
బిగ్ బాస్ సీజన్ 9 ముగిసిన సంగతి తెలిసిందే. ఈసారి ఫస్ట్ కామనర్ గా హౌస్ లోకి అడుగుపెట్టి.. చివరకు బిగ్ బాస్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాడు కళ్యాణ్ పడాల. సామాన్యుడిగా వెళ్లి అసాధ్యుడిగా మారాడు. తన ఆట తీరు, మాటలతో జెన్యూన్ గా ఉంటూ.. చివరకు బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు. ఈ షో తర్వాత తన కుటుంబం, అభిమానులతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడంలో బిజీ అయిపోయాడు. ఇప్పుడిప్పుడే స్టార్ మాలో ప్రసారమయ్యే పలు షోలలో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే ఫేమ్ ఉండగానే మరోసారి జనాలకు దగ్గరయ్యేందుకు కొత్త ప్రయాణం స్టార్ట్ చేశాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఇంతకీ కళ్యాణ్ పడాల చెప్పిన ఆ గుడ్ న్యూస్ ఏంటీ.. ? తనకు వచ్చిన ఐడియాను అమల్లోకి తీసుకువచ్చాడా ? అనేది ఇప్పుడు తెలుసుకుందామా.
ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..
ఇది కేవలం ప్రారంభం మాత్రమే ఉంటూ గుడ్ న్యూస్ పంచుకున్నాడు కళ్యాణ్ పడాల. ఇక పై తాను సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్లు తెలిపాడు. అందులో తన వ్యక్తిగత విషయాలు, సరదా క్షణాలు, గుణపాఠాలు ఇలా ప్రతీది అభిమానులతో పంచుకునేందుకు యూట్యూబ్ స్టార్ట్ చేసినట్లు వెల్లడించాడు. ప్రేక్షకుల ప్రేమ వల్లే తాను ఇంతదూరం వచ్చానని.. ఇప్పుడు యూట్యూబ్ జర్నీకి మీ అందరి సపోర్ట్ కావాలని పోస్ట్ పెట్టాడు.
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
తాను బిగ్ బాస్ హౌస్ లో ఉండగా తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. తన గేమ్ నచ్చి ఓటు వేసిన వారికి జీవితాంతం రుణపడి ఉంటానని.. కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానని.. తమ ఛానల్ కు సపోర్ట్ చేయాలని కోరాడు. దీంతో ఇప్పుడు కళ్యాణ్ పడాలకు నెటిజన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇటీవల మా సంక్రాంతి వేడుకలలో పాల్గొన్న కళ్యాణ్ మరోసారి తనూజ పై ఉన్న ప్రేమను, గౌరవాన్ని బయటపెట్టాడు.
ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..