తెలంగాణ పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా దేత్తడి హారిక.. ముదురుతున్న వివాదం పై స్పందించిన బిగ్‌బాస్ బ్యూటీ..
Telangana tourism brand ambassador Dethadi Harika: మహిళా దినోత్సవం సందర్భంగా యూట్యూబర్ దేత్తడి హారికను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా
Telangana tourism brand ambassador Dethadi Harika: మహిళా దినోత్సవం సందర్భంగా యూట్యూబర్ దేత్తడి హారికను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. అదే రోజు ఆ సంస్థ చైర్మన్ శ్రీనివాస గుప్త బ్రాండ్ అంబాసిడర్‌గా హారికను నియమిస్తూ.. నియామక పత్రాన్ని అందజేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి కాస్త వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే నియమించిన కాసేపటికే హారిక వివరాలను పర్యాటక శాఖ వెబ్ సైట్ నుంచి తొలగించారు. ఇందుకు కారణం పర్యాటక బ్రాండ్ అంబాసిడర్ పోస్ట్ గురించి చైర్మన్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాడని… ఇదేవిషయంపై సదరు మంత్రి శ్రీనివాస్ గుప్తపై సీరియస్ అయ్యాడని వార్తలు వినిపించాయి. దీంతో బ్రాండ్ అంబాసిడర్ గా హారికను నియమించడంపై వివాదం నెలకొంది. ఈ క్రమంలోనే అధికారులు అధికారిక వెబ్‌సైట్‌లో అలేఖ్యకు నియామకానికి సంబంధించిన వివరాలను తొలగించారు.
తాజాగా ఈ వివాదంపై దేత్తడి హారిక ట్విట్టర్ వేదికగా స్పందించింది. “నమస్తే పిపూల్.. నాపై వస్తున్న పుకార్లను క్లారిఫై చేసుకునేందుకు ఈ వీడియోను చూడండి. తెలంగాణ టూరిజం కోసం అందరం కలిసి పనిచేద్దాం. థ్యాంక్యు” అంటూ ట్వీట్ చేసింది. యూట్యూబ్‌లో తన ప్రోగ్రామ్స్ ద్వారా మంచి గుర్తింపు పొందిన హారిక.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది. ఆ క్రేజ్‌తోనే హారిక బిగ్‌బాస్ 4 సీజన్‌కు సెలక్ట్ అయ్యింది. ఈ సీజన్‌లో టాప్ 5 కంటెస్టంట్‌లలో ఒకరుగా నిలిచి.. స్ట్రాంగ్ విమెన్‌గా సత్తా చాటింది. సీజన్ విన్నర్ అభిజిత్‌తో హారికకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. కాగా, హారికకు యూట్యూబ్‌లో 1.60 లక్షల మంది సబ్‌స్కైబర్లు ఉన్నారు. ఆమె యాస, భాష పక్కా తెలంగాణ స్టైల్లో ఉంటాయి.
Namastey people.. Here is the video for better understanding regarding all the rumours that is spreading over Please do watch it. Lets together work for development of Telangana tourism TSTDC by promoting it Thank you ? https://t.co/oNLeGvzYjY
— Alekhya Harika (@harika_alekhya) March 10, 2021
Also Read: