Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss: ‘బిగ్ బాస్ కప్పు కొట్టినా గొర్రెల కాపరిగానే కొనసాగుతా’.. సొంతూరులో రైతు బిడ్డకు ఘన స్వాగతం.. వీడియో

బిగ్ బాస్ టైటిల్ గెలిచినా తన మూలాలు మర్చిపోనంటున్నాడు రైతు బిడ్డ. ఎన్ని టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లో అవకాశం వచ్చినప్పటికీ టైమ్ దొరికికనప్పుడల్లా తన సొంతూరులో గొర్రెలు మేపడానికి వెళతానంటున్నాడు. మొత్తానికి తన మాటలు, చేతలతో అందరి మనసులు గెల్చుకుంటున్నాడు హనమంతు

Bigg Boss: 'బిగ్ బాస్ కప్పు కొట్టినా గొర్రెల కాపరిగానే కొనసాగుతా'.. సొంతూరులో రైతు బిడ్డకు ఘన స్వాగతం.. వీడియో
Bigg Boss Kannada 11 Winner Hanumanth Lamani
Follow us
Basha Shek

|

Updated on: Jan 31, 2025 | 8:31 PM

‘బిగ్ బాస్ కన్నడ సీజన్ 11’ విజేత హనుమంత 50 లక్షల రూపాయలు, కప్పుతో సొంతూరుకు చేరుకున్నాడు. సుమారు 100 రోజుల తర్వాత హవేరీలోని చిల్లురాబాద్‌కి చేరుకున్న అతనికి ఆ ఊరి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అందరి మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. గొర్రెలు మేపుతూనే పాటలు పాడుతూ బాగా ఫేమస్ అయిన హనుమంతు జీ ‘సరిగమప’ షోలో అవకాశం ఇచ్చింది. అక్కడి నుంచి అతని జీవితం మారిపోయింది. ఇప్పుడు అతను ఏకంగా బిగ్ బాస్ విజేతగా నిలిచాడు. ఈ రియాలిటీ షో పూర్తయిన తర్వాత తిరిగి స్వగ్రామానికి వచ్చిన ఈ రైతు బిడ్డ తాను గొర్రెల కాపరిగా కొనసాగుతున్నట్లు తెలిపారు. హనుమంతు ప్రస్తుతం ‘బాయ్స్ వర్సెస్ గర్ల్స్’ షోలో ఉన్నాడు. ఇందుకోసం తరచూ బెంగళూరుకు వెళ్లి వస్తున్నాడు. దీంతో పాటు పలు టీవీ షోస్, ఈవెంట్లలోనూ పాల్గొంటున్నాడు. వీటన్నిటికన్నా తన సొంతూరులోనే గొర్రెలు మేపుతూ జీవించడమే సంతోషాన్నిస్తుందంటున్నాడీ రైతు బిడ్డ. ‘నేను గొర్రెల కాపరిగానే కొనసాగుతాను. ప్రస్తుతం నాకు తోడుగా మా అన్నయ్య ఉన్నాడు. అయినా కూడా సమయం దొరికినప్పుడల్లా గొర్రెలను మేపేందుకు వెళతాను’ అని ఆనందంతో చెబుతున్నాడు హనుమంతు. ఈ ఆలోచన అతని అభిమానులను సంతోషపెట్టింది. సెలబ్రిటీ స్థాయికి ఎదిగినా హనుమంతు తన మూలాలు మరిచిపోలేదని పలువురు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

కాగా ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఉన్నప్పుడు హనుమంతరావుకు ‘బాయ్స్ వర్సెస్ గర్ల్స్’ షోలో అవకాశం వచ్చింది. శని, ఆదివారాల్లో ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ వారం షూటింగ్ ఇటీవలే జరిగింది. హవేరికి చెందిన హనుమంత.. మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చాడు. తన సొంతూరులోనే డిగ్రీ వరకు చదివాడు. ఇదే క్రమంలో సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మంచి గుర్తింపు పొందాడు. బిగ్ బాస్ హౌస్ లోనూ తన దైన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ ను అలరించాడు. సింప్లిసిటీతో అందరి మనసులు గెల్చుకున్నాడు. చివరకు ఏకంగా బిగ్ బాస్ టైటిల్ ను సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. తద్వారా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ విజేతగా నిలిచిన కంటెస్టెంట్ గా హనుమంతు గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇవి కూడా చదవండి

సొంతూరులో బిగ్ బాస్ విజేత హనుమంతు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.