AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: కొత్త ఆధ్యాయం మొదలైంది.. ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్ చెప్పిన సమంత.. వీడియో వైరల్

ఈ మధ్యన సినిమాల కంటే ఇతర విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది స్టార్ హీరోయిన్ సమంత. ముఖ్యంగా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమోరుతో సామ్ ప్రేమలో ఉందని వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ ప్రచారం కొనసాగుతుండగానే సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టింది సామ్.

Samantha: కొత్త ఆధ్యాయం మొదలైంది.. ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్ చెప్పిన సమంత.. వీడియో వైరల్
Samantha
Basha Shek
|

Updated on: Nov 12, 2025 | 6:45 AM

Share

అనారోగ్యం ఇతర కారణాలతో సినిమాలకు గ్యాప్ ఇచ్చేసిన సమంత మళ్లీ ప్రొఫెషనల్ గా బిజీ అవుతోంది. వరుసగా సినిమాలకు సైన్ చేస్తోంది. అలాగే నిర్మాతగానూ బిజీ అవుతోంది. తన ప్రొడక్షన్ బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చ‌ర్స్ పై ప్రొడ‌క్ష‌న్ నెం.2గా ‘మా ఇంటి బంగారం’ను నిర్మిస్తోంది సామ్. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సినిమాలో స‌మంత‌, దిగంత్‌, గుల్ష‌న్ దేవ‌య్య త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సీనియ‌ర్ న‌టి గౌత‌మి, మంజుషా కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రానికి స‌మంత‌, రాజ్ నిడుమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మాత‌లుగా వ్యవహరించనున్నారు దీంతో పాటు బాలీవుడ్ లో రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లో సామ్ యాక్ట్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఓవైపు సినిమాలు చేస్తూన మరోవైపు బిజినెస్ రంగంలోనూ తన ట్యాలెంట్ చూపిస్తోందీ స్టార్ హీరోయిన్. ఇప్పటికే సాకీ అనే పేరుతో క్లాతింగ్ బిజినెస్ ను రన్ చేస్తోంది సామ్. అలాగే ఇటీవల పెర్ఫ్యూమ్ బిజినెస్ ని కూడా స్టార్ట్ చేసింది. అయితే దీని గురించి మాట్లాడుకుంటుండగానే మరో బిజినెస్ ప్రారంభించిందీ సామ్.

తాజాగా ట్రూలీ. స్మా (Truly. Sma) అనే పేరుతో మరో క్లాతింగ్ బిజినెస్ ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియోని ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. దీనికి ‘న్యూ చాప్టర్ బిగిన్స్’ అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సామ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

సమంత షేర్ చేసిన వీడియో ఇదిగో..

సమంత లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టెస్ట్ బ్యాటర్‌గా స్టాంప్.. 8 సిక్సర్లు, 13 ఫోర్లతో బీభత్సం
టెస్ట్ బ్యాటర్‌గా స్టాంప్.. 8 సిక్సర్లు, 13 ఫోర్లతో బీభత్సం
తక్కువ ధరలో సన్‌రూఫ్‌తో వచ్చే టాప్‌ 4 కార్లు ఇవే!
తక్కువ ధరలో సన్‌రూఫ్‌తో వచ్చే టాప్‌ 4 కార్లు ఇవే!
ఉదయం పూట ఈ వ్యక్తులు టీ తాగితే బాడీ షెడ్డుకే.. అసలు విషయం..
ఉదయం పూట ఈ వ్యక్తులు టీ తాగితే బాడీ షెడ్డుకే.. అసలు విషయం..
2026లో మారుతి సుజుకి బిగ్ బ్యాంగ్..కొత్త అప్‌డేట్స్‌తో 4 కార్లు!
2026లో మారుతి సుజుకి బిగ్ బ్యాంగ్..కొత్త అప్‌డేట్స్‌తో 4 కార్లు!
శీతాకాలంలో మాత్రమే లభించే టర్నిప్ కూరగాయ గురించి తెలుసా? లాభాలు
శీతాకాలంలో మాత్రమే లభించే టర్నిప్ కూరగాయ గురించి తెలుసా? లాభాలు
కొత్త జీతం ఎలా నిర్ణయిస్తారు..? 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం..
కొత్త జీతం ఎలా నిర్ణయిస్తారు..? 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం..
మరోవారంలో MAT 2025 రాత పరీక్ష.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్
మరోవారంలో MAT 2025 రాత పరీక్ష.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్
SBIలో తక్కువ వడ్డీకే లోన్లు.. నేటి నుంచే ప్రారంభం!
SBIలో తక్కువ వడ్డీకే లోన్లు.. నేటి నుంచే ప్రారంభం!
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం ధరలు.. వెండి రికార్డ్
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం ధరలు.. వెండి రికార్డ్
RBI సమ్మర్ ఇంటర్న్‌షిప్‌కు 2026 దరఖాస్తు చేశారా? చివరి ఛాన్స్ ఇదే
RBI సమ్మర్ ఇంటర్న్‌షిప్‌కు 2026 దరఖాస్తు చేశారా? చివరి ఛాన్స్ ఇదే