Singer: ఈ బ్యూటిఫుల్ సింగర్ మనసూ అందమైనదే.. ఇప్పటివరకు 3800 మంది పేద పిల్లలకు ఉచిత హార్ట్ సర్జరీలు..
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న మాటను అక్షరాలా నిజం చేస్తోందీ స్టార్ సింగర్. తన తీయనైన పాటలతో సంగీతాభిమానులను ఉర్రూతలూగించే ఆమె తన సేవా గుణంతోనూ వేలాదిమంది పిల్లలు ప్రాణం పోస్తోంది. ఈ క్రమంలోనే ప్రతిష్ఠాత్మక గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుందీ స్టార్ సింగర్.

సినిమాలే కాదు సమాజసేవలోనూ పాలు పంచుకుంటోన్న హీరోలు, హీరోయిన్లు చాలా మందే ఉన్నారు మన ఇండస్ట్రీలో. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్.. ఇలా అన్ని ఇండస్ట్రీలోని నటులు తమ సంపాదనలో కొంత భాగాన్ని సామాజిక సేవకు ఉపయోగిస్తున్నారు. కొందరు అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఏర్పాటుచేస్తున్నారు. మరికొందరు పేద పిల్లలను ఉచితంగా చదివిపిస్తున్నారు. ఇంకొందరు బ్లడ్ బ్యాంకులు, ఐ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే స్టార్ సింగర్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. తన తీయనైన పాటలతో సంగీతాభిమానులను ఉర్రూతలూగించే ఆమె తన సేవా గుణంతోనూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. తన ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేద చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేస్తోంది. తద్వారా వారి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందాన్ని నింపుతుంది. అలా ఇప్పటివరకు సుమారు 3800 మంది పిల్లలకు ప్రాణం పోసిందీ స్టార్ సింగర్. తన సామాజిక సేవా కార్యక్రమాలతో ఇప్పటికే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న ఆమె తాజాగా మరో ఘనతను సొంతం చేసుకుంది. ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ తన పేరును లిఖించుకుంది.
పాలక్ ముచ్చల్.. తెలుగు ఆడియెన్స్ కు పెద్దగా ఈ పేరు తెలియకపోవచ్చు.. కానీ హిందీ సినిమాలు చూసే వారు మాత్రం ఇట్టే గుర్తు పడతారు. ‘మేరీ ఆషికి’, ‘కౌన్ తుఝే’, ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ వంటి పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకుందీ బ్యూటిఫుల్ సింగర్. అయితే తన పాటల కంటే తన సామాజిక సేవా కార్యక్రమాలతోనే బాగా ఫేమస్ అయ్యింది పాలక్. ఇప్పటి వరకు సుమారు 3,800 మందికి పైగా పేద పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించింది. గతంలో కార్గిల్ అమరవీరుల కుటుంబాలకు లక్షల రూపాయలు విరాళమిచ్చిన పాలక్ ముచ్చల్ గుజరాత్ భూకంప బాధితుల కోసం రూ. 10 లక్షలు విరాళంగా ఇచ్చింది.
హార్ట్ సర్జరీ చేయించుకున్న పిల్లలతో పాలక్ ముచ్చల్..
View this post on Instagram
కాగా పాలక్ ముచ్చల్ సేవా ప్రయాణంలో ఆమె భర్త, మ్యూజిక్ కంపోజర్ మిథూన్ కూడా తోడుగా నిలుస్తున్నాడు. తాజాగా తన సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకుందీ స్టార్ సింగర్. దీంతో సోషల్ మీడియాలో పాలక్ ముచ్చల్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








