IND vs NZ: కుప్పకూలిన టీమిండియా టాపార్డర్! రోహిత్, కోహ్లీ కూడా..
న్యూజిలాండ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్‌లో టీమిండియా టాప్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, గిల్ తక్కువ స్కోర్లకే అవుట్ అయ్యారు. కోహ్లీ అద్భుతమైన క్యాచ్‌తో అవుట్ అయ్యాడు. మూడు కీలక వికెట్లు కోల్పోయిన తర్వాత, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాల్సి ఉంది.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ కుప్పకూలింది. కేవలం 30 పరుగులకే టీమిండియా మూడు కీలక వికెట్లు కోల్పోయింది. అందులో అతి ప్రధానమైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వికెట్ కూడా ఉన్నాయి. తొలి వికెట్‌గా ఓపెనర్ శుబ్‌మన్ గిల్(7 బంతుల్లో 3 పరుగులు) అవుట్ అయ్యాడు. ఇన్నింగ్స్ 3 ఓవర్ ఐదో బంతికి మ్యాన్ హెన్రీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఒక ఫోర్, ఒక అద్భుతమైన సిక్స్ కొట్టి సూపర్ టచ్‌లో కనిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ కూడా కొద్ది సేపటికే అవుట్ అయ్యాడు. ఇన్నింగ్స్ 6వ ఓవర్ తొలి బంతికి జిమిసన్ బౌలింగ్‌లో విల్ యంగ్‌కు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ వెనుదిరిగాడు.
రోహిత్ 17 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 15 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. 22 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకున్న టీమిండియాను విరాట్ కోహ్లీ ఆదుకుంటాడు అనుకుంటే.. కోహ్లీ కూడా రెండు ఫోర్లు కొట్టి 14 బంతుల్లో 11 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఇన్నింగ్స్ 7వ ఓవర్ 4వ బంతికి మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో పాయింట్ దిశగా సూపర్ షాట్ ఆడాడు కోహ్లీ. కానీ అంతకంటే అద్భుతమైన క్యాచ్‌తో గ్లెన్ ఫిలిప్స్ కోహ్లీని పెవిలియన్ చేర్చాడు.
పాయింట్‌లో పిలిప్స్ గతంలో కూడా కళ్లు చెదిరే క్యాచ్‌లు అందుకున్నాడు. ఇప్పుడు అతని ఫీల్డింగ్ విన్యాసానికి కోహ్లీ కూడా బలయ్యాడు. ఆ క్యాచ్ చూసి.. కోహ్లీ కూడా షాక్ అయ్యాడు. మూడు కీలక వికెట్లు కోల్పోయిన తర్వాత టీమిండియా ఇన్నింగ్స్ నిలబడాలంటే.. ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ భారీ పార్నర్‌షిప్ బిల్డ్ చేయాలి. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి న్యూజిలాండ్ కెప్టెన్ సాంట్నర్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం న్యూజిలాండ్ గేమ్ చూస్తుంటే.. అతని నిర్ణయం వంద శాతం కరెక్ట్‌గా కనిపిస్తుంది.
The flight named Glenn Phillips flies again.#INDvsNZ pic.twitter.com/5HTo4HmieR
— AB (@anythingiscntnt) March 2, 2025
