AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss: మళ్లీ చిక్కుల్లో బిగ్‌బాస్.. రంగంలోకి మహిళా కమిషన్.. అసలేం జరిగిందంటే?

ప్రస్తుతం 'బిగ్ బాస్' సీజన్ నడుస్తోంది. ఇప్పటికే మలయాళంలో ఈ రియాలిటీ షో కంప్లీట్ కాగా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో ఇంకా రన్ అవుతోంది. అయితే బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తోన్న ఈ సెలబ్రిటీ రియాలిటీ షోలు వరుసగా వివాదాలను కూడా ఎదుర్కొంటున్నాయి.

Bigg Boss: మళ్లీ చిక్కుల్లో బిగ్‌బాస్.. రంగంలోకి మహిళా కమిషన్.. అసలేం జరిగిందంటే?
Bigg Boss Reality Show
Basha Shek
|

Updated on: Nov 19, 2025 | 6:45 AM

Share

బిగ్ బాస్ రియాలిటీ షోలు బుల్లితెర ప్రేక్షకులకు బాగానే ఎంటర్ టైన్మెంట్ అందిస్తున్నాయి. అదే సమయంలో వివాదాలు కూడా ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా బిగ్ బాస్ కన్నడ షో ఈసారి వరుస వివాదాల్లో ఎదుర్కొంటోంది. షో వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందంటూ ఆ మధ్యన కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు (KSPCB) బిగ్ బాస్ నిర్వాహకులను నోటీసులు జారీ చేసింది. వెంటనే రియాలిటీ షో ను నిలిపివేయాలంటూ ఆదేశాలిచ్చింది. అయితే ఎలాగోలా ఈ వివాదం సమసిపోయింది. అయితే ఇప్పుడు ఈ రియాటీషో మరో వివాదంలో చిక్కుకుంది. ‘బిగ్ బాస్ కన్నడ సీజన్ 12’ పోటీదారు గిల్లిపై ప్రముఖ ఆర్టిస్ట్ హెచ్.సి. కుషాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుషాల దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా, మహిళా కమిషన్ బెంగళూరు పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసింది. దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

గిల్లి నట బిగ్ బాస్ ఇంట్లో అమ్మాయిలను వేధిస్తున్నారని ఆర్టిస్ట్ కుషాల ఆరోపించారు. అందుకే ఆమె మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా మహిళా కమిషన్ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ లేఖ రాశారు. తన ఫిర్యాదు గురించి మీడియాకు వివరించారు కుషాల. గిల్లి అమ్మాయిలను హింసించడానికి బిగ్ బాస్ షోకు వచ్చాడని ఆమె ఆరోపించారు.

‘గిల్లి ఒక కమెడియన్. కానీ అతనికి కామెడీ అంటే ఏమిటో తెలియదు? అతను చేసే పనికి మీరు నవ్వితే, మీరు కొంచెం రిలాక్స్ అవ్వాలి. కానీ బిగ్ బాస్ షోలో అలా కాదు. అమ్మాయిలను హింసించడానికి గిల్లి బిగ్ బాస్ షోకు వచ్చాడు. ఇందుకోసమే అతనికి లక్షలు తీసుకుని మరీ రియాలిటీ షోకు రప్పించారు’ అని కుషాల ఆరోపించారు. ఇది గిల్లి గురించి మాత్రమే కాదు. అమ్మాయిలను ఎగతాళి చేయడానికి ఈ రియాలిటీ షో ఉన్నట్లుంది. అశ్విని గౌడ మాట్లాడటం చూస్తే అమ్మాయిలకు స్ఫూర్తి దాయకంగా ఉంది. కానీ గిల్లి ఏ సందేశం ఇస్తున్నారు? అతనిని ఎందుకు హౌస్ లోకి తీసుకున్నారు?’ అని కుశల ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

‘ఇలా జరిగిన ప్రతిసారీ సుదీప్ క్షమాపణలు చెబుతాడు. బయట చాలా ఇబ్బంది పడే అశ్విని గౌడ బిగ్ బాస్ హౌస్‌లో ఎందుకు కూర్చుంటుందో తెలుసా? అశ్వినికి బిగ్ బాస్ షో పట్ల, హోస్ట్ సుదీప్ పట్ల చాలా గౌరవం ఉంది. లేకపోతే ఆమెకు బిగ్ బాస్ షో నుంచి ఎప్పుడో బయటకు వచ్చేది’ అని కుశల ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..