Bigg Boss 9 Telugu : ఇంత సపోర్టివ్ ఏంటన్నా నువ్వు.. ఓడించిన వాళ్ల మనసులనే గెలిచిన సుమన్ శెట్టి..
సుమన్ శెట్టి.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. అధ్యక్షా.. అంటూ ఒకప్పుడు తెలుగు అడియన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. జయం, ధైర్యం, 7/G బృందావన్ కాలనీ వంటి చిత్రాల్లో నటించి తనదైన కామెడీ టైమింగ్, నటనతో మెప్పించాడు. ఒకప్పుడు వరుసగా సినిమాల్లో నటించిన సుమన్ శెట్టి.. ఆ తర్వాత ఇతర భాషలలో బిజీగా ఉండడంతో తెలుగులో అంతగా నటించలేదు. ఇప్పుడు బిగ్ బాస్ షో ద్వారా మరోసారి జనాల ముందుకు వచ్చారు.

బిగ్ బాస్ సీజన్ 9.. ఇప్పుడు పదవ వారం నడుస్తుంది. అయితే మొదటి నుంచి జెన్యూన్ ప్లేయర్ గా.. తన మాట తీరు, ఆట తీరుతో జనాల మనసులు గెలుచుకుంటున్న కంటెస్టెంట్ సుమన్ శెట్టి. ఇప్పుడు అతడే చాలా మంది ఫేవరెట్ కూడా. ఒకప్పుడు తెలుగులో అనేక సినిమాల్లో కామెడీ పాత్రలు పోషించి నవ్వించిన సుమన్ శెట్టి.. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లో టాప్ 5 కంటెస్టెంట్ గా దూసుకుపోతున్నారు. అతడు గేమ్ ఆడే తీరు.. మాట్లాడే విధానం.. ప్రతి పరిస్థితిలో ప్రవర్తించే తీరు అన్నీ జనాలకు తెగ నచ్చేస్తున్నాయి. అందుకే రోజు రోజుకు సుమన్ శెట్టికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ తో మరో మెట్టు ఎక్కేసాడు సుమన్ శెట్టి. నిజానికి బిగ్ బాస్ ఆటలో తొండాట ఎక్కువగా ఉంటుంది. తాము గెలిచేందుకు.. లేదా తమకు నచ్చిన కంటెస్టెంట్ గెలిచేందుకు ఇతరులను ఈజీగా ఓడించేస్తారు. అదే విషయాన్ని గంటలు గంటలు సాగదీస్తు నానా రచ్చ చేస్తుంటారు.
కానీ సుమన్ శెట్టి మాత్రం తనకు అన్యాయం జరిగినప్పటికీ అంతగా పట్టించుకోకుండా అందరితో కలిసిపోతున్నాడు. టాస్కు జరిగిన తర్వాత అక్కడ జరిగిన వాదన.. లేదా ఇతరుల ప్రవర్తన గురించి అసలు మాట్లాడడం లేదు. ఎక్కడ గొడవ జరిగినా అదే విషయాన్ని అక్కడే వదిలేసి సరదాగా ఉంటున్నాడు. నిన్నటి టాస్కులో సంజనతో పోటీపడి మరీ టవర్ టాస్కులో అదరగొట్టాడు. అంతేకాదు.. సంజన కంటే ఒక బ్రిక్ ఎక్కువగా పెట్టాడు. ఆ తర్వాతే సంజన పెట్టింది. కానీ సంజన కంటే సుమన్ హైట్ తక్కువగా ఉండడంతో టవర్ క్లారిటీగా నిర్మించలేకపోయాడు. ఇక ఇదే విషయాన్ని చెబుతూ సంచాలక్ కళ్యాణ్ మాట్లాడుతూ సంజన గెలిచిందని చెప్పాడు. అప్పటికే సుమన్ మాట్లాడుతూ టవర్ నేను ముందుగా పెట్టాను అంటూ తనసైడ్ వివరణ ఇచ్చాడు. ఆ సమయంలో కళ్యాణ్ నిర్ణయాన్ని తనూజ, దివ్య తప్పుబట్టారు. దీంతో ఇద్దరితో కళ్యాణ్ కు గొడవ జరిగింది.

Bigg Boss 9 Telugu Updates
టాస్కు పూర్తైన తర్వాత రాత్రి కళ్యాణ్ ఒంటరిగా డల్ గా కూర్చోవడంతో దగ్గరికి వెళ్లాడు సుమన్ శెట్టి. ఎందుకు అలా ఉన్నావ్ ? అంటూ ప్రశ్నించాడు. దీంతో కళ్యాణ్ మళ్లీ టాస్కు గురించి మాట్లాడడంతో.. సుమన్ శెట్టి రియాక్ట్ అవుతూ.. వదిలేయ్ కళ్యాణ్.. అక్కడితో అయిపోయింది.. దాన్ని ఎందుకు మళ్లీ క్యారీ చేయడం.. ఆర్గ్యుమెంట్స్ చేయడం.. అదే విషయం గురించి ఆలోచించడం.. నేనే వదిలేశాను కదా అంటూ కళ్యామ్ కు సర్ది చెప్పాడు. మాములుగా టాస్కులో అన్యాయం జరిగితే అదే విషయాన్ని ప్రతిసారి మాట్లాడుతూ.. నానా రచ్చ చేస్తుంటారు మిగతా కంటెస్టెంట్స్. కానీ సుమన్ శెట్టి మాత్రం కళ్యాణ్ తో మాట్లాడిన తీరు ఇప్పుడు జనాలను ఆకట్టుకుంటుంది. దీంతో సుమన్ శెట్టి మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Venky Movie: వెంకీ సినిమాను మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? రవితేజతో జోడి కట్టాల్సిన బ్యూటీ ఎవరంటే..




