
బిగ్ బాస్ లో ఛాన్స్ కావాలంటూ ఏకంగా అన్న పూర్ణ స్టూడియో ముందు నిరాహార దీక్ష చేశాడు ఖాతోజ్ రామాచారి అలియాస్ మల్టీస్టార్ మన్మధరాజా. అంతకు ముందు థియేటర్ల ముందు మూవీ రివ్యూలు చెబుతూ.. మినిమమ్ డిగ్రీ ఉండాలి అనే డైలాగ్ తో పాపులర్ తో ఒక్క సారిగా ఫేమస్ అయ్యాడితను. ఈ క్రమంలోనే బిగ్ బాస్ లో ఛాన్స్ కోసం ఎవరిని అడగాలి అనేది తనకు తెలియదంటూ అన్నపూర్ణ స్టూడియో ముందు నిరాహార దీక్ష కు దిగాడు. ఇలాగైనా తన గురించి నాగార్జున సార్ కి తెలుస్తుందంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాడు. అతను కోరుకున్నట్లు గానే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో రామాచారికి ఛాన్స్ వచ్చింది. కానీ దానిని అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. జడ్జీలను విసిగించి చిరాకు తెప్పించాడు. ఫలితంగా అతనికి బిగ్ బాస్ షో నుంచి గేట్ పాస్ ఇచ్చేశారు.
బిగ్ బాస్ అగ్ని పరీక్షలో వేదికపైకి రాగానే ఓవరాక్షన్ చేశాడు రామాచారి. శ్రీముఖి కాళ్లపై పడి బిగ్ బాస్ లో ఒక్క ఛాన్స్ ఇవ్వండి మేడం అంటూ వేడుకున్నాడు. ఆ తర్వాత తన కష్టాలన్న జడ్జీల ముందు ఏకరువు పెట్టాడు. తాను నల్గొండ జిల్లాకి చెందిన వాడిని అని.. అమ్మా నాన్న ఎవరూ లేరు, ఆస్తులు కూడా లేవు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనకి పెళ్లి చేసే వాళ్లు కూడా లేరని సింపతీ పొందే ప్రయత్నం చేశాడు. దీంతో జడ్జీలకు చిర్రెత్తుకొచ్చింది. ఇప్పుడు నీ ఏడుపు పెళ్లి కాలేదనా? లేక మేము ఏమైనా నీకు పెళ్లి చేయాలా ఏంటి అంటూ నవదీప్, బిందుమాధవి మన్మధరాజాపై సెటైర్లు వేశారు. అసలు తన ట్యాలెంట్ ఏంటో చెప్పకుండా షో మొత్తం ఏడుస్తూ ఉండడంతో రామాచారి బిహేవియర్ జడ్జీలకు ఏ మాత్రంనచ్చలేదు. దీంతో ‘మీరు బిగ్ బాస్ కు సూట్ అవ్వరు బాస్’ అంటూ నవదీప్, బింధు మాధవి, అభిజిత్ రామాజారికి రెడ్ ఫ్లాగ్ చూపించారు. దీనితో అతను ఏడ్చుకుంటూ బయటకి వెళ్ళిపోయాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.