బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్‍బాస్ తెలుగు సీజన్ 8 అప్పుడే మూడో వారానికి వచ్చేసింది. గత సీజన్లతో పోల్చుకుంటే ఈసారి మరీ పేరున్న కంటెస్టెంట్స్ హౌస్ లో లేకపోయినా కొందరు మాత్రం ఆడియెన్స్ కు మంచి ఎంటర్ టైన్మెంట్ అందిస్తున్నారు. కాగా రెండో వారం ఎలిమినేషన్ అందరినీ షాక్ కు గురిచేసింది. హౌస్ లో అంతో ఇంతో ఫన్ అందిస్తోన్న శేఖర్ బాషాను బయటకు పంపించి ఆడియెన్స్ కు బిగ్ షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. రాబోయే రోజుల్లోనూ ఇలాంటి షాక్ లు చాలా ఉన్నాయనే తెలుస్తోంది. ఇక మూడో వారం నామినేషన్ల ప్రక్రియ కూడా హోరాహోరీగా సాగింది. ఒకరిపై ఒకరు అరిచేసుకుంటూ తమకు నచ్చని వారిని నామినేట్ చేశారు. ప్రస్తుతం హౌస్ లో 12 మంది కంటెస్టెంట్స్ ఉంటే మూడో వారం ఎనిమిది మంది నామినేషన్స్ లోకి వచ్చారు. గత వారం కూడా ఎనిమిది మందే నామినేట్ అవ్వడం గమనార్హం. మూడో వారం నామినేట్ అయిన వారిలో నాగమణికంఠ, యష్మీ , కిర్రాక్ సీత, నైనిక, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, అభయ్ నవీన్ ఉన్నారు. కాగా టీమ్ లీడర్స్‌ని ఎవరూ నామినేట్ చేయొద్దని చెప్పిన బిగ్‌బాస్.. వీళ్లలో ఒకరు నామినేషన్స్‌లో ఉండాలని చెప్పాడు.
కాగా ఈ వారంలో ప్రముఖ నటుడు అభయ్ నవీన్ సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. తన గురించి ఆడియెన్స్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందామన్న ఆసక్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అభయ్ నవీన్ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఇదే నవీన్ పాలిట యమ గండంలా మారనుందని తెలుస్తోంది. ఎందుకంటే ఓటింగ్ ప్రక్రియ ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఎప్పటిలాగే విష్ణుప్రియ టాప్‌లో కొనసాగుతోంది. ఆ తర్వాత వరసగా మణికంఠ, సీత, యష్మీ గౌడ, నైనిక, అభయ్ నవీన్, పృథ్వీరాజ్ ఉన్నారు. ప్రస్తుతం ఓటింగ్ ప్రకారం అభయ్ నవీన్, పృథ్వీరాజ్ డేంజర్ జోన్ లో ఉన్నారు. కానీ గత వారం లాగే ఈ వీక్ కూడా పృథ్వీని బిగ్ బాస్ సేవ్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో ఇప్పుడు అభయ్ నవీన్ డేంజర్ జోన్ లో ఉన్నాడు. ఓటింగ్ సరళి ఇలాగే కొనసాగితే మాత్రం అభయ్ బయటకు వెళ్లక తప్పదు. ఇలా జరిగితే మాత్రం ఇతనంత దురదృష్టవంతుడు మరొకడు ఉండడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.