AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajendra Prasad: ఆ స్టార్ హీరో నాకు 14 సినిమాల ఛాన్స్ ఇప్పించారు.. ఆయనది గోల్డెన్ హార్ట్

టాలీవుడ్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా సినీరంగంలో హీరోగా, సహాయ నటుడిగా అలరిస్తున్నారు. ఇప్పటికీ వరుస సినిమాలతో మెప్పిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఓ స్టార్ హీరో గురించి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Rajendra Prasad: ఆ స్టార్ హీరో నాకు 14 సినిమాల ఛాన్స్ ఇప్పించారు.. ఆయనది గోల్డెన్ హార్ట్
Rajendraprasad
Rajeev Rayala
|

Updated on: Jun 03, 2026 | 9:40 PM

Share

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తన సినీ ప్రస్థానంలో సూపర్‌స్టార్ కృష్ణ అందించిన అపూర్వమైన సహాయాన్ని, మద్దతును గతంలో ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. సంవత్సరానికి పదిహేను సినిమాలు చేసే హీరోగా కృష్ణ గారిని ప్రశంసించిన రాజేంద్ర ప్రసాద్, ఆయనతో తన అనుబంధాన్ని వివరించారు. రాజేంద్ర ప్రసాద్‌కి సూపర్‌స్టార్ కృష్ణతో తొలి అనుభవం రామరాజ్యంలో భీమరాజు చిత్రం ద్వారా కలిగింది. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. వాస్తవానికి ఈ సినిమాలో రావు గోపాలరావు గారి కొడుకు, విలన్ పాత్రకు నటుడు సుభాకర్ ఎంపికయ్యారని, అయితే అనుకోకుండా ఆ పాత్ర తనకు లభించిందని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ పాత్ర విలన్‌గా కాకుండా కామెడీ మిక్స్ అయిన ఒక ప్రత్యేకమైన పాత్ర అని, దీనిలో శ్రీదేవి హీరోయిన్‌గా నటించారని చెప్పారు. పెళ్లి సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో, కృష్ణ గారు రాజేంద్ర ప్రసాద్ పక్కన కూర్చుని మాట్లాడారని.. ఈ సన్నివేశంలో తన నటనను చూసి సూపర్‌స్టార్ కృష్ణ ఆశ్చర్యపోయి, “ఎవడ్రా వీడు, భలే యాక్ట్ చేస్తున్నాడు!” అని దర్శకుడు ఏ. కోదండరామిరెడ్డిని అడిగారని రాజేంద్ర ప్రసాద్ గుర్తు చేసుకున్నారు.

కృష్ణ గారి ప్రశంసలు తనకు ఎంతో ఆనందాన్నిచ్చాయని, అప్పటికప్పుడు తన పేరును అడిగి తెలుసుకున్నారని వివరించారు. ఈ సంఘటనతో కృష్ణ గారి అభిమానం రాజేంద్ర ప్రసాద్‌పై పెరిగింది. ఆ తర్వాత కె. బాపయ్య దర్శకత్వంలో రూపొందనున్న ముందడుగు చిత్రం గురించి ప్రస్తావనకు వచ్చినప్పుడు, గుడ్డి చెల్లెలికి మొగుడు అయిన బావమరిది పాత్రకు మరొక నటుడిని అనుకున్నారని, కానీ కృష్ణ గారు నేరుగా బాపయ్య గారిని పిలిచి, “ఆయనేవడయ్యా! ఈ కుర్రాడిని పెట్టుకోండి. చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు!” అంటూ రాజేంద్ర ప్రసాద్‌ను సిఫార్సు చేశారని తెలిపారు. కృష్ణ గారిది గోల్డెన్ హార్ట్ అని, అలాంటి పెద్ద మనసు గలవారు అరుదుగా ఉంటారని రాజేంద్ర ప్రసాద్ కొనియాడారు.

కృష్ణ గారు, విజయనిర్మల గారు ఇద్దరూ కలిసి తనకు మొత్తం 14 సినిమాలు ఇప్పించారని, ఇది తన అదృష్టంగా భావిస్తున్నానని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఎస్.పి. వెంకన్న బాబు వంటి మేనేజర్ సహాయంతో తాను రామరాజ్యంలో భీమరాజులో వేషం పొందినట్లు వివరించారు. ముందడుగు సినిమా విడుదలైన తర్వాత, హైదరాబాద్‌లోని థియేటర్‌లో తాను బైక్ మీద సాహసంగా వచ్చి పెళ్ళికూతుర్ని ఎత్తుకెళ్లే సన్నివేశానికి ప్రేక్షకుల నుంచి వచ్చిన అపూర్వ స్పందన గురించి కృష్ణ గారు స్వయంగా ప్రస్తావించారని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. అంతేకాకుండా, రామరాజ్యంలో భీమరాజు చిత్రం చూడమని కృష్ణ గారు, విజయనిర్మల గారు తనను ప్రోత్సహించారని, ఆ చిత్రంతో తనకు మంచి పేరు వచ్చిందని వారు చెప్పారని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కృష్ణ గారు ఎంత జెంటిల్‌మెన్‌గా ఉండేవారో ఈ సంఘటనలు రుజువు చేస్తాయని, చివరి వరకు ఆయన తనకు మద్దతుగా నిలిచారని రాజేంద్ర ప్రసాద్ కృతజ్ఞతతో స్మరించుకున్నారు. కృష్ణ, విజయనిర్మల వంటి గొప్ప వ్యక్తుల ప్రోత్సాహం తన కెరీర్‌కు బలంగా నిలిచిందని ఆయన తెలిపారు.

Krishna

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us