ఉంటుంది. మీ లెటర్స్ భలే ఫన్నీగా ఉంటాయండి. ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నట్టే ఉంటాయి. అసలు.. అంటూ కళ్యాణ్ ఏదో చెప్పబోతుంటే.. ఆ లేడీ మనం మాట్లాడుకునే టైమ్ లేదు.. ఆయన చూస్తే బాగోదు అని అంటుంది. ఆయన ఎవరు? అని కళ్యాణ్ అడగ్గా.. మా ఆయన అని చెప్తుంది. దీంతో కళ్యాణ్ షాక్ అవుతాడు. మీకు పెళ్లి అయిందా? అని అడగ్గా.. మీ అభిమానికి పెళ్లి కాకూడదా.. అని అడుగుతంది. సరే ఇక నేను వెళ్తాను అని కళ్యాణ్ అంటాడు. ఉండండి మీకు గిఫ్ట్ తెచ్చాను తీసుకోండి అని చెప్పగా.. వద్దండి మీ ఆయనకు ఇవ్వండి అని కళ్యాణ్ అంటాడు. ఇలా వీరి మధ్య సరదా సంభాషణ జరుగుతుంది. ఇక ఆ లేడీ దగ్గర గిఫ్ట్ తీసుకుని బయటకు వస్తాడు కళ్యాణ్. ఇదంతా చూసిన అనామిక బాగా నవ్వుకుంటుంది. పెళ్లి అయిందని బాగా ఫీల్ అయ్యాడే అని.. ఆ అమ్మాయి అంటే.. అవునా అని నవ్వుతుంది అనామిక.
ఈ సీన్ కట్ చేయగా.. దుగ్గిరాల ఫ్యామిలీలో అందరూ నిశ్శబ్ధంగా ఉంటారు. కావ్య ఏమో కంగారు పడుతూ.. ఈరోజు అమ్మమ్మగారికి టీ ఇవ్వడం లేట్ అయిపోయింది అనుకుంటుంది. ఆ తర్వాత టీ వేసి.. ధాన్య లక్ష్మి దగ్గరకు వెళ్లగా.. ధాన్య లక్ష్మి ఫోన్ మాట్లాడినట్టు నటిస్తూంది. ఆ తర్వాత ఇందిరా దేవి దగ్గరకు వెళ్తుంది కావ్య. ఆవిడ టీ తీసుకునే లోపు.. అపర్ణ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. అప్పుడే పై నుంచి దిగి వస్తుంది అపర్ణ. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్లీ రేపటి ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.