Geetu Royal: ఛీ..ఛీ.. తిరుమలలో ఇలాంటి పనులా? బిగ్‌బాస్ ఫేమ్ గీతూపై భక్తుల తీవ్ర ఆగ్రహం.. వీడియో ఇదిగో

పవిత్రమైన తిరుమల శ్రీవారి క్షేత్రంలో కొందరు సెలబ్రిటీలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. టీటీడీ అధికారులు ఎంతగా హెచ్చరిస్తున్నా వినకుండా ఓవరాక్షన్ చేస్తున్నారు. తద్వారా హిందూ భక్తుల ఆగ్రహానికి గురవుతున్నారు. తాజాగా బిగ్ బాస్ తెలుగు ఫేమ్ గీతూ రాయల్ తిరుమలలో చేసిన ఓ పని తీవ్ర వివాదాస్పదమవుతోంది

Geetu Royal: ఛీ..ఛీ.. తిరుమలలో ఇలాంటి పనులా? బిగ్‌బాస్ ఫేమ్ గీతూపై భక్తుల తీవ్ర ఆగ్రహం.. వీడియో ఇదిగో
Geethu Royal

Updated on: Feb 28, 2026 | 4:49 PM

తిరుమల శ్రీవారి ఆలయాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు భక్తులు. అందుకే అక్కడ ఎంతో నియమ నిష్టలతో ఉంటారు. అయితే ఇటీవల కొందరు సామాన్య భక్తులతో పాటు సెలబ్రిటీలు తిరుమలలో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఇన్ స్టా గ్రామ్ రీల్స్, షార్ట్స్ కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఆ మధ్యన బిగ్ బాస్ ఫేం ప్రియాంక జైన్, తిరుమల రహదారిలో పులి వస్తుందంటూ షేర్ చేసిన వీడియోపై భక్తులు, నెటిజన్లు మండిపడ్డారు. అయితే టీటీడీ చర్యలు తీసుకునేలోపే ఆమె క్షమాపణలు చెబుతూ వీడియోను డిలీట్ చేసింది. తాజాగా ఓవరాక్షన్ కు మారుపేరైన బిగ్ బాస్ ఫేస్ గీతూ రాయల్ తిరుమలలో ప్రవర్తించిన తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లిన ఆమె అక్కడ తన నలుగురు మగ స్నేహితులతో కలిసి నానా హంగామా చేసింది. పవిత్రమైన తిరుమల ఆలయం ఎదుట ముందు నిలబడి ‘ఖడ్గం’ సినిమాలోని ఒక పాటకు రీల్ చేసింది. అలాగే పుష్కరిని, లడ్డు కౌంటర్, ఘాట్ రోడ్ వద్ద రీల్స్ చేశారు. ఎంతో భక్తి భావంతో ఉండాల్సిన చోట సినిమా పాటలకు స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. వీటిని చూసిన భక్తులు, నెటిజన్లు గీతూ గ్యాంప్ పై మండిపడుతున్నారు. స్వామివారి సన్నిధిలో నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇలా రీల్స్ చేయడం ఏంటి ? ఇలాంటి వారిపై టీటీడీ కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కాగా తన వీడియోలపై వివాదం చెలరేగడం, టీటీడీ చర్యలకు ఉపక్రమిస్తుందన్న వార్తల నేపథ్యంలో గీతూ రాయల్ వెంటనే ఆ వీడియోలను డిలీట్ చేసింది. అయితే ఆ తర్వాత మరికొన్ని వీడియోలను షేర్ చేసిన గీతూ చాలా వ్యంగంగా మాట్లాడింది. ‘అందరికీ ఒక గుడ్ న్యూస్.. నా మీద చర్యలు తీసుకుంటారంట, ఇక హ్యాపీగా ఉండండి. ఒక చిన్న విషయాన్ని ఇంత పెద్దది చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇప్పటికే నా జీవితంలో సగం కోల్పోయాను, పోగొట్టుకోవడానికి ఇక ఏమీ మిగలలేదు. ఉన్న కొద్దిపాటి జీవితాన్ని కూడా మీరే తీసేసి సంతోషంగా ఉండండి. మా టీమ్ లో ఒకరికి టోకెన్ రాని నేపథ్యంలో ఎదురుచూస్తున్నాం. ఆ సమయంలోనే స్వామివారి పాటకు రీల్స్ చేశాం. అది వివాదాస్పదం కావడంతో ఆ వీడియోని డిలీట్ చేశాను. అయితే మీ కామెంట్లకు భయపడి నేను వీడియోలు డిలీల్ చేయలేదు. కర్మకు భయపడి డిలీట్ చేశాను.’

ఇవి కూడా చదవండి

మీ కామెంట్స్ కు భయపడి కాదు..

‘నన్ను ఎంతో మంది ఫాలో అవుతున్నారు. వారు కూడా ఇలాంటి రీల్స్ చేసి వారికి ఏదైనా జరగరానిది జరిగితే ఈ జన్మలో నన్ను నేను క్షమించుకోలేను. ఇలా రీల్స్ చేయడం వల్ల నాకు దేవుడి మీద భక్తి లేదని కాదు’ అంటూ చెప్పుకొచ్చింది గీతూ రాయల్. ప్రస్తుతం ఈ బిగ్ బాస్ బ్యూటీ వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. వీటినై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us