కుంభమేళాకు చివరిరోజు..మళ్లీ 144 సంవత్సరాల తర్వాతే..వీడియో
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం.... 144 ఏళ్లకోసారి జరిగే మహాగొప్ప ఉత్సవం ఇవాళ్టితో ముగుస్తుంది. సామన్యుడి నుంచి ప్రధానమంత్రి వరకూ అందరూ పాల్గొన్నారు. మహాకుంభమేళా ముగియనున్న నేపథ్యంలో భక్తులు చివరి అమృత స్నానం కోసం త్రివేణీ సంగమానికి పోటెత్తుతున్నారు. వేల కొద్దీ భక్తులు పుణ్య స్నానం కోసం బారులు తీరారు. కుంభమేళాలో మహాశివరాత్రి పర్వదినానికి అత్యంత ప్రాముఖ్యత ఉన్న విషయం తెలిసిందే. ఈ రోజున పుణ్య స్నానంతో మోక్షం లభిస్తుందనేది భక్తుల విశ్వాసం.
హిందూ పురాణాల ప్రకారం, సముద్ర మథనం సందర్భంగా జనించిన హాలాహలాన్ని పరమశివుడు స్వీకరించి గరళ కంఠుడిగా మరాడు. ఇక సముద్రగర్భం నుంచి ఉద్భవించిన అమృతభాండం నుంచి చిలికిన బిందులు త్రివేణీ సంగమంలో పడ్డాయని భక్తులు నమ్ముతారు. హరహర మహాదేవ్ నినాదాలతో మార్మోగుతోంది ప్రయాగ్‌రాజ్. శివరాత్రి పర్వదినం కావడంతో త్రివేణి సంగమ ఘాట్లు భక్తులతో కిక్కిరుస్తున్నాయి. ఇవాళ చివరి రోజు అమృత స్నానం… అందులోనూ శివరాత్రి కావడంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసింది యూపీ ప్రభుత్వం. ప్రయాగ్‌రాజ్ ప్రాంగణాన్ని ‘నో వెహికల్ జోన్’గా ఇప్పటికే ప్రకటించారు. ఇక కుంభమేళా ముగిసిన అనంతరం భక్తులు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకునేలా రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు ప్రయాగ్‌రాజ్ నుంచి 350 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇక చివరి రోజున భక్త జన సందోహం పోటెత్తే అవకాశం ఉండటంతో ప్రయాగ్‌రాజ్‌లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాత్రంతా అధికారులు హైలర్ట్‌లో ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
పంటి నొప్పితో ఆస్పత్రికొచ్చి ప్రాణాలు కోల్పోయింది.. డాక్టర్లు CT స్కాన్ చేయగా
మస్క్ కాళ్లను ట్రంప్ పట్టుకున్నట్టుగా వీడియో.. అమెరికా ప్రభుత్వ కార్యాలయంలో టెలికాస్ట్.. చివరకు..
అయ్యో.. ఆ బంగారు టాయిలెట్‌ను దొంగలు దోచుకెళ్లారు!వీడియో
పెళ్లికి తప్పతాగి వచ్చిన వరుడు.. ఏం చేశాడో చూస్తే షాకవుతారు!వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
