Bigg Boss Telugu 9: రాము రాథోడ్ ఫ్యామిలీని చూశారా? ఇంట్రెస్టింగ్ వీడియోను రిలీజ్ చేసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు రాము రాథోడ్. గేమ్ బాగా ఆడుతున్నప్పటికీ, ఓటింగులోనూ సత్తా చూపుతున్నప్పటికీ హోమ్ సిక్ కారణంగా స్వచ్ఛందంగా బయటకు వచ్చేశాడీ ఫోక్ సింగర్. తాజాగా తన ఫ్యామిలీతో కలిసి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేశాడు రాము రాథోడ్.

బిగ్ బాస్ కు రాకముందే ఫోక్ సింగర్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు రాము రాథోడ్. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్ లోకి వచ్చాక అతని క్రేజ్ మరింత పెరిగింది. అతని ఆట, మాట తీరుకు చాలా మంది అభిమానులయ్యారు. ముఖ్యంగా కొన్ని సీరియస్ సిచ్యువేషన్లలోనూ రాము రాథోడ్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్, వ్యవహరించిన తీరు బిగ్ బాస్ ఆడియెన్స్ కు నవ్వు తెప్పించాయి. బిగ్ బాస్ హౌస్ లో సుమారు 60 రోజుల పాటు ఉన్నాడీ ఫోక్ సింగర్. అయితే కుటుంబ సభ్యులు ఎక్కువగా గుర్తుకొస్తున్నారంటూ స్వచ్ఛందంగా షో నుంచి బయటకు వచ్చేశాడు. హౌస్ లో చాలా రోజులు ఉంటాడనుకున్న రాము రాథోడ్ అనూహ్యంగా సెల్ఫీ ఎలిమినేట్ కావడం అతని అభిమానులను నిరాశపర్చింది. అదే సమయంలో తన నిర్ణయానికి చెప్పిన రీజన్ మాత్రం చాలా కన్విన్సింగ్ గా ఉందంటూ మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా హౌస్ నుంచి బయటకు వచ్చేటప్పుడే తనకు మద్దతిచ్చిన అభిమానులందరికీ క్షమాపణలు చెప్పాడు. ఇప్పుడు మరోసారి తన ఫ్యాన్స్ కు క్షమాపణలు చెబుతూ ఒక ఆసక్తికర వీడియోను పంచుకున్నాడు.
‘నన్ను ఎంతగానో ఆదరించిన ప్రేక్షకుల దేవుళ్లు అందరూ క్షమించండి. ఇదే నా కుటుంబం. వీళ్లందరినీ వదిలేసి తొలిసారిగా అన్నిరోజుల పాటు బయటే ఉన్నాను. దీంతో ఇబ్బంది పడ్డాను. కానీ, కేవలం మీ ప్రేమాభిమానాల వల్ల మాత్రమే బిగ్‌బాస్‌లో కొంతకాలమైనా ఉండగలిగాను. ముఖ్యంగా మా అమ్మ, పిల్లలు గుర్తుకు రావడంతో బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చేశాను. నా చిన్నతనం నుంచి నేను ఎవరితోనూ గొడవలు పెట్టుకోలేదు. అయితే కేవలం బిగ్‌బాస్ కోసం అక్కడ వాళ్లతో గొడవలు పడడం కూడా నాకు నచ్చలేదు. నా మనసుకు విరుద్ధంగా నేను ఉండలేను. అందుకే హౌస్‌లో ఉండలేకపోయాను.’
కుటుంబ సభ్యులతో రాము రాథోడ్..
View this post on Instagram
‘అయితే హౌస్ లో తనూజ మాత్రం చాలాసార్లు నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చింది. చివరకు వెళ్లేటప్పుడు కూడా ప్రేక్షకుల నిర్ణయం వరకు ఉండాలని కోరింది. బిగ్ బాస్ హౌస్‌లోని వారందరూ నాకు చాలా ధైర్యం ఇచ్చారు. కానీ ఎందుకో అక్కడ ఉండటం నాకు ఇబ్బందిగా అనిపించింది. నా నిర్ణయాన్ని ప్రేక్షకులు గౌరవిస్తారని ఆశిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు రాము.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








