Bigg Boss 9 Telugu : అదరగొట్టిన సుమన్ శెట్టి.. ఓటమితో తనూజ ఏడుపు.. ఓదార్చిన పవన్ పై సీరియస్..
బిగ్‌బాస్ సీజన్ 9.. టాస్క్ అంటే ముందుంటుంది.. ఓడిపోతే ఏడవడం.. ఇలా చెప్పగానే గుర్తొచ్చే పేరు తనూజ. టాస్కు ఓడిపోయినా... గెలిచినా తనూజ వాడే మొదటి అస్త్రం ఏడుపు. నిన్నటి టాస్కులోనూ అదే జరిగింది. సుమన్ శెట్టితో పోటి పడి ఓడిపోయింది తనూజ. దీంతో హౌస్మేట్స్ ఆమెను ఓదార్చారు. మరీ నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందామా.

బిగ్‌బాస్ సీజన్ 9.. ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యేందుకు పోటీ జరుగుతుంది. ఇప్పుడు హౌస్ లో వరుస టాస్కులతో ఫైనలిస్ట్ అయ్యేందుకు నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడుతున్నారు. మొన్నటి ఎపిసోడ్ లో తనూజ, భరణి, డీమాన్ టాస్కు ఆడగా.. తనూజ గెలిచి తన గడుల సంఖ్యను పెంచుకుంది. ఆ తర్వాత ఆమె మరో ప్లేయర్ ను ఛాలెంజ్ చేసి గేమ్ ఆడాలి. అలా సుమన్ శెట్టిని ఎంపిక చేసుకుంది. నిన్నటి ఎపిసోడ్ లో వీరిద్దరికి బ్యారెల్-బ్యాలెన్స్-బ్యాటిల్ అనే టాస్క్ పెట్టాడు. ఇందులో ఇద్దరు ప్లేయర్లు బ్యారెల్ కింద నిలబడి దానికున్న రోప్స్ పట్టుకుని గ్రిప్ వదలకుండా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. బజర్ మోగినప్పుడల్లా సంచాలక్ పిలిచిన వ్యక్తి వచ్చి ఫస్ట్ ఫైనలిస్ట్ గా చూడకూడదనుకుంటున్న పోటీదారుని బ్యారెల్ లో ట్యాప్ తిప్పి నీళ్లు నింపాలి. చివరి వరకు ఎరు బ్యారెల్ ను బ్యాలెన్స్ చేయలేక ముందుగా గ్రింప్ వదిలి ప్లిప్ అయ్యేలా చేస్తారో వాళ్లే ఓడిపోయినట్లు.
ఇవి కూడా చదవండి : Maheshwari : పెళ్లి సినిమా హీరోయిన్ గుర్తుందా.. ? ఆమె కూతురు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్..
ఈ టాస్కుకు సంజన సంచాలక్ కాగా.. భరణి, డీమాన్ పవన్ మాత్రం సుమన్ శెట్టికి సపోర్ట్ చేస్తూ తనూజ బ్యారెల్ నింపేందుకు ట్రై చేశారు. కళ్యాణ్, రీతూ, ఇమ్మాన్యూయేల్ ముగ్గురూ తనూజకు సపోర్ట్ చేశారు. చాలా సేపటి తర్వాత తనూజ బ్యారెల్ వదిలేసింది. దీంతో ఆమె ఈ టాస్కులో ఓడిపోయింది. దీంతో ఏడుస్తూ కూర్చుండిపోయింది. బాగా ఆడావ్ ఏడవకు అంటూ ఇమ్మూ, సంజన ఓదార్చారు. ఆ తర్వాత సుమన్ శెట్టి కింద కూర్చుండిపోవడంతో అందరూ అతడి దగ్గరకు పరిగెత్తారు. కాసేపటికి కిచెన్ దగ్గర మళ్లీ ఏడవడం స్టార్ట్ చేసింది తనూజ.
ఇవి కూడా చదవండి : Actor : ఒకప్పుడు మామిడి కాయలు అమ్మాడు.. ఇండస్ట్రీలోనే టాప్ నటుడు.. ఒక్కో సినిమాకు కోట్ల రెమ్యునరేషన్..
దీంతో ఇమ్మూ, సంజన, కళ్యాణ్ ఓదార్చారు. చివరగా డీమాన్ కూడా తనూజను ఓదార్చడానికి ట్రై చేశాడు. ఏడ్చావ్ బాధ అయిపోవాలి అంతే.. పద్దాక వద్దు అని డీమాన్ అనడంతో.. ఇదేమైనా కాలేజ్ గేమ్స్ లో ఓడిపోయామా పద్దాక ఏడవడానికి.. ఏం చేయమంటావ్ ఇల్లు వదిలేసి వచ్చిందే గెలవడం కోసం.. ఓడిపోతే నవ్వుతామా.. నేను ఓడిపోయానని చెప్పనా అంటూ డీమాన్ పై సీరియస్ అయ్యింది. ఇవి కూడా చదవండి : Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. బ్రహ్మానందంపై అలాంటి మాటలా.. ?




