AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss: మరో వివాదంలో బిగ్‌బాస్.. ‘ఎస్ కేటగిరీ’ అంటూ కంటెస్టెంట్ల మధ్య ‘కులం’ ప్రస్తావన.. ఫ్యాన్స్ ఆగ్రహం

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హోరా హోరీగా సాగుతోంది. పాత కంటెస్టెంట్స్ కు తోడు ఇప్పుడు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో హోస్ట్ నాగార్జున చెప్పినట్లు గానే హౌస్ ఇప్పుడు రణరంగంగా మారింది.

Bigg Boss: మరో వివాదంలో బిగ్‌బాస్.. 'ఎస్ కేటగిరీ' అంటూ కంటెస్టెంట్ల మధ్య 'కులం' ప్రస్తావన.. ఫ్యాన్స్ ఆగ్రహం
Bigg Boss Kannada 12
Basha Shek
|

Updated on: Oct 19, 2025 | 8:11 AM

Share

ప్రస్తుతం ‘బిగ్ బాస్’ సీజన్ నడుస్తోంది. బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోగా దీనికి పేరుంది. కొత్త సీజన్ ప్రారంభమైతే చాలు చాలా మంది ఈ బిగ్ బాస్ షో కోసమే టీవీలు, స్మార్ట్ ఫోన్స్ కు అతుక్కుపోతారు. ప్రస్తుతంతెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ రియాలిటీ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇక తెలుగులో అయితే సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే ఆరో వారం ఎండింగ్ కు చేరుకుంది. ప్రస్తుతం పాత, కొత్త కంటెస్టెంట్స్ తో తెలుగు బిగ్ బాస్ హౌస్ కళకళలాడుతోంది. ఇక ఈ ఆదివారం (అక్టోబర్19) మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నాడు. అయితే బుల్లితెర ఆడియెన్స్ కు వినోదం అందించే ఈ రియాలిటీ షోలు తరచూ వివాదాల్లోనూ నిలుస్తున్నాయి. ఇటీవల తెలుగు బిగ్ బాస్ ను రద్దు చేయాలని కొందరు ఫిర్యాదు కూడా చేసిన సంగతి తెలిసిందే. ఆ మధ్యన పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నారంటూ కన్నడ బిగ్ బాస్ హౌస్ ను మూసేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడీ కన్నడ బిగ్ బాస్ హౌస్ మరో వివాదంలో చిక్కుకుంది.

బిగ్ బాస్ కన్నడ సీజన్ 12  మంచి రేటింగ్‌తో దూసుకుపోతుంది. హీరో కిచ్చా సుదీప్ హోస్టింగ్ అదరగొడుతుతున్నాడు. అయితే ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ ఫ్యాన్స్ వీకెండ్ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. దీనికి కారణం కంటెస్టెంట్ల మధ్య కుల ప్రస్తావన రావడం. ప్రస్తుతం హౌస్ లో ఉన్న రక్షిత శెట్టిని తోటి కంటెస్టెట్స్ అశ్వినీ గౌడ, జాన్వీ నోటి కొచ్చినట్లు దూషించారు. ఇటీవల హౌస్ లో వీరి మధ్య పెద్ద గొడవ చోటు చేసుకుంది. నామినేషన్స్ గురించి చర్చించుకునేటప్పుడు అశ్వనీ, జాన్వీ రక్షిత కమ్యూనికేషన్ స్టైల్, కన్నడ భాషా నైపుణ్యం, డ్రెస్సింగ్ వంటి విషయాల్లో నీచమైన కామెంట్స్ చేశారు. ‘నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మాకు తెలుసు. నీ డ్రెస్ చూస్తేనే నువ్వు ఎలాంటిదానివో తెలుస్తుంది. నువ్వు ఎస్ కేటగిరీ. నీ డ్రామాలు బాత్‌రూమ్‌లోనే ఉండనివ్వు’ అంటూ రక్షితను అవమానించారు. దీంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అశ్వనీ, జాన్వీలను ఎలిమినేట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ వీకెండ్ ఎపిసోడ్ లో సుదీప్ వారికి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడోనని అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.