AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Top 9 ET: సింహమల్లే సూపర్ స్టార్!.. గూస్ బంప్స్ పుట్టిస్తున్న మహేష్‌ పిక్..

తన పేరుతో ఓ యూనివర్స్ క్రియేట్ చేసి.. తన సినిమాలన్నింటినీ కలుపుకుంటూ పోతున్న టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు బంపర్ ఆఫర్ పట్టేశాడట. హోంబలి ప్రొడక్షన్స్‌లో.. ప్రభాస్ హీరోగా బ్రహ్మ రాక్షస్ అనే సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడ.అయితే ఈ క్రమంలోనే తాను చేయాల్సిన స్టార్ హీరో డెబ్యూ సినిమాను పక్కన పెట్టేశాడని ఇప్పుడు టాలీవుడ్లో స్ట్రాంగ్ గా వినిపిస్తున్న న్యూస్. మరి దీనిపై ప్రశాంత్ వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి.

Rajitha Chanti
|

Updated on: Mar 01, 2025 | 9:54 PM

Share

జక్కన్న డైరెక్షన్లో మహేష్ చేస్తున్న సినిమా ssmb29. ఎన్నో అంచనాల మధ్య, గప్ చుప్‌గా తెరకెక్కుతున్న ఈసినిమాలో మహేష్ ఎలా ఉంటాడనే క్యూరియాసిటీ అందర్లో ఉంది. అయితే ఈ క్యూరియాసిటీని తగ్గించేలా.. తాజాగా బాబు లుక్ బయటికి వచ్చింది. జిమ్‌ చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించిన 14 సెకండ్ల వీడియో ఒకటి నెట్టింట లీకైంది. ఇక ఆ వీడియోలో రింగులు తిరిగిన భారీ జుట్టుతో.. అచ్చం సింహంలా మహేష్ కనిపించడం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో.. ఫిల్మ్ లవర్స్‌ మధ్యలో హాట్ టాపిక్ అవుతోంది. ఈసినిమాపై ఎక్కడ లేని అంచనాలను పెంచేస్తోంది.