AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Season 8 Telugu: బిగ్‏బాస్ సీజన్ 8కు సర్వం సిద్ధం.. కంటెస్టెంట్స్ రెడీ.. ఎప్పుడు స్టార్ట్ కానుందంటే..

బిగ్‏బాస్ కంటెస్టెంట్స్‌కు విపరీతమైన అభిమానులు ఉంటారు. గతంలో ఒకరి ఫ్యాన్స్ ఒకరిపై దాడికి పాల్పడిన సందర్భాలు ఉన్నాయి. అలాగే బిగ్‏బాస్ విజేతపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు బిగ్‏బాస్ సీజన్ 8 రాబోతుంది.

Bigg Boss Season 8 Telugu: బిగ్‏బాస్ సీజన్ 8కు సర్వం సిద్ధం.. కంటెస్టెంట్స్ రెడీ.. ఎప్పుడు స్టార్ట్ కానుందంటే..
Bigg Boss Telugu Season 8
Rajitha Chanti
|

Updated on: Jul 04, 2024 | 4:04 PM

Share

బుల్లితెరపై అత్యంత క్రేజ్ ఉన్న రియాల్టీ షో బిగ్‏బాస్. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ ఈ షో విజయవంతంగా రన్ అవుతుంది. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషలలో ఈ షోకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. దాదాపు మూడు నెలలపాటు నడిచే ఈ రియాల్టీ షో గురించి నిత్యం ఏదోక న్యూస్ నెట్టింట వైరలవుతుంటుంది. ఇక ఇందులోకి ఎంటరయ్యే పోటీదారుల గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. హిందీలో ప్రస్తుతం బిగ్‏బాస్ ఓటీటీ సీజన్ 3 నడుస్తుండగా.. త్వరలోనే తెలుగులో సీజన్ 8 స్టార్ట్ కానుంది.

బిగ్‏బాస్ కంటెస్టెంట్స్‌కు విపరీతమైన అభిమానులు ఉంటారు. గతంలో ఒకరి ఫ్యాన్స్ ఒకరిపై దాడికి పాల్పడిన సందర్భాలు ఉన్నాయి. అలాగే బిగ్‏బాస్ విజేతపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు బిగ్‏బాస్ సీజన్ 8 రాబోతుంది. ఈసారి ఈ షోను కాస్త ముందుగానే ప్రారంభించేందుకు రెడీ అయ్యారు మేకర్స్. తాజా సమాచారం ప్రకారం ఆగస్ట్ 4న బిగ్‏బాస్ సీజన్8 స్టార్ట్ కానుందని తెలుస్తోంది. అలాగే ఈసారి షోలో అడుగుపెట్టే కంటెస్టెంట్స్ కూడా ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.

కుమారి ఆంటీతోపాటు సోషల్ మీడియాలో ఫేమస్ అయిన బర్రెలక్క, అమృత ప్రణయ్, అలాగే యూట్యూబర్ నేత్ర, మోటివేషనల్ స్పికర్ వంశీ బిగ్‏బాస్ హౌస్ లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే బుల్లితెరపై సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన నటీనటులు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. బ్రహ్మమూడి ఫేమ్ కావ్య కూడా ఈ సారి హౌస్ లోకి రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్