సముద్ర తీరంలో అద్భుత దృశ్యం.. చూడనీకి రెండు కళ్లు చాలవే.. వీడియో
ఒడిశా సముద్ర తీరంలో ప్రకృతి దృశ్యం ఆవిష్కృతమవుతోంది. దాదాపు 7 లక్షల ఆలివ్ రిడ్లే తాబేళ్లు తమ వార్షిక సంతానోత్పత్తి కోసం బీచ్‌కు తరలివచ్చాయి. ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఏటా బీచ్‌కు రావడాన్ని అరిబాడా అని పిలుస్తారు. ఒడిశాలోని గహీర్‌మఠ బీచ్, రుషికుల్య తాబేళ్ల సంరక్షణ తీర ప్రాంతాలకు ఆలివ్ రిడ్లీ తాబేళ్లు సంతానోత్పత్తి కోసం సముద్రం నుంచి వస్తుంటాయి.
భారత దేశంలో అత్యధికంగా ఒడిశా తీరంలో ఈ రకం తాబేళ్లు కనిపిస్తాయి. అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రం నుంచి ఇవి 7వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకుంటాయన్నారు. ఇసుకను తవ్వి ఒక్కో తాబేలు 50 నుంచి 100 గుడ్లు పెడుతుంది. సుమారు 50 రోజుల్లో పిల్ల తాబేళ్లు బయటకు వస్తాయి. అందులో దాదాపుగా 30కి పైగా మాత్రమే జీవిస్తాయి. కొన్ని తీరంలోనే చనిపోతాయి. వీటి సంరక్షణకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది.నవంబరు నుంచి మార్చి నెలాఖరు వరకు తాబేళ్లు గుడ్లు పెట్టే సమయం. అందుకే అప్పుడు తీరంలో చేపల వేటను ప్రభుత్వం నిషేధించింది. ఇంకా మరో 3 లక్షల తాబేళ్లు రావచ్చు’ అని అధికారులు చెబుతున్నారు. అద్భుతమైన జీవ వైవిధ్య ప్రక్రియకు ఆలివ్ రిడ్లే తాబేళ్లు నిదర్శనంగా చెప్పవచ్చు.
మరిన్ని వీడియోల కోసం :
పంటి నొప్పితో ఆస్పత్రికొచ్చి ప్రాణాలు కోల్పోయింది.. డాక్టర్లు CT స్కాన్ చేయగా
మస్క్ కాళ్లను ట్రంప్ పట్టుకున్నట్టుగా వీడియో.. అమెరికా ప్రభుత్వ కార్యాలయంలో టెలికాస్ట్.. చివరకు..
అయ్యో.. ఆ బంగారు టాయిలెట్‌ను దొంగలు దోచుకెళ్లారు!వీడియో
పెళ్లికి తప్పతాగి వచ్చిన వరుడు.. ఏం చేశాడో చూస్తే షాకవుతారు!వీడియో

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో

అతనంటే పాములకు ఎందుకంత పగ..వెంటాడి మరీ వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!
