IND vs NZ: టాస్ ఓడిన టీమిండియా.. ప్లేయింగ్ 11 ఇదే!
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఓడిపోయారు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దీంతో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో ఎన్ని పరుగులు చేస్తుందో చూడాలి. మ్యాచ్ ఫలితం ఆసక్తికరంగా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఈ రోజు(ఆదివారం, మార్చి 2) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో భారత జట్టు తలపనుంది. ఈ రెండు టీమ్స్‌కు ఇదే చివరి గ్రూప్ మ్యాచ్. ఇప్పటికే ఈ రెండు టీమ్స్ కూడా సెమీస్ చేరిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ఫలితం తర్వాత ఏ జట్టు గ్రూప్-ఏ టాపర్‌గా, ఏ టీమ్ సెకండ్ ప్లేస్‌లో నిలిచి సెమీస్‌లో ఈ టీమ్‌తో ఆడాలో డిసైడ్ అవుతుంది. ఇప్పటికే గ్రూప్ బీ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీస్ చేరిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌పై టీమిండియా గెలిస్తే.. సెమీస్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఒక వేళ ఓడితే సౌతాఫ్రికాతో సెమీస్‌లో తలపడాలి. ఏ జట్టుతో టీమిండియా సెమీస్ ఆడాలో.. న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఫలితం తేల్చనుంది. దీంతో ఇప్పటికే ఆసీస్, సౌతాఫ్రికా జట్లు దుబాయ్‌కి చేరుకున్నాయి. మార్చ్ 4న తొలి సెమీస్ జరగనుంది.
టీమిండియాతో ఏ జట్టు సెమీస్ ఆడాలో ఇంకా స్పష్టత రాకపోవడంతో ఆసీస్, ప్రొటీస్ రెండు టీమ్స్‌ను కూడా దుబాయ్ రప్పించింది ఐసీసీ, టీమిండియా గెలిస్తే ఆసీస్ అక్కడే ఉండి సౌతాఫ్రికా జట్టు తిరిగి పాకిస్థాన్ వెళ్తుంది. ఒక వేళ టీమిండియా ఓడితే.. సౌతాఫ్రికా అక్కడే ఉండి, ఆస్ట్రేలియా పాకిస్థాన్ వెళ్తుంది. ఇక ఇంత కీలకమైన మ్యాచ్ కోసం టీమిండియా ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. పేసర్ హర్షిత్ రాణా స్థానంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌తో బరిలోకి దిగింది టీమిండియా. మిగతా టీమ్ అంతా సేమ్ ఉంది. ఇక టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ సాంట్నర్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది. కాగా ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీకి 300 అంతర్జాతీయ వన్డే మ్యాచ్. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై సెంచరీ చేసిన విరాట్, ఇప్పుడు మరోసారి న్యూజిలాండ్‌పై మంచి స్కోర్ చేసి తన 300వ వన్డేను మరింత మెమరబుల్‌గా మార్చుకోవాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.
ఇండియా (ప్లేయింగ్ ఎలెవన్): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
న్యూజిలాండ్ (ప్లేయింగ్ ఎలెవన్): విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, కైల్ జామిసన్, విలియం ఓరూర్కే
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
